నా వయసు 27 ఏళ్లు. ఈమధ్య చల్లగాలి, దుమ్ముధూళి సోకిన వెంటనే ముక్కుకారడం, విపరీతంగా తుమ్ములు రావడం జరుగుతోంది. కళ్లు దురదపెడుతున్నాయి. కళ్ల నుంచి నీరుకారుతోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే అలర్జిక్ రైనైటిస్ అన్నారు. మందులు వాడినా పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు. హోమియోలో నా సమస్యకు శాశ్వత చికిత్స ఉందా? – కృష్ణమూర్తి, పిడుగురాళ్ల
అలర్జిక్ రైనైటిస్ అంటే... మనకు సరిపడని పదార్థాలు శ్వాస ద్వారా శరీరంలోకి ప్రవేశించినప్పుడు ముక్కులోని శ్లేష్మం పొర వాపునకు గురవుతుంది. అలర్జిక్ రైనైటిస్ ఉన్న వారి విషయంలో వాతావరణంలో మార్పులు, చల్లగాలి, దుమ్ముధూళి, ఇతర వాతావరణ కాలుష్యం వంటి సమస్యలు వారి జీవితాన్ని మరింత దుర్భరం చేస్తాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, ఈ సమస్య ఉన్నవారు, తరచూ ఇలాంటి బాధలకు గురవుతుంటారు.
కారణాలు : ∙అలర్జీని కలిగించే పదార్థాలు మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు మన రోగనిరోధక వ్యవస్థ సాధారణ స్థాయికి మించి ప్రతిక్రియ జరుపుతుంది. దాని వల్ల అలర్జిక్ రైనైటిస్ సమస్య వస్తుంది. పూలమొక్కల నుంచి వెలువడే పుప్పొడి రేణువులు ఈ సమస్యకకు ప్రధానమైన కారణమని చెప్పవచ్చు. ∙దుమ్ము ధూళి జంతుకేశాలు, బూజు, కుటుంబ చరిత్ర వంటి అంశాలు ఈ సమస్యకు ఇతర కారణాలుగా చెప్పవచ్చు. ∙పొగతాగే అలవాటు, కొన్ని రసాయనాలు, వాతావరణంలోని కాలుష్యాలు, సుగంధద్రవ్యాల వంటివి అలర్జిక్ రైనైటిస్ సమస్యను ప్రేరేపిస్తాయి.
లక్షణాలు : ముక్కు కారడం, ముక్కు దిబ్బడ, విపరీతంగా తుమ్ములు, ముక్కులో అంగిలిలో దురద, కళ్ల నుంచి నీరుకారడం, కళ్లు దురదగా ఉండటం, ముఖంలో వాపు, దగ్గు, తరచూ తలనొప్పి, నీరసం, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి.
చికిత్స : హోమియో చికిత్సలతో ఎలాంటి శ్వాసకోశవ్యాధులనైనా తగ్గించవచ్చు. జెనెటిక్ కన్‌స్టిట్యూషన్ పద్ధతిలో అందించే ఈ చికిత్సలో రోగి శారీరక, మానసిక లక్షణాలను, శరీరతత్వాన్ని పరిగణనలోకి తీసుకొని చికిత్స చేస్తారు. రోగనిరోధక వ్యవస్థలలో గల అసమతౌల్యతను సరిచేయడం ద్వారా అలర్జిక్ రైనైటిస్ సమస్యను మళ్లీ తిరగబెట్టకుండా నయం చేయడం సాధ్యమవుతుంది.
డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ సీఎండి
హోమియోకేర్ ఇంటర్నేషనల్ హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment