‘ఎర్ర’ దొంగలపై పోలీసు పంజా
- టీడీపీ జిల్లా ప్రచార కార్యదర్శి వసంత్ అరెస్టు
- ఎఫ్‌ఐఆర్ నమోదైనా మూడు నెలలుగా తప్పించుకు తిరిగిన వైనం
- భాకరాపేట, చిత్తూరుతో పాటు పలు స్టేషన్లలో వసంత్‌పై కేసులు
- ఇటీవల అంతర్జాతీయ స్మగ్లర్లపై పిడికిలి బిగించిన జేసీ శ్రీధర్
సాక్షి, చిత్తూరు: టీడీపీ జిల్లా ప్రచార కార్యదర్శి వసంత్‌పై జూన్ 13న భాకరాపేట పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైం ది. ఇతనితో పాటు మరో 19మందిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. వీరిపై సెక్షన్ 147, 148, 353, 341, 307,ఆర్/డబ్ల్యూ 149 ఐపీసీ మరియు 379 ఐపీసీతో పాటు ఎర్రచందనం అక్ర మ నివారణ చట్టం 1989 ప్రకారం కేసు నమోదు చేశారు. అలాగే చిత్తూరు టూ టౌన్, వన్‌టౌన్‌తో పాటు పలు స్టేషన్ల లో వసంత్‌పై ఎర్రచందనం కేసులు నమోదయ్యాయి.
చిత్తూరు టూటౌన్ పోలీసు స్టేషన్‌లో కూడా జూన్ 13న వసంత్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అప్పట్లో వసంత్ స్వేచ్ఛగా చిత్తూరులో సంచరిస్తున్నప్పటికీ పోలీసులు అరెస్టుపై దృష్టి సారించలేదు. పోలీసులపై ప్రభుత్వ ఒత్తిడి కారణంగానే పోలీసులు వసంత్‌ను అరెస్టు చేయలేదని అప్పట్లో తీవ్ర ఆరోపణలు వచ్చాయి. దీనిపై ‘సాక్షి’లో కథనాలు రావడంతో వసంత్ జి ల్లా నుంచి పరారయ్యాడు.
ఇన్ని రోజులు మూడో కంటికి కనిపించకుండా అజ్ఞాతంలో గడిపారు. అలాగే ఎర్రచందనం దొంగల అరెస్టు పర్వం మందగిస్తోందని ఇటీవల ‘ఎర్రపట్టు సడలుతోంది’ అనే శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. ఈ వార్తలకు ఎస్పీ శ్రీనివాస్ స్పందించి వసంత్ అరెస్టుకు ఉచ్చు బిగించారు. ఇది తెలుసుకున్న వసంత్ గురువారం చిత్తూరు వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌లో లొంగిపోయాడు.
పీడీ యాక్టులు కూడా ‘సాక్షి’ ఒత్తిడితోనే:
అంతర్జాతీయ స్మగ్లర్లపై పీడీ యాక్టు నమోదు చేయడంలో కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ నిర్లిప్తత ప్రదర్శిస్తున్నారని కూడా ‘సాక్షి’ లో పలు కథనాలు ప్రచురితమయ్యా యి. దొంగలకు త్వరలో బెయిల్ వస్తుం దని కూడా ‘డాన్‌లకు బెయిల్’ అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. ఈ క్రమం లో భాకరాపేట కేసుకు సంబంధించి రియాజ్‌కు బెయిల్ వచ్చింది. ఈ క్రమం లో త్వరలో అందరి దొంగలకు బెయిల్ వస్తుందని ‘సాక్షి’లో మరో కథనం ప్రచురితమైంది.
దీనికి స్పందించిన ఇన్‌చార్జ్ కలెక్టర్ శ్రీధర్ వెంటనే అంతర్జాతీయ స్మగ్లర్లపై ‘పీడీ’యాక్టు నమోదు చేశారు. ‘సాక్షి’లో వచ్చిన వార్తలతోనే పీడీ నమోదుకు వెనుకడుగు వేయలేదని శ్రీధర్ ఒక సందర్భంలో ‘సాక్షి’తో వ్యాఖ్యానించారు. మొత్తంపైన ‘సాక్షి’ కథనాలకు జిల్లాలోని ఇద్దరు కీలక అధికారులు తిరిగి ఎర్రచందనం స్మగ్లర్లపై ఉక్కుపిడికిలి బిగించేందుకు సన్నద్ధమయ్యారు.