వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ (75) అస్వస్థతకు గురయ్యారు. దీంతో మాజీ అధ్యక్షుడిని చికిత్స నిమిత్తం కాలిఫోర్నియాలోని ఇర్విన్ మెడికల్ సెంటర్‌లో చేర్పించి, చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం క్లింటన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. బ్లడ్ ఇన్‌ఫెక్షన్ వల్ల క్లింటన్ అనారోగ్యానికి గురయ్యారని వైద్యులు వెల్లడించారు.
డాక్టర్ అల్పేస్ అమీన్, డాక్టర్ లిసా బార్‌డాక్ నేతృత్వంలో క్లింటన్‌కు చికిత్స కొనసాగుతోంది. ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన క్లింటన్ మంగళవారం స్వల్ప అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. 1993 నుంచి 2001 మధ్య బిల్ క్లింటన్ అమెరికాకు 42వ ప్రెసిడెంట్‌గా పనిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment