న్యూయార్క్: పచ్చబొట్టు వేయించుకున్న ఓ అమెరికన్ దాన్నుంచి శరీరంలోకి ఇన్‌ఫెక్షన్ సోకి ప్రాణాలు కోల్పోయాడు. టాటూ వేయించుకున్నాక∙కొన్ని వారాలు స్విమ్మింగ్‌పూల్‌లో స్నానం చేయకూడదు.
అయితే టాటూ వేయించుకున్న ఐదు రోజులకే స్విమ్మింగ్‌పూల్‌లో అతడు స్నానం చేశాడు. దీంతో కండను తినేసే విబ్రియో వల్నిఫికస్ బ్యాక్టీరియా శరీరంలోకి చొరబడింది. తీవ్ర జ్వరంతోపాటు శరీరం ఎర్రగా మారింది. ఆస్పత్రిలో చేరిన బాధితుడు ఇన్‌ఫెక్షన్ ఎక్కువ కావడంతో రెండు నెలల తర్వాత కాలేయం, కిడ్నీ, చర్మం పాడై ప్రాణాలు కోల్పోయాడు.