బ్యూటిప్స్
వాతావరణం, దుమ్ము, కాలుష్యం, ఆరోగ్య సమస్యలు, శుభ్రత లోపాలు చుండ్రుకు ప్రధాన కారణాలు అవుతుంటాయి. ఈ సమస్య నివారణకు.. రెండు టీ స్పూన్ల బ్రౌన్ షుగర్‌లో టీ స్పూన్ హెయిర్ కండిషనర్ కలిపి మాడుకు పట్టించాలి. పది నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. వారానికి ఒకసారి ఈ విధంగా చేస్తుంటే చుండ్రు తగ్గుతుంది. టెబుల్ స్పూన్ పెరుగులో చిటికెడు మిరియాల పొడి కలిపి మాడుకు పట్టించి గంటసేపు వదిలేయాలి. తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి.
టీ స్పూన్ ఉల్లిరసంలో రెండు టేబుల్ స్పూన్ల తేనె కలపాలి. దూది ఉండతో మిశ్రమాన్ని అద్దుకుంటూ మాడుకు పట్టించాలి. అరగంట తర్వాత తలను శుభ్రం చేసుకోవాలి. ఆలివ్ ఆయిల్‌ను కొద్దిగా వేడి చేసి రాత్రిపూట తలకు పట్టించి, మరుసటి రోజు ఉదయం తలస్నానం చేయాలి. ఒక భాగం వెనిగర్‌కు మూడు భాగాల నీళ్లు కలపాలి. రాత్రిపూట ఈ మిశ్రమాన్ని మాడుకు పట్టించి, మరుసటి రోజు ఉదయం శుభ్రపరుచుకోవాలి.