To Hurt A Woman Is To Insult God": Pope Francis In New Year's Speech: పోప్ ఫ్రాన్సిస్ నూతన సంవత్సర ప్రసంగంలో మహిళలపై హింసను అరికట్టాలని పిలుపునిచ్చారు. స్త్రీని అవమానించడం అంటే దేవుడిని అవమానించడమేనని అన్నారు. అంతేకాదు సెయింట్ పీటర్స్ బసిలికాలోని రోమన్ క్యాథలిక్ చర్చిలో పవిత్ర మేరీ మాత సమక్షంలో నూతన సంవత్సర వేడుకల తోపాటు ప్రపంచ శాంతి దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు
(చదవండి: ఐదేళ్ల జైలు శిక్ష తర్వాత మాజీ అధ్యక్షురాలికి క్షమాభిక్ష)
పైగా ఫ్రాన్సిస్ నూతన సంవత్సర వేడుకల్లో మహిళలు మనకు జీవితాన్ని ప్రసాదించడమే కాక ప్రపంచాన్ని ఐక్యమత్యంగా ఉంచుతారు కాబట్టి మనమందరం మహిళలను రక్షించడానికే ఎక్కువ ప్రయత్నాలు చేద్దాం అని పిలుపునిచ్చారు. అంతేకాదు మానవత్వానిక ప్రతీక అయిన స్త్రీని అవమానించటం అంటే దేవుడిని అవమానించడమే అని స్పష్టం చేశారు. పైగా కోవిడ్ లాక్‌డౌన్ సమయాల్లో గృహహింస గురించి ఫ్రాన్సిస్ చాలాసార్లు మాట్లాడారు. అంతేకాక రాబోయే సంవత్సరంలో వాటికన్‌లో తనను అధికారికంగా సందర్శించే నాయకులకు పోప్ సంతకం చేసిన కాపీని అందజేస్తారు.
(చదవండి: రోగితో నర్సు చాటింగ్.. రూ. 20 లక్షలు ఇవ్వమంటూ బ్లాక్‌మెయిల్!)
Comments
Please login to add a commentAdd a comment