మహిళల్లో అధికంగా ఆటో ఇమ్యూన్ డిసీజ్
Published Mon, Feb 27 2017 1:02 AM | Last Updated on Tue, Sep 5 2017 4:41 AM
కర్నూలు(హాస్పిటల్): వ్యాధికారక క్రిములతో పోరాడే శత్రువులుగా మారి వ్యాధికి గురిచేసే ఆటో ఇమ్యూన్ డిసీజ్ మహిళల్లో అధికంగా వస్తున్నాయని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల డెర్మటాలజీ ప్రొఫెసర్ డాక్టర్ బి. ఉదయ్‌కుమార్ చెప్పారు. కర్నూలు మెడికల్ కాలేజిలోని క్లినికల్ లెక్చరర్ గ్యాలరీలో ఆదివారం పలురకాల ఆటో ఇమ్యూన్ డిసీజ్‌లపై జోనల్ స్థాయి వైద్య విజ్ఞాన సదస్సు నిర్వహించారు. సదస్సును కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీదేవి ప్రారంభించారు. అనంతరం డాక్టర్ ఉదయ్‌కుమార్ మాట్లాడుతూ సిస్టమిక్ లోపస్ ఎరిటమోసిస్ అని పిలవబడే చర్మ సంబంధ ఆటో ఇమ్యూన్ డిసీజ్‌ను నిర్లక్ష్యం చేస్తే ప్రాణం తీసే ప్రమాదం ఉందన్నారు. ఆటో ఇమ్యూన్ డిసీజ్‌లు చర్మం, కీళ్లు, కిడ్నీ, గుండె, మెదడు, కాలేయానికి వస్తాయన్నారు. వైద్యుల సూచన మేరకు మందులు తీసుకుంటే ఇతర అవయవాలకు ఈ వ్యాధి పాకకుండా చూసుకోవచ్చన్నారు. అనంతరం పలు రకాల చర్మవ్యాధులపై చర్మవ్యాధినిపుణులు డాక్టర్ మస్తాన్ సాహెబ్, డాక్టర్ గౌతమిశ్రీ, డాక్టర్ పి. విజయలక్ష్మి, డాక్టర్ సుబ్రహ్మణ్యస్వామి, డాక్టర్ అరుణకుమారి ప్రసంగించారు. కార్యక్రమంలో ఏపీ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు డాక్టర్ చంద్రన్న, మెడికల్ ఎడ్యుకేషన్ కో ఆర్డినేటర్ డాక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement