ప్రముఖ శాస్త్రవేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ వసంత్ గోవారికర్(81) శుక్రవారం పుణేలోని దీనానాథ్ మంగేష్కర్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు.
పుణే: ప్రముఖ శాస్త్రవేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ వసంత్ గోవారికర్(81) శుక్రవారం పుణేలోని దీనానాథ్ మంగేష్కర్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన డెంగ్యూ, మూత్రనాళ ఇన్‌ఫెక్షన్‌తో కన్నుమూసినట్టు ఆస్పత్రి ఐసీయూ ఇన్‌చార్జ్ డాక్టర్ సమీర్ జోగ్ వెల్లడించారు. ఇస్రోకు సేవలందించిన గోవారికర్.. సైన్స్, టెక్నాలజీ శాఖ కార్యదర్శిగా.. ప్రధానమంత్రికి శాస్త్రీయ సలహాదారుగా వ్యవహరించారు.