
వీడియో దృశ్యాలు
వాలెన్స్: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్‌ను చెంపదెబ్బ కొట్టిన వ్యక్తికి 18 నెలల జైలు శిక్ష విధించాలంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు విజ్ఞప్తి చేస్తున్నారు. నిందితుడు డామియెన్ టారెల్ చర్య కచ్చితంగా ఆమోదయోగ్యం కానిదని, అది ఉద్దేశ్యపూర్వకంగా హింసకు పాల్పడడమేనని వారు పేర్కొన్నారు. ప్రభుత్వ అధికారిపై దాడి చేసిన కారణంగా ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్న నిందితుడికి గరిష్టంగా మూడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు 45వేల యూరోల జరిమానా పడే అవకాశం ఉంది. కాగా, గత మంగళవారం ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న మాక్రాన్ టేయిన్ ఎల్ హెర్మిటేజ్‌లోని ఓ హోటల్ స్కూల్‌ను సందర్శించారు. మధ్యాహ్నం 1.15 ప్రాంతంలో అక్కడినుంచి వెళ్లిపోవటానికి తన కారులోకి వెళ్లి కూర్చున్నారు.
అయితే, ప్రజలు ఆయన్ని చూడాలని అరుస్తుండటంతో జనం దగ్గరకు వచ్చేశారు. ఈ నేపథ్యంలో బ్యారిగేడ్ల దగ్గర ఉన్న డామియెన్ టారెల్( ఆకుపచ్చ రంగు టీషర్టు వేసుకున్న వ్యక్తి) దగ్గరకు వచ్చారు. ఆ వెంటనే అతడు అధ్యక్షుడు మాక్రన్ చెంపను చెల్లుమనిపించాడు. దీంతో మాక్రాన్ వ్యక్తిగత సిబ్బందిపై విరుచుకుపడ్డారు. వారు ఆయన్ని పక్కుకు తీసుకెళ్లి, టారెల్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారింది.
చదవండి : షేక్‌హ్యాండ్ ఇవ్వబోయిన అధ్యక్షుడి చెంప మీద కొట్టాడు!
Comments
Please login to add a commentAdd a comment