
‘వారందరికీ మా అమ్మపై అసూయ’
పిన్న వయసులోనే ఫ్రాన్స్ అధ్యక్ష పదవి దక్కించుకున్న వ్యక్తిగా ఎమ్మాన్యుయల్ మాక్రాన్ గురించి పెద్ద మొత్తంలో చర్చ జరుగుతుండగా అంతకంటే ఎక్కువగా ఇప్పుడు ఆయన భార్య గురించి చర్చ మొదలైంది.
పారిస్: పిన్న వయసులోనే ఫ్రాన్స్ అధ్యక్ష పదవి దక్కించుకున్న వ్యక్తిగా ఎమ్మాన్యుయల్ మాక్రాన్ గురించి పెద్ద మొత్తంలో చర్చ జరుగుతుండగా అంతకంటే ఎక్కువగా ఇప్పుడు ఆయన భార్య గురించి చర్చ మొదలైంది. అయితే, మొన్నటి వరకు బాహాటంగా ఆ విషయంపై స్పందించని మాక్రాన్ తాజాగా ఓ పర్షియన్ వార్తా పత్రికకు ఈ వారం ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించారు. ‘నేను నా భార్యకంటే 20 ఏళ్లు పెద్దవాడినై ఉంటే ఎవరూ అడిగే వారు కాదు కదా! మరో ప్రశ్న వేసే వారు కదా’ అంటూ ఎదురు ప్రశ్నించారు.
ఇక ప్రస్తుతం ఫ్రాన్స్‌లో జరిగిన ఎన్నికలకు వాషింగ్టన్ పోస్ట్ తరుపున బాధ్యతలు నిర్వహిస్తున్న మేరీ జోర్డాన్‌తో చాలా మంది మాక్రాన్ వివాహంపై స్పందిస్తూ ఎన్నో ఏళ్లుగా ఫ్రాన్స్‌ను ఏలే నేతలంతా కూడా తమకంటే చాలా చిన్నవారినే వివాహం చేసుకుంటూ వచ్చారని, ముదుసలి వయసులో ఉన్నవారు కూడా యువతులను పెళ్లాడేవారని, అలాంటి చర్యలపై మాక్రాన్ వివాహం ఒక సోషల్ రివెంజ్‌లాంటిదంటూ చెప్పారు. మాక్రాన్ వయసు ప్రస్తుతం 39 ఏళ్లుకాగా, ఆయన భార్య బ్రిగిట్టే మాక్రాన్ వయసు ప్రస్తుతం 64 ఏళ్లు. వీరిద్దరి మధ్య దాదాపు 25 ఏళ్ల గ్యాప్ ఉంది. ఈ విషయంపై అడ్డగోలుగా వ్యాఖ్యానాలు బయలుదేరాయి. ముఖ్యంగా ఆయన అధ్యక్ష రేసులోకి వచ్చాక ఎక్కువయ్యాయి.
దీంతో ఇమ్మాన్యుయెల్ తన వివాహాన్ని సమర్థించుకోగా ఆయన తోడుగా టిపాయినే అజైర్ తోడయ్యారు. ఈమె బ్రిగిట్టే కుమార్తె. ప్రస్తుతం న్యాయవాదిగా పనిచేస్తున్న ఈమె అడ్డగోలు వ్యాఖ్యానాలపై స్పందించారు. ప్రస్తుతం ఎవరైతే తన తల్లిపై విమర్శలు చేస్తున్నారో వారంతా కూడా అసూయతోనే చేస్తున్నారే తప్ప వేరే ఉద్దేశం కాదంది. వారు అపకుండా ఇలాగే అన్నా పెద్దగా వచ్చే నష్టమేమి లేదని, ప్రజలకు మరింత దగ్గరవుతామంటూ తిప్పికొట్టింది. తనకంటే వయసులో పెద్దదైన భార్యను కలిగి ఉన్న తొలి అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ కానున్నారు.