
మొటిమల సమస్యా?!
అందం
తలలో చుండ్రు ఉంటే ముఖం, భుజాలు, వీపు మీద మొటిమల సమస్య పెరుగుతుంది.ఉదయం లేచిన తర్వాత, రాత్రి పడుకోబోయేముందు తప్పనిసరిగా ఫేస్ వాష్‌తో ముఖాన్ని శుభ్రపరచుకోవాలి. రెండుశాతం సాలిసైలిక్ యాసిడ్, 10 శాతం బెంజాల్ పెరాక్సైడ్ గల లోషన్‌ను ఉదయం వేళ ముఖానికి, భుజాలకు రాసుకోవాలి. సాలిసిలిక్ యాసిడ్, బెంజాల్ పెరాక్సైడ్‌లు జిడ్డును తగ్గించడానికి ఉపయోగపడతాయి.
చర్మంపై మృతకణాలు తొలగిపోవడానికి అప్రికాట్, యాపిల్, లెమన్ స్క్రబ్‌లను ఎంచుకోవచ్చు. రోజూ 30 నిమిషాల వ్యాయామం.. క్రికెట్, సైక్లింగ్ వంటి క్రీడలు ఆరోగ్యంగా ఉంచుతాయి. తాజాపండ్లు, కాయగూరలు ఆహారంలో ఎక్కువభాగం ఉండేలి. రోజుకు 8-10 గ్లాసుల నీళ్లకు తగ్గకుండా తాగాలి. ఇవన్నీ చర్మకణాలను శుభ్రపరిచి, మొటిమల సమస్యను తగ్గిస్తాయి.