పారిస్: ఫ్రాన్స్ పార్లమెంట్ ఎన్నికల రెండో దశ పోలింగ్ ముగిసింది. ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు 59.7 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 577 స్థానాలకుగాను మూడు పార్టీల కూటములకు స్పష్టమైన తీర్పు రాలేదు. అంచనాలు తలకిందులై ఫ్రాన్స్‌లో ఏ పార్టీకి స్పష్టమైన తీర్పు రాకుండా హంగ్ ఏర్పడింది. ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 289 ఎంపీ సీట్లు గెలవాలి.
ఇక మొదటి దశ పోలింగ్‌లో అతివాద కూటమి నేషనల్ ర్యాలీ (ఆర్‌ఎన్) 33 శాతం పాపులర్ ఓటు షేర్ సాధించింది. లెఫ్ట్ వింగ్ న్యూ పాపులర్ ఫ్రంట్(ఎన్‌ఎఫ్‌పీ) కూటమి 28 శాతం పాపులర్ ఓటు షేర్ సాధించింది. అయితే అధికార ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ సెంట్రిక్ పార్టీ కేవలం 21 శాతం ఓటు షేర్‌తో మూడోస్థానానికి పరిమితమైంది.
ఇక.. ఆదివారం జరిగిన రెండో దశ పోలింగ్‌లో లెఫ్ట్ పార్టీ న్యూ పాపులర్ ఫ్రంట్ అనూహ్యంగా 182 స్థానాలు గెలుచుకొని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 289 సీట్లు రావాల్సింది ఉంది. మొదటి రౌండ్ పోలింగ్‌లో అత్యధిక పాపులర్ ఓటు షేర్ సంపాధించిన రైట్ వింగ్ నేషనల్ ర్యాలీ రెండో దశ పోలింగ్ అనంతరం 143 స్థానాలు మాత్రమే గెలచుకొని మూడో స్థానంలోకి వెళ్లింది.
ఇక అధికార మేక్రాన్ సెంట్రిక్ పార్టీ కూటమి 163 ఎంపీ స్థానాలు గెలచుకొని రెండో స్థానంతో సరిపెట్టుకుంది. అయితే మొదటి నుంచి ఈసారి ఎన్నికలల్లో రైట్ వింగ్ నేషనల్ ర్యాలీ పార్టీ అధిక సీట్లు గెలచుకొని అధికారంలోకి వస్తుందని పలు సర్వేలు జోస్యం చెప్పాయి. అంచనాలను తలకిందులు చేస్తూ.. అనూహ్యంగా లెఫ్ట్ పార్టీ అధిక సీట్లు గెలుచుకొని మొదటి స్థానంలోకి రాగా.. రైట్ వింగ్ పార్టీ మూడో స్థానంలోకి వెళ్లింది. ఈ అనూహ్య ఫలితాలతో ఫ్రాన్స్‌లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడనుందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఐరోపా ఎన్నికల్లో మధ్యేవాదుల పరాజయం తర్వాత అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ జూన్ 9న పార్లమెంట్‌ను రద్దు చేసి ఎన్నికలకు పిలుపునిచ్చారు. అయితే.. మాక్రాన్ అధ్యక్ష పదవీ కాలం ఇంకా మూడేళ్లు ఉండగానే ముందస్తు ఎన్నికలకు వచ్చారు. ప్రస్తుతం ఫలితాలతో ఏ పార్టీ కూటమి అధికారంలోకి వస్తుందనే ఆసక్తి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment