
వాటికన్ సిటీ: వాటికన్ సిటీలో శాన్ దమాసో వేదికగా ఓ వ్యక్తి స్పైడర్ మ్యాన్ వేషధాణలో అందరి దృష్టిని ఆకర్షించాడు. మాటియో విల్లార్డిటా అనే వ్యక్తి స్పైడర్ మ్యాన్ వేషధాణలో అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను ఉత్సాహపరుస్తున్నాడు. ఈ క్రమంలోనే అతను బుధవారం వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్‌ను కలిశాడు. పోప్‌కు తలకు ధరించే స్పైడర్ మ్యాన్ మాస్క్‌ను ఇచ్చాడు. అనంతరం మాటియో మాట్లాడుతూ.. ఆనారోగ్యంతో ఉన్న చిన్న పిల్లలు, వారి కుటుంబాల కోసం ప్రార్థించాలని పోప్ ఫ్రాన్సిస్‌ని కోరినట్లు తెలిపారు.
చిన్నారుల వద్దకు తాను వెళ్లినప్పుడు వారి బాధను మాస్క్ ద్వారా చూస్తున్నట్లు తెలియజేడానికి పోప్‌కు మాస్క్ ఇచ్చినట్లు తెలిపాడు. తనకు పోప్ ఫ్రాన్సిస్‌ను కలవటం చాలా ఆనందంగా ఉందని, ఆయన తన మిషన్‌ను గుర్తించారని మాటియో పేర్కొన్నారు. ఇక స్పైడర్ మ్యాన్ వేషాధారణలో ఉన్న మాటియోతో పలువురు సెల్ఫీలు దిగారు. ప్రస్తుతం స్పైడర్ మ్యాన్ వేషధారణలో ఉన్న మాటియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాడు.
చదవండి: ప్రాణం కోసం విలవిల.. గట్టిగా చుట్టి మింగేసింది
Comments
Please login to add a commentAdd a comment