ఈ ఇద్దరి నవ్వులకు ఇంటర్నెట్ థ్రిల్
జర్మనీలోని హాంబర్గ్‌లో వార్షిక జీ20 సదస్సు.. మొత్తం 19 దేశాల అధినేతలతో పాటు యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. వీరిలో కెనడియన్ ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడ్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యూల్ మాక్రోన్‌లు ఉన్నారు. దాదాపు ఒకే వయసున్న వీరిద్దరు ఎంతో స్నేహపూర్వకంగా పలకరించుకున్నారు. ఈ మీటింగ్ అంతా ఈ ఇద్దరు నేతలు ఒకరికొకరు నవ్వుకంటూ కనిపించడంతో సోషల్‌మీడియా థ్రిల్ అవుతోంది. జర్మన్ కేబినెట్ అధికారిక ఫేస్‌బుక్ పేజీలో, ట్విట్టర్‌లో వీరి వీడియోలను పోస్టు చేశారు.
సదస్సులో వీరి స్నేహపూర్వక సంభాషణలపై, ఫోటోలపై సోషల్ మీడియా వావ్ అవుతోంది. మీటింగ్ అయిన తర్వాత కూడా ఈ నేతలు ఒకరికొకరు ట్వీట్లు చేసుకున్నారు. సిసిలో జరిగిన జీ7 సదస్సు సందర్భంగా మేనెలలో వీరు తీసుకున్న ఫోటోలకు కూడా సోషల్ మీడియాలో మంచి స్పందన వస్తోంది.. చిన్న వయసులోనే ఇమ్మాన్యుల్ మాక్రోన్ ఫ్రాన్స్ దేశాధ్యక్షుడిగా బాధ్యతలు వ్యవహరిస్తుండగా, జస్టిన్ ట్రూడ్ కెనడాకు ప్రధానమంత్రిగా ఉన్నారు.