
పారిస్: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయెల్ మాక్రాన్ కరోనా వైరస్ బారిన పడ్డారు. మాక్రాన్‌కు కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయిస్తే పాజిటివ్‌గా తేలిందని అధ్యక్ష భవనం గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. నిర్ధారణ కాగానే మాక్రాన్ ఏడు రోజుల సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయారు. క్వారంటైన్‌లో ఉంటూనే ఆయన అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తారని అధికారులు వెల్లడించారు.ఇటీవల మాక్రాన్ చాలా మంది ప్రపంచ నేతల్ని కలుసుకున్నారు. ఈయూ సదస్సుకు సైతం హాజరయ్యారు.
ఈ మధ్య కాలంలో అధ్యక్షుడిని కలుసుకున్న వారంతా క్వారంటైన్‌లోకి వెళ్లి కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని అధ్యక్ష భవనం ప్రతినిధులు సూచించారు. ఇటీవల ఫ్రాన్స్‌లో కరోనా సెకండ్ వేవ్ విజృంభించింది. ఆరువారాల పాటు లాక్‌డౌన్ కూడా విధించారు. ఈ నెల 27 నుంచి ఫ్రాన్స్‌లో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం జరగనుంది. గతంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, బ్రిటన్ ప్రధాని జాన్సన్, బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సనారో, బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ తర కరోనా బారిన పడి కోలుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment