నేనెంత శ్రద్ధగా రోజుకు రెండుసార్లు బ్రష్ చేసుకుంటున్నా నా నోటి నుంచి దుర్వాసన వస్తోంది. దీనిని నివారించడం ఎలాగో చెప్పండి.
- తిరుమలరావు, ఒంగోలు
నోటిదుర్వాసనను వైద్యపరిభాషలో హాలిటోసిస్ అంటారు. పంటి చిగుళ్లు లేదా పళ్లకు ఇన్ఫెక్షన్ సోకడం వల్ల ఇలా దుర్వాసన వస్తుంటుంది. మీరు రోజూ రెండుసార్లు బ్రష్ చేసుకుంటున్నప్పటికీ దుర్వాసన పోవడం లేదంటే ముందు మీరొకసారి మీ సాధారణ ఆరోగ్యం ఎలా ఉందన్న విషయాన్ని జనరల్ ఫిజిషియన్‌ను కలిసి తెలుసుకోవండి. మీకు డయాబెటిస్ వంటి ఇతరత్రా ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయేమో తెలుసుకుని తగిన చికిత్స తీసుకోండి. దాంతో చాలా వరకు సమస్య తగ్గుతుంది. ఈలోగా మీరు ఆహారం తీసుకున్న ప్రతిసారీ నోటిని బాగా పుక్కిలించడంతోపాటు టంగ్‌క్లీనర్‌తో నాలుకను శుభ్రం చేసుకోవడం, మౌత్ వాష్‌లను ఉపయోగించడం వల్ల కొంతవరకు ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. అదేవిధంగా మీరు డెంటిస్ట్‌ను కలిసి వారి అభిప్రాయాన్ని కూడా తీసుకోవడం మంచిది.
నేను బీటెక్ చివరి సంవత్సరంలో ఉన్నాను. ఇటీవల నాకు దవడ చివరన కొత్తగా పళ్లు రావడం గమనించాను. అవి అప్పటికే ఉన్న పళ్లపై వస్తున్నాయి. దాంతో అక్కడ రక్తం రావడంతో పాటు, తినడం ఇబ్బందిగా మారుతోంది. నాకు తగిన సలహా ఇవ్వండి.
- సందీప్, హైదరాబాద్
మీరు చెబుతున్న దాన్ని బట్టి మీకు జ్ఞానదంతాలు వస్తుండవచ్చు. సాధారణంగా జ్ఞానదంతాలు యుక్తవయసు దాటాక వస్తుంటాయి. అయితే కొందరిలో కొన్నిసార్లు అప్పటికే దవడపై ఉన్న స్థలాన్ని మిగతా పళ్లు ఆక్రమించడం వల్ల ఇలా పంటిపైనే పన్ను వస్తుంటుంది. లేదా ఎముకలోనే ఇరుక్కుపోయి బయటకు వచ్చేందుకు సాధ్యంగాక మీరు చెబుతున్న ఇబ్బందుల వంటివి రావచ్చు. అప్పుడు అక్కడ నొప్పిరావడం, రక్తస్రావం జరగడం మామూలే. ఇలాంటి సందర్భాల్లో ఒక చిన్న శస్త్రచికిత్సతో ఆ జ్ఞానదంతాలను తొలగించాల్సి ఉంటుంది. మీరు ఒకసారి డెంటిస్ట్‌ను కలవండి.
డెంటల్ కౌన్సెలింగ్
Published Mon, May 4 2015 12:31 AM | Last Updated on Sun, Sep 3 2017 1:21 AM
Advertisement
Advertisement