pop francis
-
ఉక్రెయిన్‌లో నెత్తుటి నదులు పారుతున్నాయి: పోప్ ఫ్రాన్సిస్
ఉక్రెయిన్‌పై రష్యా పదిరోజులైనా నిర్విరామంగా దాడులు చేస్తోంది. బాంబులు, మిస్సైల్స్‌తో ప్రధాన నగరాలపై విరుచుకుపడుతోంది. అయితే రష్యా నుంచి భీకరమైన దాడుల్ని అడ్డుకోవడానికి తమ ముందున్న అన్ని మార్గాలను ఉక్రెయిన్ పూర్తి స్థాయిలో వినియోగించుకుంటోంది. తమకున్న సైన్యం, పౌరులతోనే శాయశక్తులా ప్రత్యర్థికి ఎదురొడ్డి పోరాడుతోంది. కాగా రష్యా దాడులపై దాదాపు అన్ని దేశాలు, నాయకులు స్పందిస్తున్నారు. యుద్ధం ఆపేయాలంటూ, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని హితవు పలుకున్నారు. చదవండి: Viral: కేరళను తాకిన యుద్ధం సెగ.. మెనూ నుంచి రష్యా సలాడ్ అవుట్ తాజాగా ఉక్రెయిన్‌లో రష్యా మిలటరీ దాడులపై పోప్ ఫ్రాన్సిస్ స్పందించారు. యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో రక్తపు, కన్నీటి నదులు పారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కేవలం సైనిక చర్య మాత్రమే కాదని, మరణం, విధ్వంసం, దుఃఖాన్ని నాటుతోన్న యుద్ధమని విచారం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ సంక్షోభ సమయంలో శరణార్థుల కోసం మానవతా కారిడార్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. చదవండి: War Updates: నో ఫ్లై జోన్‌గా ప్రకటించడండి.. జెలెన్స్కీ మరోసారి విజ్ఞప్తి -
పోప్‌ను కలిసిన రియల్ సూపర్ హీరో
వాటికన్ సిటీ: వాటికన్ సిటీలో శాన్ దమాసో వేదికగా ఓ వ్యక్తి స్పైడర్ మ్యాన్ వేషధాణలో అందరి దృష్టిని ఆకర్షించాడు. మాటియో విల్లార్డిటా అనే వ్యక్తి స్పైడర్ మ్యాన్ వేషధాణలో అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను ఉత్సాహపరుస్తున్నాడు. ఈ క్రమంలోనే అతను బుధవారం వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్‌ను కలిశాడు. పోప్‌కు తలకు ధరించే స్పైడర్ మ్యాన్ మాస్క్‌ను ఇచ్చాడు. అనంతరం మాటియో మాట్లాడుతూ.. ఆనారోగ్యంతో ఉన్న చిన్న పిల్లలు, వారి కుటుంబాల కోసం ప్రార్థించాలని పోప్ ఫ్రాన్సిస్ని కోరినట్లు తెలిపారు. చిన్నారుల వద్దకు తాను వెళ్లినప్పుడు వారి బాధను మాస్క్ ద్వారా చూస్తున్నట్లు తెలియజేడానికి పోప్‌కు మాస్క్ ఇచ్చినట్లు తెలిపాడు. తనకు పోప్ ఫ్రాన్సిస్‌ను కలవటం చాలా ఆనందంగా ఉందని, ఆయన తన మిషన్‌ను గుర్తించారని మాటియో పేర్కొన్నారు. ఇక స్పైడర్ మ్యాన్ వేషాధారణలో ఉన్న మాటియోతో పలువురు సెల్ఫీలు దిగారు. ప్రస్తుతం స్పైడర్ మ్యాన్ వేషధారణలో ఉన్న మాటియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాడు. చదవండి: ప్రాణం కోసం విలవిల.. గట్టిగా చుట్టి మింగేసింది -
‘నకిలీ’పై యుద్ధం
వాషింగ్టన్: పుట్టగొడుగుల్లా వెలుస్తున్న నకిలీ ఖాతాలపై ట్విటర్ యుద్ధభేరి మోగించింది. కొందరు ప్రముఖులకు రాత్రికిరాత్రే నకిలీ ఫాలోవర్లు పుట్టుకొస్తూ అసత్యపు వార్తలు, విద్వేషపూరిత సందేశాలు వ్యాపింపజేస్తున్నారు. ఈ నేపథ్యంలో అలాంటి ఖాతాలను తొలిగించే పనిని ట్విటర్ చేపట్టింది. ఫలితంగా ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్, క్రికెట్ ఆటగాడు విరాట్ కోహ్లి సహా పలువురు ప్రముఖులకు భారీ సంఖ్యలో ఫాలోవర్లు తగ్గే అవకాశాలున్నాయి. బాట్స్తోనే బెడద కుప్పలుతెప్పలుగా నకిలీ ఖాతాలు రావడానికి ప్రధాన కారణం బాట్స్ అనే సాఫ్ట్వేర్. ఇది రీట్వీట్, ఫాలోయింగ్, అన్‌ఫాలోయింగ్, అకౌంట్ మేనేజింగ్ తదితరాలను ఆటోమేటిక్‌గా చేస్తుంది. ట్విటర్ వినియోగదారుల పని సులభంగా కావడానికి రూపొందించిన ఈ సాప్ట్‌వేర్‌ని దుర్వినియోగం చేయడం వల్ల నకిలీల బెడద ఎక్కువైంది. బాట్స్ వల్ల ఏదైనా ఒక విషయాన్ని నిరంతరం ట్రెండింగ్‌లో ఉంచే వెసులుబాటు ఉంది. ట్వీట్లు, రీట్వీట్లన్నీ ఆటోమేటిక్‌గా జరిగిపోతూ, ఎప్పటికీ ఒకే అంశంపై చర్చ జరిగేలా చేయడం వల్ల ప్రజల భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారు. ఇప్పటికీ అమెరికా అధ్యక్ష ఎన్నికలు, బ్రెగ్జిట్ వంటి అంశాలపై ట్విటర్ వేదికగా చర్చ జరుగుతోందంటే దానికి కారణం బాట్స్. అందుకే ట్విటర్ ప్రధానంగా బాట్స్ సాఫ్ట్వేర్ ద్వారా నడుస్తున్న ఖాతాలపై దృష్టిపెట్టింది. ఆటోమేటిక్ అకౌంట్లను సృష్టిస్తున్న సమయంలోనే పర్యవేక్షించి వాటిలో నకిలీవని తెరుచుకోకుండా కాకుండా అడ్డుకుంటోంది. ఇలా ప్రతి రోజూ 50 వేలకు పైగా నకిలీ అకౌంట్లు క్రియేట్ కాకుండా అడ్డుకుంటున్నట్టు ట్విటర్ ఆడిట్ రిపోర్ట్ తెలిపింది. గంపగుత్తగా కొట్టే లైక్‌లు, వివిధ అకౌంట్ల నుంచి ఒకే విధంగా వచ్చే రీట్వీట్లు, ఇష్టారాజ్యంగా రెచ్చిపోతున్న ట్రోల్స్‌ను నిరోధించే చర్యల్ని చేపట్టింది. గత ఏడాది నుంచి ఫేక్ అకౌంట్ల ప్రక్షాళనను మొదలు పెట్టిన ట్విటర్ ‘బిగ్ బి’ అమితాబ్ బచ్చన్ ఆగ్రహాన్ని చవి చూడాల్సి వచ్చింది. ఫిబ్రవరిలో అమితాబ్ బచ్చన్ ఫాలోవర్లు రాత్రికి రాత్రే బాగా తగ్గిపోవడంతో ఆయన ట్విటర్ తీరుపై మండిపడ్డారు. ట్విటర్లో తిరుగులేని ట్రంప్ రెండు, మూడు స్థానాల్లో పోప్, మోదీ జెనీవా: ట్విటర్లో అత్యధిక మంది అనుసరిస్తున్న నాయకుడిగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిలిచారు. రెండు, మూడు స్థానాల్లో వరసగా పోప్ ఫ్రాన్సిస్, ప్రధాని మోదీ ఉన్నారు. అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టాక ట్రంప్ ఫాలోవర్ల సంఖ్య రెండింతల కన్నా ఎక్కువ పెరిగింది. జెనీవా కేంద్రంగా పనిచేస్తున్న బుర్సన్ కోన్ అండ్ వోల్ఫ్(బీసీడబ్ల్యూ) తాజా అధ్యయనంలో ఈ వివరాలు తెలిపింది. 5.2 కోట్ల ఫాలోవర్లతో ట్రంప్.. పోప్ కన్నా సుమారు 45 లక్షల మంది ఎక్కువ ఫాలోవర్లను కలిగి ఉన్నారు. ట్రంప్, మోదీల ఫాలోవర్ల సంఖ్య మధ్య తేడా సుమారు కోటిగా ఉంది. లైక్‌లు, రీట్వీట్ల పరంగా చూసినా ట్రంప్..పోప్, మోదీ కన్నా చాలా ముందంజలో ఉన్నారు. ఏడాది కాలంలో ట్రంప్ తన వ్యాఖ్యలకు సుమారు 26 కోట్ల లైక్‌లు, రీట్వీట్లు పొందారు. రీట్వీట్ల పరంగా చూస్తే ట్రంప్ కన్నా సౌదీ రాజు సల్మాన్ ఆధిక్యంలో ఉన్నారు. 2017 మే–2018 మే మధ్య కాలంలో సల్మాన్ 11 సార్లే ట్వీట్ చేయగా, ప్రతి ట్వీట్‌కు 1.5 లక్షల రీట్వీట్లు, ట్రంప్ ప్రతి ట్వీట్‌కు 20 వేల రీట్వీట్లు వచ్చాయి. -
హక్కులను గౌరవిస్తేనే మయన్మార్‌కు భవిత
నేప్యీతా: దేశంలోని అన్ని జాతులు, తెగల హక్కులకు ఇచ్చే గౌరవంపైనే మయన్మార్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని పోప్ ఫ్రాన్సిస్ అన్నారు. మయన్మార్ పర్యటనలో ఉన్న పోప్.. దశాబ్దాలుగా వివక్షను, తాజాగా మిలటరీ చర్యను ఎదుర్కొంటూ.. జాతి హననంగా ఐరాస అభివర్ణించిన రోహింగ్యా సంక్షోభాన్ని నేరుగా ప్రస్తావించకపోవడం, రోహింగ్యా అనే పదాన్నీ వాడకపోవడం గమనార్హం. మయన్మార్ ప్రభుత్వ ప్రధాన సలహాదారు ఆంగ్‌సాన్ సూచీ, దౌత్యవేత్తలను ఉద్దేశించి మంగళవారం పోప్ ప్రసంగించారు. అంతర్గత ఘర్షణలతో మయన్మార్ ప్రజలు పడుతున్న కష్టాలపై ఆవేదన వ్యక్తం చేశారు. మయన్మార్‌ను తమ ఇంటిగా భావించే ప్రజల హక్కులు, గౌరవాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. బౌద్ధం మెజారిటీగా ఉన్న ఆ దేశంలో మత విద్వేషాలు చీలికలు సృష్టించొద్దని కోరారు. -
మదర్ థెరిసాకు ‘సెయింట్‌హుడ్’
- సెప్టెంబర్ 4న ఇస్తాం... - అధికారిక ప్రకటన చేసిన పోప్ ఫ్రాన్సిస్ వాటికన్ సిటీ: మదర్ థెరిసాను ‘సెయింట్’గా ప్రకటించేందుకు వాటికన్ సిటీ ఆమోదం తెలిపింది. సెప్టెంబర్ 4న అధికారికంగా సెయింట్‌హుడ్ ఇస్తామని కోల్‌కతాలోని మిషనరీస్ ఆఫ్ చారిటీకి మంగళవారం పంపిన వర్తమానంలో పోప్ ఫ్రాన్సిస్ తెలిపారు. దీంతో 45 ఏళ్ల పాటు పేదల సేవలో తరించిన మదర్ మరణించిన 19 ఏళ్ల అనంతరం సెయింట్ హోదా పొందనున్నారు. థెరిసాను పరిశుద్ధురాలిగా ప్రకటించే ప్రక్రియకు పోప్ ఆమోదం తెలిపారన్న వర్తమానం అందగానే మిషనరీస్ ఆఫ్ చారిటీలో ఆనందం మిన్నంటింది. విషయం తెలియగానే ఎంతో ఉద్వేగం, ఆనందానికి గురయ్యామంటూ చారిటీ ప్రతినిధి సునీత కుమార్ తెలిపారు. మదర్ థెరిసాకు ఉన్న పేరుప్రఖ్యాతుల వల్ల సెయింట్ హోదా ప్రక్రియకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత ఏర్పడిందని ఆమె చెప్పారు. సెయింట్‌గా ప్రకటించే ప్రక్రియ సంప్రదాయం మాత్రమేనని, అయితే చాలా ముఖ్యమైనదని ఆర్చిబిషప్ డిసౌజా తెలిపారు. రోమ్‌లో జరిగే కార్యక్రమానికి సిస్టర్ ప్రేమతో పాటు డిసౌజా హాజరవనున్నారు. కోల్‌కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియంలో అక్టోబర్ 2న భారీ కృతజ్ఞతా సమావేశం, ప్రార్థనలు నిర్వహించాలని మిషనరీస్ ఆఫ్ చారిటీ భావిస్తోంది. జీవితమంతా పేదలు, రోగుల సేవలో 1910లో మాసిడోనియాలో అల్బేనియా దంపతులకు అంజెజె గోన్క్సే బొజాక్షిహుగా జన్మించిన మదర్ 18 ఏళ్ల వయసులో ఐర్లాండ్‌కు వెళ్లారు. అక్కడి నుంచి భారత్‌కు వచ్చి మరణించేంతవరకూ ఇక్కడే జీవించారు. పేదలు, రోగుల సేవకే జీవితాన్ని అర్పించిన థెరిసాను క్యాథలిక్కులు పూజ్యనీయురాలిగా భావిస్తారు. సేవాతత్పరతకు గుర్తింపుగా 1979లో ఆమె నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు. 1951లో భారత పౌరసత్వాన్ని అందుకున్న మదర్ 87 ఏళ్ల వయసులో సెప్టెంబర్ 5, 1997న కోల్‌కతాలో మరణించారు. మరణానంతరం మదర్ చేసిన అద్భుతాన్ని 2002లో వాటికన్ గుర్తించడంతో సెయింట్ హోదా ప్రక్రియను 2003లో పోప్ జాన్ పాల్ 2 ప్రకటించారు. ఆ కార్యక్రమానికి దాదాపు 3 లక్షలమంది హాజరయ్యారు. 1998లో కడుపులో కణితితో తీవ్రంగా జబ్బుపడ్డ బెంగాలీ గిరిజన మహిళ మోనికా బెర్సా అనారోగ్యం నుంచి కోలుకుంది. 2008లో బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న బ్రెజిల్‌కు చెందిన వ్యక్తి మదర్ మహిమతో అనారోగ్యం నుంచి బయటపడ్డాడు. సెయింట్‌గా ప్రకటించేందుకు అవసరమైన రెండు అద్భుతాలు జరగడంతో గత ఏడాది వాటికన్ పరిశీలకులు సెయింట్‌హుడ్ ప్రక్రియలోని చివరి దశను మొదలుపెట్టారు.