పారిస్: జలాంతర్గాముల కొనుగోలు వివాద అంశంలో అమెరికా, ఆ్రస్టేలియాపై గుర్రుగా ఉన్న ఫ్రాన్స్ ఇకపై ఇండోపసిఫిక్ ప్రాంతంలో భారత్‌తో కలిసి పనిచేయాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు ఫ్రాన్స్ అధిపతి మాక్రాన్ భారత ప్రధాని మోదీతో చర్చలు జరిపారు. ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేయాల్సిన జలాంతర్గాముల ఆర్డర్‌ను ఆ్రస్టేలియా అర్థాంతరంగా రద్దు చేసింది. వీటికి బదులు అమెరికా నుంచి జలాంతర్గాములు కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంది. దీంతో ఆగ్రహించిన ఫ్రాన్స్ తన రాయబారులను యూఎస్, ఆ్రస్టేలియా నుంచి వెనక్కుపిలిపించింది. అలాగే ఫ్రాన్స్‌కు సంబంధం లేకుండా యూఎస్, యూకే, ఆ్రస్టేలియాలు ఇండోపసిఫిక్ ప్రాంతంలో ఆకుస్ పేరిట కొత్త గ్రూపును ఏర్పరుచుకోవడం కూడా ఫ్రాన్స్ ఆగ్రహానికి కారణమైంది.
ఈ నేపథ్యంలో తమకు ఈ ప్రాంతంలో నమ్మకమైన మిత్రదేశం అవసరం ఉందని గ్రహించే ఇండియాను ఫ్రాన్స్ సంప్రదించిందని రక్షణ నిపుణులు అభిప్రాయపడ్డారు. మోదీతో టెలిఫోన్ సంభాషణలో అఫ్గాన్ అంశం కూడా చర్చకు వచి్చనట్లు మాక్రాన్ కార్యాలయం తెలిపింది. ఇకపై ఇండోపసిఫిక్ ప్రాంతంలో భారత్, ఫ్రాన్స్‌లు సంయుక్తంగా వ్యవహరిస్తాయని తెలిపింది. భారత్‌కు ఎటువంటి సాయం అందించేందుకైనా తయారుగా ఉన్నట్లు ఫ్రాన్స్ అధ్యక్షుడు చెప్పారు. పరస్పర నమ్మకం, గౌరవం ఆధారంగా ఇరుదేశాల సంబంధాలు కొనసాగుతున్నాయన్నారు. మరోవైపు ఫ్రాన్స్‌ను శాంతిపజేసేందుకు యూఎస్ అధ్యక్షుడు యతి్నస్తున్నారు. కానీ ఇరువురి సమావేశానికి తేదీ నిర్ణయించలేదు.
Comments
Please login to add a commentAdd a comment