సాక్షి, ముంబై: ఫ్రెంచ్ కార్ మేకర్ సిట్రోయెన్ సీ 3 కార్లను ఎట్టకేలకు భారత మార్కెట్లో లాంచ్ చేసింది. కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మంట్లో వీటిని సరికొత్తగా తీసుకొచ్చింది. ఈ కార్ ధరను రూ. 5.70 లక్షల (ఎక్స్-షోరూమ్, పరిచయ ధర) గా కంపెనీ నిర్ణయించింది. భారతీయ మార్కెట్లో సిట్రోయెన్ హౌస్ నుండి వచ్చిన తొలి చిన్న ఎస్‌యూవీ ఇది. మొత్తం ఆరు వేరియంట్లలో, పది రంగుల్లో సిట్రోయెన్ సీ3 లభిస్తుంది. ఈ ఫైవ్ సీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీని పూర్తిగా ఇండియా కస్టమర్లకోసం లాంచ్ చేయడం విశేషం.
ఇంజన్, ఫీచర్లు
రెండు ఇంజిన్ ఆప్షన్స్‌లో లభ్యం. 5 స్పీడ్ మాన్యువల్, 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ 5,750 ఆర్‌పీఎం వద్ద 81 బీహెచ్‌పీ, 115 టార్క్‌ను అందిస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ మోటార్ 5,750 ఆర్‌పీఎం వద్ద, 108 బీహెచ్‌పీని, 1150 ఆర్‌పీఎం వద్ద 190 ఎన్‌ఎం టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది.
ఫంకీ డిజైన్, V-ఆకారంలో LED డేటైమ్ రన్నింగ్ లైట్లు, హెడ్‌ల్యాంప్స్ అమర్చింది. డ్యూయల్-టోన్ ఎక్ట్సీరియర్, చుట్టూ బ్లాక్ ప్లాస్టిక్ క్లాడింగ్, డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్‌తో సిట్రోయెన్ సీ3 ముస్తాబైంది. డ్యూయల్-టోన్ డాష్ బోర్డ్ 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్. ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ,డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఇంటీరియర్ ఫీచర్లుగా ఉన్నాయి.
సిట్రోయెన్ సీ3 ధరలు
లైవ్: రూ. 5,70,500
ఫీల్: రూ. 6,62,500
ఫీల్ వైబ్ ప్యాక్: రూ. 6,77,500
ఫీల్ డ్యూయల్ టోన్: రూ. 6,77,500
ఫీల్ డ్యూయల్ టోన్ వైబ్ ప్యాక్: రూ. 6,92,500
టర్బో ఫీల్ డ్యూయల్ టోన్ వైబ్ ప్యాక్: రూ. 8,05,500
దేశవ్యాప్తంగా ఉన్న అన్ని లా మైసన్ సిట్రోయెన్ ఫిజిటల్ షోరూమ్‌లలో వినియోగదారులకు కొత్త సీ3 డెలివరీలు నేటి (జూలై 20) నుండి ప్రారంభం. ఢిల్లీ, గుర్గావ్, ముంబై, పూణే, అహ్మదాబాద్, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, కొచ్చి, చెన్నై, చండీగఢ్, జైపూర్, లక్నో, భువనేశ్వర్ వంటి 19 నగరాల్లోని లా మైసన్ సిట్రోయెన్ ఫైజిటల్ షోరూమ్‌లలో కొత్త సిట్రోయెన్ సీ3 రిటైల్‌గా అందుబాటులో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment