Vasant
-
వసంతకు ఉమా క్యాడర్ వార్నింగ్
-
ప్రముఖ శాస్త్రవేత్త వసంత్ కన్నుమూత
పుణే: ప్రముఖ శాస్త్రవేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ వసంత్ గోవారికర్(81) శుక్రవారం పుణేలోని దీనానాథ్ మంగేష్కర్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన డెంగ్యూ, మూత్రనాళ ఇన్ఫెక్షన్తో కన్నుమూసినట్టు ఆస్పత్రి ఐసీయూ ఇన్చార్జ్ డాక్టర్ సమీర్ జోగ్ వెల్లడించారు. ఇస్రోకు సేవలందించిన గోవారికర్.. సైన్స్, టెక్నాలజీ శాఖ కార్యదర్శిగా.. ప్రధానమంత్రికి శాస్త్రీయ సలహాదారుగా వ్యవహరించారు. -
‘ఎర్ర’ దొంగలపై పోలీసు పంజా
టీడీపీ జిల్లా ప్రచార కార్యదర్శి వసంత్ అరెస్టు ఎఫ్ఐఆర్ నమోదైనా మూడు నెలలుగా తప్పించుకు తిరిగిన వైనం భాకరాపేట, చిత్తూరుతో పాటు పలు స్టేషన్లలో వసంత్‌పై కేసులు ఇటీవల అంతర్జాతీయ స్మగ్లర్లపై పిడికిలి బిగించిన జేసీ శ్రీధర్ సాక్షి, చిత్తూరు: టీడీపీ జిల్లా ప్రచార కార్యదర్శి వసంత్‌పై జూన్ 13న భాకరాపేట పోలీసు స్టేషన్లో కేసు నమోదైం ది. ఇతనితో పాటు మరో 19మందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వీరిపై సెక్షన్ 147, 148, 353, 341, 307,ఆర్/డబ్ల్యూ 149 ఐపీసీ మరియు 379 ఐపీసీతో పాటు ఎర్రచందనం అక్ర మ నివారణ చట్టం 1989 ప్రకారం కేసు నమోదు చేశారు. అలాగే చిత్తూరు టూ టౌన్, వన్‌టౌన్‌తో పాటు పలు స్టేషన్ల లో వసంత్‌పై ఎర్రచందనం కేసులు నమోదయ్యాయి. చిత్తూరు టూటౌన్ పోలీసు స్టేషన్లో కూడా జూన్ 13న వసంత్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అప్పట్లో వసంత్ స్వేచ్ఛగా చిత్తూరులో సంచరిస్తున్నప్పటికీ పోలీసులు అరెస్టుపై దృష్టి సారించలేదు. పోలీసులపై ప్రభుత్వ ఒత్తిడి కారణంగానే పోలీసులు వసంత్‌ను అరెస్టు చేయలేదని అప్పట్లో తీవ్ర ఆరోపణలు వచ్చాయి. దీనిపై ‘సాక్షి’లో కథనాలు రావడంతో వసంత్ జి ల్లా నుంచి పరారయ్యాడు. ఇన్ని రోజులు మూడో కంటికి కనిపించకుండా అజ్ఞాతంలో గడిపారు. అలాగే ఎర్రచందనం దొంగల అరెస్టు పర్వం మందగిస్తోందని ఇటీవల ‘ఎర్రపట్టు సడలుతోంది’ అనే శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. ఈ వార్తలకు ఎస్పీ శ్రీనివాస్ స్పందించి వసంత్ అరెస్టుకు ఉచ్చు బిగించారు. ఇది తెలుసుకున్న వసంత్ గురువారం చిత్తూరు వన్‌టౌన్ పోలీసు స్టేషన్లో లొంగిపోయాడు. పీడీ యాక్టులు కూడా ‘సాక్షి’ ఒత్తిడితోనే: అంతర్జాతీయ స్మగ్లర్లపై పీడీ యాక్టు నమోదు చేయడంలో కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ నిర్లిప్తత ప్రదర్శిస్తున్నారని కూడా ‘సాక్షి’ లో పలు కథనాలు ప్రచురితమయ్యా యి. దొంగలకు త్వరలో బెయిల్ వస్తుం దని కూడా ‘డాన్లకు బెయిల్’ అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. ఈ క్రమం లో భాకరాపేట కేసుకు సంబంధించి రియాజ్‌కు బెయిల్ వచ్చింది. ఈ క్రమం లో త్వరలో అందరి దొంగలకు బెయిల్ వస్తుందని ‘సాక్షి’లో మరో కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన ఇన్చార్జ్ కలెక్టర్ శ్రీధర్ వెంటనే అంతర్జాతీయ స్మగ్లర్లపై ‘పీడీ’యాక్టు నమోదు చేశారు. ‘సాక్షి’లో వచ్చిన వార్తలతోనే పీడీ నమోదుకు వెనుకడుగు వేయలేదని శ్రీధర్ ఒక సందర్భంలో ‘సాక్షి’తో వ్యాఖ్యానించారు. మొత్తంపైన ‘సాక్షి’ కథనాలకు జిల్లాలోని ఇద్దరు కీలక అధికారులు తిరిగి ఎర్రచందనం స్మగ్లర్లపై ఉక్కుపిడికిలి బిగించేందుకు సన్నద్ధమయ్యారు. -
‘ఎర్ర’ స్మగ్లర్ వసంత్ లొంగుబాటు
చిత్తూరు(అర్బన్): తెలుగుదేశంపార్టీ జిల్లా ప్రచార కార్యదర్శి, చిత్తూరుకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్ వసంత్ గురువారం పోలీసులకు లొంగిపోయాడు. ఎర్రచందనం తరలింపులో ఇతనిపై భాకరాపేట, చిత్తూరు వన్‌టౌన్, టూటౌన్‌తో పాటు జిల్లాలో దాదాపు 6 వరకు పోలీసులు కేసులు నమోదు చేశారు. కొంత కాలంగా అజ్ఞాతంలో ఉన్న ఇతను గురువారం సాయంత్రం తన న్యాయవాదిని వెంట తీసుకొచ్చి చిత్తూరు వన్‌టౌన్ పోలీసు స్టేషన్లో లొంగిపోయాడు. అనంతరం వైద్య చికిత్సల నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాడు. ఇతడిని ఇంకా అధికారికంగా అరెస్టు చూపలేదు. కేవీపల్లెలో వేణుగోపాల్‌రెడ్డి అరెస్ట్ కేవీపల్లి: వైఎస్సార్ జిల్లా సుండుపల్లి మండలం కటారుముడుకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్ వేణుగోపాల్‌రెడ్డిని కేవీపల్లి ఎస్ఐ వెంకటేశ్వర్లు గురువారం అరెస్టు చేశారు. నిందితుడిని విలేకరుల ఎదుట హాజరుపరి చారు. ఎస్ఐ మాట్లాడుతూ ఐదేళ్లుగా వేణుగోపాల్‌రెడ్డి గజ్జల శీన్‌రెడ్డి ద్వారా ఎర్రచందనం వ్యాపారం చేస్తున్నాడని చెప్పారు. గత ఏడాది నవంబర్ నుంచి అతను పరారీలో ఉన్నాడని, గురువారం జిల్లేళ్లమంద పంచాయతీ దేవాండ్లపల్లి బస్టాప్ వద్ద అరెస్టు చేశామని తెలిపారు. మోస్ట్ వాంటెడ్ ఎర్రచందనం స్మగ్లర్ అరెస్ట్ పీలేరురూరల్: ఎర్రచందనం స్మగ్లింగ్‌లో జిల్లాలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా గుర్తించిన శ్రీశైలం బాబును అరెస్ట్ చేసి, రిమాండ్‌కు పంపినట్లు పీలేరు సీఐ టీ.నరసిం హులు తెలిపారు. ఆయన కథనం మేరకు.. అనంతపు రం జిల్లా తలపుల మండలం పులిగుండ్లపల్లెకు చెందిన చిన్న సల్లప్ప కుమారుడు శ్రీశైలం బాబు అలియాస్ సారాయి బాబు, అలియాస్ శ్రీశైలం వేమనారాయణ (44) 15 ఏళ్ల క్రితం పీలేరుకు వచ్చి సారా వ్యాపారం సాగించేవాడు. అనంతరం ఏడేళ్లుగా ఎర్రచందనం వ్యా పారం చేస్తున్నాడు. పీలేరు, భాకరాపేట, గానుగచింత, ఎర్రావారిపాళెం, కేవీ పల్లె ప్రాంతాల్లో ఎర్రచందనం దుంగలు కొని చిత్తూరు, బెంగళూరులో ఎక్కువ ధరకు విక్రయించేవాడు. 2011లో కల్లూరు పోలీసులకు, 2013 లో ఎర్రావారిపాళెం పోలీసులకు పట్టుబడి జైలుకు వెళా ్లడు. గురువారం పీలేరు సీఐ టీ.నరసింహులు, ఎర్రావారిపాళెం పోలీసులు ఎర్రావారిపాళెం మండలంలోని యల్లమందలో అతన్ని అరెస్ట్ చేశారు. -
అరెస్టుల పర్వంలో ...అదే వరుస !
భాకరాపేట తరహాలో చిత్తూరు టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ అందులోనూ టీడీపీ ప్రచారకార్యదర్శి వసంత్‌తో పాటు మధు పేరు ‘సాక్షి’ కథనంతో జిల్లా నుంచి వసంత్ పరార్.. అదే బాటలో మరికొందరు నేడు పీడీయాక్టు అడ్వయిజరీ బోర్డు సమావేశం... ‘పచ్చ’ నేతలకు బెయిల్ వచ్చే అవకాశం భాకరాపేట...చిత్తూరు టూ టౌన్. ఊరు ఏదైనా అరెస్టుల పర్వంలో అదే తంతు. ఎర్రచందనం స్మగ్లింగ్లోని ప్రధాన నిందితుల అరెస్టులో నిర్లిప్తత కొనసాగుతోంది. పోలీసులపై అధికారపార్టీ ఒత్తిడే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. టీడీపీ జిల్లా ప్రచార కార్యదర్శి వసంత్, ఆపార్టీ నేత మధుపై ఎఫ్ఐఆర్ నమోదై కళ్లెదుట తిరుగుతున్నా పోలీసులు అరెస్టు చేయలేదు. అలాంటి వ్యవహారం చిత్తూరు టూ టౌన్లో జరిగింది. ఇక్కడ కూడా వారిపై కేసులు నమోదైనా పోలీసులు అరెస్టు చేయలేదు. అరెస్టుల పర్వంలో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తామని పోలీసులు చెబుతున్నా వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉంది. సాక్షి, చిత్తూరు: ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టుల జాబితాలో మరో నలుగురి పేర్లు పెరిగినట్లు తెలుస్తోంది. పట్టుబడిన దొంగల విచారణలో మరో నలుగురు దొంగలను పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. దీంతో మొన్నటి వరకూ 196గా ఉన్న సంఖ్య 200కు చేరినట్లయింది. జాబితాలో చేరిన ఆ నలుగురు స్మగ్లర్లు తమిళనాడువాసులుగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. చిత్తూరు టూటౌన్లోనూ అదే సీన్.. టీడీపీ జిల్లా ప్రచారకార్యదర్శి వసంత్‌కుమార్, ఆ పార్టీ నేత మధుతో పాటు 19మంది ఎర్రచందనం దొంగలపై ఈ నెల 13న భాకరాపేట పోలీసుస్టేషన్ పరిధిలో కేసు నమోదైంది. వసంత్, మధు జిల్లాలో తిరుగుతున్నా పోలీసులు అరెస్టు చేయలేదు. ప్రభుత్వ పెద్దల నుంచి వస్తున్న ఒత్తిడి కారణంగానే వీరిని అరెస్టు చేయలేదని తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఈ నెల 21న ‘పసుపు స్మగ్లర్లకు పోలీసు కవచం’ అనే శీర్షికతో ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీంతో వసంత్, మధుతో పాటు జిల్లాకు సంబంధించిన జాబితాలో ఉన్న వ్యక్తులు పరారయ్యారు. అయితే భాకరాపేటతో పాటు చిత్తూరు టూటౌన్ పోలీసుస్టేషన్లో కూడా ఈ నెల 13నే 16మంది ఎర్రచందనం స్మగ్లర్లపై ఎఫ్ఐఆర్ నమోదైనట్లు తెలిసింది. సెక్షన్యు/ఎస్379, 109ఐపీసీఆర్/డబ్ల్యూ మరియు ఏపీ ఫారెస్ట్యాక్ట్ 1967 సెక్షన్ 29, 32తో పాటు ఎర్రచందనం అక్రమరవాణా, అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నందుకు పలు సెక్షన్లపై ఎఫ్ఐఆర్ నమోదైనట్లు తెలిసింది. భాకరాపేటలో ఎఫ్ఐఆర్ నమోదైన 19 మందిలోని 11 మంది వ్యక్తులపై చిత్తూరు టూటౌన్ పోలీసుస్టేషన్లో కూడా ఎఫ్ఐఆర్ నమోదైనట్లు తెలుస్తోంది. వీరిపై మరో కేసు ఉంటే పీడీయాక్టు నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే 13 నుంచి భాకరాపేటతో పాటు చిత్తూరు టూటౌన్ పోలీసులు కూడా వీరి అరెస్టుపై దూకుడు ప్రదర్శించలేదు. దీనికి కారణం కూడా ‘పచ్చ’ నేతలకు ‘ప్రభుత్వ’ అండ ఉండటమే అని తెలుస్తోంది. ఇప్పటి వరకూ 84మంది స్మగ్లర్ల అరెస్టు ఎర్రచందనం స్మగర్ల అరెస్టులు, కూంబింగ్‌లో వైఎస్సార్, చిత్తూరు, తిరుపతి పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. వీరి పరిధిలో ఈ నెల 22 వరకూ 80 మంది దొంగలు ఉన్నట్లు తెలిసింది. సోమవారం ఎర్రావారిపాళెం పరిధిలో మరో నలుగురు అరెస్టయ్యారు. దీంతో ఈ సంఖ్య 84కు చేరింది. తక్కిన 116 మంది కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపడుతున్నాయి. ఇద్దరు ఏఎస్పీలు, 20మంది సీఐలు, వందమంది పోలీసులు స్మగ్లర్ల కోసం గాలిస్తున్నారు. వీరు మరో స్మగ్లర్ ఆరని రమేష్‌ను ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. రమేష్‌పై భాకరాపేట పీఎస్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది. దీనిపై చిత్తూరు టూటౌన్ ఎస్ఐ లక్ష్మణరెడ్డిని వివరణ కోరగా వారం రోజులుగా తాను ఎస్సీ, ఎస్టీ కేసుల విచారణలో భాగంగా డీఎస్పీ కార్యాలయంలో ఉన్నానని తెలిపారు. నేడు పీడీయాక్టు అడ్వయిజరీ బోర్డు సమావేశం పీడీయాక్టు అడ్వయిజరీ బోర్డు సమావేశం మంగళవారం జరగనుంది. ఇప్పటి వరకూ పీడీయాక్టు నమోదైన 14మంది స్మగ్లర్లతో పాటు ఇంకెవరిపై పీడీయాక్టు నమోదు చేయాలి? అనే కోణంలో విచారణ జరగనుంది. ఎర్రచందనం స్మగ్లింగ్‌లో ప్రధాన దొం గలుగా ఉన్న రెడ్డినారాయణ, మహేశ్‌నాయుడు భార్యలు ఇటీవల సీఎం చంద్రబాబునాయుడును కలిసిన సంగతి తెలిసిందే! పార్టీ కోసం తమ భర్తలు పనిచేశారని, భారీగా డబ్బు కూడా ఖర్చు చేశారని, వారిని కేసుల నుంచి ఎలాగైనా తప్పించాలని వారు కోరినట్లు టీడీపీ వర్గాల ద్వారా తెలిసింది. చంద్రబాబు కూడా వారికి ‘అభయం’ ఇచ్చినట్లు తెలిసిం ది. దీంతో ఆ ఇద్దరికీ బెయిల్ వచ్చే అవకాశం ఉన్నట్లు టీడీపీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. -
రాసలీలల కేసులో దేవిశ్రీకి బెయిల్
ఆమె తన రెండవ భార్యగా పేర్కొన్న స్వామీజీ తన అనుమతితోనే రెండవ పెళ్లి చేసుకున్నారన్న తొలి భార్య బెంగళూరు, న్యూస్‌లైన్ : రాసలీలల కేసులో అరెస్టైన దేవిశ్రీ గురూజీ కి బెయిల్ మంజూరైంది. బుధవారం ఉదయం స్థానిక ఆరవ ఏసీఎంఎం న్యాయస్థానంలో దేవిశ్రీని పోలీసులు హాజరుపరిచారు. కేసు వివరాలు తెలుసుకున్న అనంతరం న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. తమకు గురూజీ నుంచి ప్రాణహాని ఉందంటూ ఆయన కారు డ్రైవర్ వసంత్, మేనేజర్ ఉదయ్ ఫిర్యాదు మేరకు హెచ్ఎస్ఆర్ లే ఔట్ పోలీసులు కేసు నమోదు చేసిన వైనం విదితమే. అంతకు ముందే రాసలీలలపై ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారం కావడంతో దేవిశ్రీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తమిళనాడులోని ధర్మపురిలో తలదాచుకున్న దేవిశ్రీని మంగళవారం రాత్రి హెచ్ఎస్ఆర్ లే ఔట్ పోలీసులు అదుపులోకి తీసుకుని బెంగళూరుకు పిలుచుకొచ్చారు. కాగా, బెయిల్‌పై బయటకు వచ్చిన వెంటనే దేవిశ్రీ ఓ టీవీ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. తాను రాసలీలలు సాగించినట్లు ప్రసారం అయిన క్లిప్పింగ్‌లలో ఉన్న మహిళ తన రెండవ భార్య అని పేర్కొన్నారు. మొదటి భార్య అనుమతితోనే ఆమెను గాంధర్వ వివాహం చేసుకున్నట్లు వివరించారు. ఇందుకు ఎలాంటి సాక్ష్యాలు ఉండవని తెలిపారు. ఏనాడు తాను సన్యాసినని చెప్పుకోలేదని స్పష్టం చేశారు. గత ఆగస్టు 15 నుంచి తనను బ్లాక్మెయిల్ చేశారని, తన దగ్గర డబ్బు లేకపోయినా అప్పు చేసి రూ. 2.50 లక్షలు డ్రైవర్ వసంత్‌కు ఇచ్చి, మరో ప్రాంతానికి వెళ్లి సుఖంగా జీవించాలని సూచించానని అన్నారు. గత ఏడాది మే నుంచి తన రెండవ భార్య దూరమైందని, ప్రస్తుతం ఆమె ఎక్కడుందో తనకు తెలియదని పేర్కొన్నారు. తన అనుమతితోనే తన భర్త రెండవ పెళ్లి చేసుకున్నారని దేవిశ్రీ భార్య కౌసల్య స్పష్టం చేశారు. దేవిశ్రీతో కలిసి టీవీ చానెల్లో ఆమె మాట్లాడారు. వివాహమైన తర్వాత ఆమె తనతో పాటు ఒకే ఇంటిలోనే కలిసి ఉందని, వేరు కాపురానికి అంగీకరించలేదని చెప్పారు. -
చెట్టును ఢీకొన్న కారు ...ఐదుగురి దుర్మరణం
హొసూరు, న్యూస్‌లైన్: క్రిష్ణగిరి జిల్లా పోచంపల్లి వద్ద బుధవారం తెల్లవారు జామున కారు చెట్టును ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మహిళలతో సహా ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదానికి అతివేగం కారణంగా పోలీసులు భావిస్తున్నారు. వివరాలలోకి వెళితే.. పోచంపల్లి సమీపంలోని అమ్మన్ఆలయ ప్రాంతానికి చెందిన కాట్టురాజా (45), తేని జిల్లాలోని కరుప్పుస్వామి ఆలయంలో మొక్కుబడి తీర్చునేందుకు తమ కుటుంబ సభ్యులతోపాటు అతని తన భార్య స్నేహితురాలు సెందామరైతో కలసి కారులో బయలుదేరారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో రోడ్డుపై వాహనాల రద్దీ లేకపోవడంతో, త్వరగా ఆలయానికి వెళ్లి, చీకటి పడేలోపే ఇంటికి చేరుకోవాలని కాట్టురాజా కారును వేగంగా నడిపినట్లు తెలిసింది. కారు అకస్మాత్తుగా అదుపు తప్పి రోడ్డు పక్కనున్న చింత చెట్టును బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో కాట్టురాజా (45), అతని భార్య మలర్విళి (40), అత్తయ్య పద్మ (55) స్నేహితులు రాజేంద్రన్ (43), పళణి (42) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రగాయాల పాలైన కాట్టురాజా కొడుకు వసంత్ (7), కూతురు వశీక (15), సెందామరై (40)లను స్థానికులు ధర్మపురి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం అదే ఆస్పత్రికి తరలించారు. వెనుక సీట్లో కూర్చొవడం వల్ల కాట్టురాజా కొడుకు, కూతురు, సెందామరై ప్రాణాపాయస్థితి నుంచి తప్పించుకున్నట్లు తెలిసింది. పోచంపల్లి ఇన్స్పెక్టర్ మురుగన్, బారూరు ఇన్స్పెక్టర్ మురుగేశన్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.