సాక్షి, హైదరాబాద్: భారత ప్రధాని నరేంద్ర మోదీ.. ఇటీవల ఫ్రాన్స్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. మోదీ ఫ్రాన్స్ బాస్టిల్ డే ఉత్సవాలకు అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, ప్రధాని మోదీ.. ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకున్నారు. కాగా, ప్రధాని మోదీ.. మాక్రాన్ భార్యకు ఇక్కత్ చీరను బహుమతిగా ఇచ్చారు. దీని ఖరీదు.. లక్ష రూపాయల వరకు ఉంటుందని నేతన్నలు చెబుతున్నారు.
ఈ సందర్భంగా నల్లగొండకు చెందిన ఇక్కత్ చీరల నేత కార్మికుడు గోలి సాంబయ్య మీడియాతో మాట్లాడుతూ.. మేము నేసిన చీరను ప్రధాని మోదీ బహుమతిగా ఇవ్వడం చాలా గర్వంగా ఉంది. పోచంపల్లి, పుట్టపాక, గట్టుప్పలలో ఇక్కత్ చీరల తయారీ జరుగుతోంది. దేశంలో మరెక్కడా ఇక్కత్ చీరలు తయారు చేయరు. పురాతన కాలం నుంచి ఇక్కత్ చీర కళను కాపాడుతున్నామని తెలిపాడు. మోదీ బహుమతిగా ఇచ్చిన చీరకు దాదాపు రూ.లక్ష వరకు ఉండొచ్చని తెలిపారు.
ఇది కూడా చదవండి: థాంక్ యూ ప్రైమ్ మినిస్టర్ అంటూ వీడియో పోస్ట్ చేసిన ఫ్రాన్స్ అధ్యక్షుడు..
Comments
Please login to add a commentAdd a comment