![Are You Applying Coconut Oil On Your Face In Winter - Sakshi](/styles/webp/s3/article_images/2023/12/19/oil12.jpg.webp?itok=D_L2paBV)
శీతకాలంలో ముఖం డ్రైగా మారి గరుకుగా ఉంటుంది. స్కిన్ కూడా తెల్లతెల్లగా పాలిపోయినట్లు అయిపోతుంది. మన ముఖాన్ని టచ్ చేస్తేనే మనకే ఇరిటేషన్‌గా ఉంటుంది. దీంతో ఇంట్లో ఉండే కొబ్బరి నూనెనే గబుక్కున రాసేస్తుంటాం. అందరికీ అందుబాటులోనూ చవకగా ఉంటుంది కూడా. చిన్నప్పటి నుంచి చర్మంపై దురద వచ్చినా, కందినా కూడా కొబ్బరి నూనెనే రాసేవాళ్లం. అయితే ఇలా రాయడం మంచిదేనా? రాస్తే ఏమవుతుంది తదితరాల గురించే ఈ కథనం!.
ఏం జరుగుతుందంటే..
- ముఖానికి కొబ్బరి నూనె రాయడం చాలా మంచిదే గానీ దాన్ని సరైన విధంగా ముఖానికి అప్లై చేస్తేనే ఫలితం ఉంటుందని సౌందర్య నిపుణలు అంటున్నారు.
- రాత్రిపూట ముఖానికి కొబ్బరి నూనెతో సున్నితంగా మసాజ్ చేస్తే రాత్రంత ముఖం తేమగా, కోమలంగా ఉంటుందని చెబుతున్నారు.
- ఈ మసాజ్ వల్ల ముఖం అంతా రక్తప్రసరణ జరిగి తాజాగా ఉండటమే గాక ముఖ చర్మం చాలా కాంతివంతంగా మారుతుంది
- పొడి చర్మం ఉన్నవారికి ఈ కొబ్బరి నూనె మంచి మాయిశ్చరైజషన్‌గా ఉంటుంది. ఇందులో ఎలాంటి కృత్రిమ రసాయనాలు ఉండవు కాబట్టి దుష్ప్రభావాలు ఉండవని చెబుతున్నారు
- దీనిలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు మొటిమల వల్ల వచ్చే వాపులను తగ్గిస్తుంది. అలాగే కళ్ల కింద వాపులను కూడా నయం చేస్తుంది. మొటిమలు, వాటి తాలుకా మచ్చలను తగ్గిచడంలో కూడా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. బ్లాక్‌హెడ్స్, వైట్ హెడ్స్ వంటి వాటిని కూడా తగ్గిస్తుంది.
- అతినీలలోహిత కిరణాలను నిరోధించే శక్తి ఈ కొబ్బరి నూనెకు ఉంది. అందువల్ల ఇది మంచి యాంటీ ఏజింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. దీన్ని సహజ మేకప్ రిమూవర్‌గా కూడా ఉపయోగించొచ్చు. చెప్పాలంటే.. మేకప్‌ని తొలగించి చర్మాన్ని శుభ్రపరిచే క్లెన్సర్‌గా పనిచేస్తుంది.
(చదవండి: బరువు తగ్గడంలో పనీర్ హెల్ప్ అవుతుందా? నిపుణులు ఏమంటున్నారంటే..?)
Comments
Please login to add a commentAdd a comment