
22 మంత్రుల్లో 11 మంది మహిళలే..
పారిస్: ఫ్రాన్స్ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన ఇమ్మాన్యుయెల్ మెక్రాన్ తన కేబినెట్‌ను సిద్ధం చేశారు. దాదాపు అన్ని వర్గాల వారికి ఆయన చోటు కల్పించారు. కన్జర్వేటివ్స్‌కు, సోషలిస్టులకు, కొత్తగా ఎన్నికైన వారికి ఆయన తన కేబినెట్‌లో స్థానం ఇచ్చారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కేబినెట్ కూర్పులో లింగసమానత్వాన్ని పాటించారు. సగం మంది పురుషులను, సగం మంది మహిళలను తన ప్రభుత్వాన్ని సమర్థంగా నడిపించే మంత్రులుగా స్వీకరించారు. మొత్తం 22మంది మంత్రులతో కేబినెట్‌ను సిద్ధం చేసుకున్నా మెక్రాన్ అందులో 11 మంత్రి పదవులు మహిళలకే ఇచ్చి ఔరా అనిపించారు.
రిపబ్లికన్ పార్టీకి చెందిన ఎడ్వర్డ్ పిలిప్పే తనకు కాబోయే ప్రధానిగా ప్రకటించినాయన ప్రముఖ సోషియాలజిస్ట్ లయన్ మేయర్ గెరార్డ్ కొలంబోను తన ప్రభుత్వంలో రెండో స్థానం కల్పించి అంతర్గత వ్యవహారాలు కట్టబెట్టారు. ఇక రక్షణ బాధ్యతలను సిల్వీ గోలార్డ్‌కు అప్పగించారు. ఆమె మాజీ అధ్యక్షురాలు ఫ్రాంకోయిస్ హోలాండ్‌కు అత్యంత సన్నిహితులైన జియాన్ వెస్‌లీ డ్రియాన్ నుంచి బాధ్యతలు చేపట్టనున్నారు. ఒలింపిక్ ఫెన్సింగ్ చాంపియన్ లారా ఫ్లెస్సెల్(45)కు క్రీడాశాఖ బాధ్యతలు అప్పగించారు. ఇలా దాదాపుగా తన కేబినెట్‌లోకి తీసుకున్న వారికి గతంలో ఏ అంశాలపై పట్టుఉందో అందుకు తగినట్లుగానే శాఖలు కేటాయించారు.