షేక్‌హ్యాండ్‌ ఇవ్వబోయిన అధ్యక్షుడి చెంప మీద కొట్టాడు! | France President Emmanuel Macron Slapped By Man He Tried To Shake Hands | Sakshi
Sakshi News home page

షేక్‌హ్యాండ్‌ ఇవ్వబోయిన అధ్యక్షుడి చెంప మీద కొట్టాడు!

Published Tue, Jun 8 2021 8:00 PM | Last Updated on Tue, Jun 8 2021 9:36 PM

France President Emmanuel Macron Slapped By Man He Tried To Shake Hands - Sakshi

పారిస్‌: ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మాక్రాన్‌కు ఘోర పరాభావం ఎదురయ్యింది. దేశవ్యాప్త పర్యటనలో ఉన్న మాక్రాన్‌ చెంప పగలకొట్టాడు ఓ ఆగంతకుడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. దేశవ్యాప్త పర్యటనలో భాగంగా మంగళవారం మాక్రాన్‌ ఆగ్నేయ ఫ్రాన్స్‌లో పర్యటించారు. బీఎఫ్‌ఎం న్యూస్‌ చానెల్‌ ప్రసారం చేసిన వీడియో ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 1:15 గంటలకు (11.15 జీఎంటీ) డ్రోమ్ ప్రాంతంలోని టైన్-ఎల్ హెర్మిటేజ్ గ్రామంలో ఒక ఉన్నత పాఠశాలను సందర్శించి తన కారు దగ్గరకు వెళ్లాడు మాక్రాన్‌

కానీ అక్కడ ఉన్న జనాలు మాక్రాన్‌ను పిలవడంతో ఆయన తిరిగి వెనక్కి వచ్చాడు. బారికేడ్ల వెనక ఉన్న జనాలను పలకరించాడు. ఈ క్రమంలో అక్కడే ఉన్న 43 ఏళ్ల వ్యక్తికి మాక్రాన్‌ షేక్‌హ్యాండ్‌ ఇచ్చాడు. ఇంతలో సదరు ఆగంతకుడు వెంటనే తన చేతిని వెనక్కి తీసుకుని.. మాక్రాన్‌ చెంప పగలకొట్టాడు. దాంతో అంత దూరాన పడ్డాడు అధ్యక్షుడు. అనుకోని ఈ సంఘటనకు అక్కడున్న వారంతా షాక్‌ అయ్యారు. ఇంతలో మాక్రాన్‌ బాడీగార్డులు వచ్చి ఆ ఆగంతకుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతడిని ప్రశ్నిస్తున్నారు. 

చదవండి: నడి రోడ్డుపై దేశాధ్యక్షుడి పోస్టర్లు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement