నేప్యీతా: దేశంలోని అన్ని జాతులు, తెగల హక్కులకు ఇచ్చే గౌరవంపైనే మయన్మార్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని పోప్ ఫ్రాన్సిస్ అన్నారు. మయన్మార్ పర్యటనలో ఉన్న పోప్.. దశాబ్దాలుగా వివక్షను, తాజాగా మిలటరీ చర్యను ఎదుర్కొంటూ.. జాతి హననంగా ఐరాస అభివర్ణించిన రోహింగ్యా సంక్షోభాన్ని నేరుగా ప్రస్తావించకపోవడం, రోహింగ్యా అనే పదాన్నీ వాడకపోవడం గమనార్హం.
మయన్మార్ ప్రభుత్వ ప్రధాన సలహాదారు ఆంగ్‌సాన్ సూచీ, దౌత్యవేత్తలను ఉద్దేశించి మంగళవారం పోప్ ప్రసంగించారు. అంతర్గత ఘర్షణలతో మయన్మార్ ప్రజలు పడుతున్న కష్టాలపై ఆవేదన వ్యక్తం చేశారు. మయన్మార్‌ను తమ ఇంటిగా భావించే ప్రజల హక్కులు, గౌరవాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. బౌద్ధం మెజారిటీగా ఉన్న ఆ దేశంలో మత విద్వేషాలు చీలికలు సృష్టించొద్దని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment