
జలుబు వల్ల ఉదయం నిద్రలేవగానే కళ్ల కింద ఉబ్బుగా కనిపిస్తుంది. ఎండిన చిట్టి చేమంతులను పొడి చేసి, ఆ పొడిని ఒక గుడ్డలో వేసి మూట కట్టాలి. వేడి నీటిలో ఆ మూటను కాసేపు ఉంచి, ఉబ్బుగా ఉన్న కళ్ల కింద మృదువుగా అద్దుతూ (తగినంత మాత్రమే వేడి ఉండేలా జాగ్రత్తపడాలి) ఉండాలి.
రోజూ ఉదయాన్నే ఇలా చేస్తే కళ్లకింద ఉబ్బుతో పాటు నల్లని వలయాలు కూడా తగ్గుముఖం పడతాయి. చామంతి పొడితో కాచిన తేనీటిని మాడుకు పట్టించి, తర్వాత తలస్నానం చేస్తే ఎంతకీ తగ్గని చుండ్రు సమస్య పరిష్కారం అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment