ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రోన్‌కు మరోసారి ఘోర అవమానం ఎదురైంది. అందరూ చూస్తుండగానే ఓ మహిళ అధ్యక్షుడి చెంప చెళ్లుమనిపించింది. అధిక ధరలు, నిరుద్యోగాన్ని అరికట్టడంలో మెక్రాన్ విఫలమయ్యాడంటూ ఆరోపిస్తూ మహిళ దాడి చేసింది. భద్రతా సిబ్బంది వచ్చేలోపే ఆమె ఈ ఘటనకు పాల్పడింది. వెంటనే సెక్యూరిటీ గార్డులు మహిళను గుంపు నుంచి పక్కకు లాగి అదుపులోకి తీసుకున్నారు. అయితే దాడికి పాల్పడిన మహిళ ఎవరనేది ఇంకా తెలియరాలేదు.
కాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో బారియర్‌కు అటువైపున్న మాక్రాన్ తన ఎదురుగా ఉన్న ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఇంతలో అక్కడ గుంపులో ఉన్న ఓ మహిళ అధ్యక్షుడి చెంప పగలగొట్టింది ఫ్రాన్స్‌లోని డ్రోమ్ ప్రాంతంలోని టైన్-ఎల్'హెర్మిటేజ్ అనే పట్టణాన్ని మాక్రాన్ సందర్శించిన సమయంలో ఈ దాడి జరిగినట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది.
చదవండి: 10 రోజుల్లో 12 మందికి శిరచ్ఛేదం.. మరణ దండనలో రాజీపడని సౌదీ..
Emmanuel Macron got slapped up again pic.twitter.com/puqyPnJOyB
— Luke Rudkowski (@Lukewearechange) November 20, 2022
ఇదిలా ఉండగా గతేడాది కోవిడ్ సమయం జూన్‌లో కూడా మెక్రాన్‌పై ఓ ర్యాలీలో దాడి జరిగింది. ప్రజల వద్దకు వెళ్లి మాట్లాడుతుండగా ఓ యువకుడు ఆయన చెంపపై కొట్టాడు.అనంతరం అతడిని అదుపులోకి తీసుకొని నాలుగు నెలలపాటు జైలు శిక్ష వేశారు.
అయితే మాక్రాన్‌పై దాడి ఘటన ఇప్పటిది కాదని.. ఇది పాత వీడియో అని కొందరు ప్రచారం చేస్తున్నారు. గతేడాది జరిగిన సంఘటనకు సంబంధించినది చెబుతున్నారు. అంతేగాక దాడి చేసింది మహిళ కాదని వ్యక్తి అని అంటున్నారు. వీడియో వెనక భాగం నుంచి రికార్డ్ చేయడం ద్వారా మహిళ అధ్యక్షుడిపై దాడి చేసినట్లు కనిపిస్తుందని వాస్తవానికి అది అబ్బాయి అని పేర్కొంటున్నారు. ఏది నిజం అనేది తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment