నిగనిగల కురులకు...
బ్యూటిప్స్
చలికాలం మాడు పొడిబారి, దురద పెడుతుంటుంది. గాల్లో తేమ తగ్గడం వల్లే ఇలా జరుగుతుంది. మాడు పై చర్మం పొలుసులుగా లేచి, చుండ్రుకు దారితీస్తుంది. కొబ్బరి నూనెను వేడి చేసి, అందులో అర నిమ్మచెక్కను పిండి, తలకు పట్టించాలి. మాడుకు బాగా మసాజ్ చేసుకొని, తలస్నానం చేయాలి. రోజు విడిచి రోజు ఇలా చేయడం వల్ల చుండ్రు సమస్య తగ్గుతుంది.తలను శుభ్రపరచడానికి మరీ వేడి నీళ్లు వాడితే మాడుపై సహజ నూనెలు తగ్గి త్వరగా పొడిబారుతుంది. అందుకని గోరువెచ్చని నీటినే తలస్నానానికి ఉపయోగించాలి.
తలస్నానం తర్వాత కండిషనర్ వాడితే వెంట్రుకలు మృదుత్వాన్ని కోల్పోకుండా ఉంటాయి.
వెచ్చని ఆలివ్ ఆయిల్‌ను మాడుకు పట్టించి, మసాజ్ చేసుకోవాలి. నూనె కుదుళ్లకు పట్టి, వెంట్రుక చిట్లకుండా ఉంటుంది. చలికాలం జుట్టును ఆరబెట్టడానికి హెయిర్ డ్రయ్యర్లను వాడకపోవడమే మంచిది. హెయిర్ డ్రయ్యర్ ఉపయోగించి జుట్టును ఆరబెట్టడం వల్ల శిరోజాలు మరింత త్వరగా పొడిబారే అవకాశం ఉంది.