రేపే మదర్‌కు సెయింట్‌హుడ్
న్యూఢిల్లీ: వాటికన్ సిటీలో ఆదివారం మదర్ థెరిసాకు ‘సెయింట్‌హుడ్’ బహుకరించనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ నేతృత్వంలో 12 మంది భారత ప్రతినిధుల బృందం శుక్రవారం రోమ్ బయలుదేరి వెళ్లింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, బెంగాల్ సీఎం మమత కూడా రోమ్‌కు బయల్దేరి వెళ్లారు.
మదర్ అద్భుతం చేసినందుకే..: 1998లో బెంగాలీ మహిళ మోనికా బెస్రాకు అండాశయ కేన్సర్ మదర్ వల్లే నయమైందని 2002లో గుర్తించారు. అలాగే బ్రెజిల్‌కి చెందిన మార్సిలియో హడ్డాడ్ ఆండ్రియో బ్రెయిన్ ట్యూమర్ నుంచి కోలుకున్నారు. మరణానంతరం కూడా మహిమ చూపడంతో మదర్‌కు సెయింట్‌హుడ్ ఇవ్వనున్నట్లు పోప్ ఫ్రాన్సిస్ ప్రకటించిన విషయం తెలిసిందే.