
బ్యూటిప్స్
అల్లం పేస్ట్ వంటకాల్లో ఎంతటి రుచిని అందిస్తుందో అందానికి తోడ్పడుతుంది. చుండ్రుతో బాధపడేవారికి అల్లం ఔషధంగా పనిచేస్తుంది. అల్లం పేస్ట్‌లో కాస్త తేనె, నిమ్మరసం కలిపి మాడుకు పట్టించాలి. అరగంట తర్వాత కుంకుడు రసంతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే ఫలితం ఉంటుంది.
బొప్పాయి గుజ్జులో తేనె, పాలు, బాదం నూనె కలిపి కాళ్లకు రాసుకోవాలి. కొద్ది దానితో స్క్రబ్ చేసి అరగంట తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. దీని వల్ల కాళ్లపై ఉన్న నలుపు రంగు, గరుకుదనం పోయి నిగారిస్తాయి.
ముఖంపై మొటిమలు, నల్లమచ్చలతో ఇబ్బంది పడేవారు ఈ చిట్కా పాటిస్తే చాలు. మెంతికూర ఆకుల పేస్ట్‌ను రోజూ రాత్రిపూట నిద్రపోయే ముందు రాసుకొని 10-15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. తర్వాత ముఖానికి పాల మీగడ రాసుకొని నిద్రపోవాలి. ఇలా చేస్తే ముఖం మృదువుగా మారుతుంది.