ఉక్రెయిన్‌పై రష్యా పదిరోజులైనా నిర్విరామంగా దాడులు చేస్తోంది. బాంబులు, మిస్సైల్స్‌తో ప్రధాన నగరాలపై విరుచుకుపడుతోంది. అయితే రష్యా నుంచి భీకరమైన దాడుల్ని అడ్డుకోవడానికి తమ ముందున్న అన్ని మార్గాలను ఉక్రెయిన్ పూర్తి స్థాయిలో వినియోగించుకుంటోంది. తమకున్న సైన్యం, పౌరులతోనే శాయశక్తులా ప్రత్యర్థికి ఎదురొడ్డి పోరాడుతోంది. కాగా రష్యా దాడులపై దాదాపు అన్ని దేశాలు, నాయకులు స్పందిస్తున్నారు. యుద్ధం ఆపేయాలంటూ, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని హితవు పలుకున్నారు.
చదవండి: Viral: కేరళను తాకిన యుద్ధం సెగ.. మెనూ నుంచి రష్యా సలాడ్ అవుట్
తాజాగా ఉక్రెయిన్‌లో రష్యా మిలటరీ దాడులపై పోప్ ఫ్రాన్సిస్ స్పందించారు. యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో రక్తపు, కన్నీటి నదులు పారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కేవలం సైనిక చర్య మాత్రమే కాదని, మరణం, విధ్వంసం, దుఃఖాన్ని నాటుతోన్న యుద్ధమని విచారం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ సంక్షోభ సమయంలో శరణార్థుల కోసం మానవతా కారిడార్‌లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
చదవండి: War Updates: నో ఫ్లై జోన్‌గా ప్రకటించడండి.. జెలెన్‌స్కీ మరోసారి విజ్ఞప్తి
Comments
Please login to add a commentAdd a comment