
ప్రతీకాత్మక చిత్రం
వాటికన్ సిటీ : ప్రార్థన చేస్తూ తానూ నిద్రలోకి జారుకున్న సందర్భాలు ఉన్నాయని పోప్ ఫ్రాన్సిస్ చెప్పారు. దాదాపు సెయింట్లు అందరికీ ఈ అనుభవం ఎదురవుతుందని వెల్లడించారు. మంగళవారం క్యాథలిక్ టీవీ 2000లో ప్రసారమైన ఓ కార్యక్రమంలో పోప్ ఈ విషయం చెప్పారు.
19వ శతాబ్దానికి చెందిన ఫ్రెంచ్ నన్ సెయింట్ థెరిస్‌కూ ఇలాంటి అనుభవాలు ఎదురైన సంఘటనలున్నాయని అన్నారు. సాధారణ ప్రజలను కలిసినప్పుడు పోప్ తన శక్తిని రేడియట్ చేస్తారు. అయితే, పోప్ ప్రార్థన చేసే సమయంలో ఆయన ముఖ కవళికలు భిన్నంగా ఉంటాయి.