
ముప్పై సంవత్సరాలు దాటిన మహిళలకు, చర్మంలో ముడుతలు మొదలవుతాయి. ముడతలు తగ్గాలంటే ...
∙ కోడిగుడ్డు తెల్ల సొనను బాగా నురగ వచ్చేవరకు కలిపి ముఖానికి పట్టించాలి. పదినిమిషాల తరువాత చల్లని నీటితో ముఖం కడుక్కోవాలి. గుడ్డు తెల్లసొన, రెండు టేబుల్‌స్పూన్ల శనగపిండి, రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం కలిపి ముఖానికి ప్యాక్ వేసుకుని ఆరిన తరువాత (15 నిమిషాలు వుంచుకోవాలి) కడుక్కోవాలి.
∙ గుడ్డు పచ్చసొన, ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, బాగా పండిన టొమాటోలను మెత్తగా గ్రైండ్ చేసి ముఖానికి ప్యాక్ వేసుకుని 20 నిముషాలు ఉంచి కడుక్కోవాలి. ఇలా వారానికి రెండుసార్లైనా చేసుకుంటే పొడిబారిన చర్మం మృదువుగా మారుతుంది. ఇలా తరచుగా చేసుకుంటే చర్మం కాంతివంతమవడమే కాకుండా, స్కిన్ టైట్ అవుతుంది.
∙గుడ్డులోని తెల్లసొనకు శనగపిండిని చేర్చి దానిని తలకి పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేస్తే చుండ్రు సమస్యని కొంత వరకూ తొలగించవచ్చు. వెంట్రుకలు కూడా మృదుత్వం పొందుతాయి.
Comments
Please login to add a commentAdd a comment