Compact SUV
-
కాంపాక్ట్ ఎస్‌యూవీలు.. టాప్‌గేర్‌లో అమ్మకాలు..
ఒకపక్క కార్ల కంపెనీలు బంపీ రైడ్‌తో సతమతమవుతున్నప్పటికీ... స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్‌యూవీలు) తగ్గేదేలే అంటున్నాయి. భారతీయులకు తొలి చాయిస్‌గా మారుతున్నాయి. నిన్నమొన్నటిదాకా అమ్మకాల్లో పైచేయి సాధించిన హ్యాచ్బ్యాక్స్, సెడాన్స్ ఆధిపత్యానికి తెరపడింది. ఇప్పుడు దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్ల విభాగంగా కాంప్టాక్ట్ ఎస్‌యూవీలు కేక పుట్టిస్తున్నాయి!! దేశంలో కారు ప్రియుల కొనుగోలు ట్రెండ్ శరవేగంగా మారిపోతోంది. 4 మీటర్ల లోపు పొడవైన హ్యాచ్బ్యాక్స్, సెడాన్ల (కాంపాక్ట్ ప్యాసింజర్ కార్లు) హవాకు బ్రేక్‌లు పడుతున్నాయి. ఎస్‌యూవీలు రాజ్యమేలుతున్న కాలంలో కూడా అమ్మకాల్లో టాప్‌లేపిన ఈ సెగ్మెంట్‌ను తొలిసారిగా కాంపాక్ట్ ఎస్‌యూవీలు ఓవర్టేక్ చేశాయి. భారతీయ ఆటోమొబైల్ తయారీ సంస్థల సొసైటీ (సియామ్) తాజా లెక్కల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధం (2024–25, ఏప్రిల్–సెప్టెంబర్)లో 4 మీటర్ల లోపు కాంపాక్ట్ ఎస్‌యూవీలు దుమ్మురేపాయి. ఈ సెగ్మెంట్లో 6,71,674 వాహనాలు అమ్ముడయ్యాయి. ఇదే తరుణంలో కాంపాక్ట్ ప్యాసింజర్ కార్ల సేల్స్ 5,58,173 యూనిట్లకు పరిమితమయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంతో పోలిస్తే ఈ రెండు విభాగాల అమ్మకాలు రివర్స్ కావడం విశేషం. రివర్స్ గేర్...గతేడాది వరకు దేశంలో కాంపాక్ట్ ప్యాసింజర్ కార్ల జోరుకు తిరుగేలేదు. అమ్మకాల్లో ఈ విభాగానికిదే టాప్ ర్యాంక్. నాలుగేళ్ల క్రితమైతే కాంపాక్ట్ ఎస్‌యూవీలతో పోలిస్తే రెట్టింపు స్థాయిలో సేల్స్ నమోదయ్యాయి. ఐదేళ్లకు ముందు చూస్తే, కాంపాక్ట్ ఎస్యూవీ 1 అమ్ముడైతే కాంపాక్ట్ ప్యాసింజర్ కార్లు 3 హాట్ కేకుల్లా రోడ్డెక్కేవి. ఇదంతా గతం. దేశంలో నవతరం దూకుడు... ఆటోమొబైల్ రంగం ముఖచిత్రాన్ని మలుపుతిప్పుతోంది. మరోపక్క, ఎంట్రీ లెవెల్ మైక్రో ఎస్‌యూవీలు అందుబాటుల ధరల్లో లభిస్తుండటంతో గ్రామీణ కార్ లవర్స్ సైతం వీటికే సై అంటున్నారు. దీంతో చిన్న ఎస్‌యూవీలకు డిమాండ్ ఓ రేంజ్లో ఉంటోందనేది నిపుణుల మాట. టాటా పంచ్, నెక్సాన్, మారుతీ ఫ్రాంక్స్, మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ, హ్యుందాయ్ వెన్యూ, ఎక్స్టర్, కియా సోనెట్, మారుతీ బ్రెజా, నిస్సాన్ మాగ్నైట్, రెనో కైగర్, సిట్రాన్ సీ3, ఎయిర్‌క్రాస్ వంటివి కాంపాక్ట్ ఎస్యూవీ విభాగంలో బాగా అమ్ముడవుతున్న మోడల్స్. వీటిలో కొన్ని కార్లు నెలకు 10,000 అమ్మకాల మార్కును కూడా అధిగమిస్తుండటం విశేషం! ఇక కాంపాక్ట్ ప్యాసింజర్ కార్ల విషయానికొస్తే, మారుతీదే పూర్తి ఆధిపత్యం. స్విఫ్ట్, వ్యాగన్ ఆర్, బాలెనో, డిజైర్ మార్కెట్‌ను శాసిస్తున్నాయి. ఇతర కార్లలో టాటా టిగోర్, ఆ్రల్టోజ్, టియాగో, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10, ఐ20 వంటివి అంతంతమాత్రంగానే అమ్ముడవుతుండటం గమనార్హం. హ్యాచ్‌బ్యాక్, సెడాన్ మోడల్స్ డౌన్... కారణాలేవైనప్పటికీ గత కొంతకాలంగా కాంపాక్ట్ పాసింజర్ కారు మోడల్స్ కనుమరుగవుతున్నాయి. ఫోర్డ్ మోటార్స్ 2022లో ఇండియా నుండి దుకాణం సర్దేయడంతో ఫిగో, ఫిగో యాస్పైర్, ఫ్రీస్టయిల్, ఫియస్టా వంటి బాగా పాపులర్ మోడల్స్ అందుబాటులో లేకుండా పోయాయి. ఫోర్డ్ నిర్ణయంతో హాట్ ఫేవరెట్ ఎకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్యూవీ సైతం మార్కెట్‌కు దూరం కావడం గమనార్హం. హోండా సైతం జాజ్, బ్రియో వంటి హ్యాచ్‌బ్యాక్‌ల అమ్మకాలను అపేసింది. హోండా సిటీ సేల్స్ కూడా నేలచూపులు చూస్తున్నాయి. మరోపక్క, డాట్సన్ కూడా 2022లో గుడ్‌బై చెప్పడంతో గో, రెడీగో వెళ్లిపోయాయి. టయోటా లివా, ఫోక్స్‌వ్యాగన్ అమియో, పోలో సైతం సెలవు తీసుకున్నాయి. ఐదేళ్ల క్రితం దాదాపు 30 వరకు ప్యాసింజర్ కారు మోడల్స్ కస్టమర్లకు విభిన్న ఆప్షన్లతో కనువిందు చేయగా.. ఇప్పుడీ సంఖ్య 15కు పడిపోవడం విశేషం. ఒకపక్క మోడల్స్ తగ్గిపోవడంతో పాటు కస్టమర్ల కొనుగోలు ధోరణి మారుతుండం కూడా కాంపాక్ట్ ప్యాసింజర్ కార్లకు గండికొడుతోంది!!ఆకట్టుకుంటున్న ఫీచర్లు... కాస్త ధరెక్కువున్నప్పటికీ, మరిన్ని ఫీచర్లు లభిస్తుండటంతో చాలా మంది కస్టమర్లు కాంపాక్ట్ ఎస్‌యూవీలకు అప్‌గ్రేడ్ అవుతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. హ్యాచ్బ్యాక్స్, సెడాన్ కార్లతో పోలిస్తే విశాలమైన స్పేస్, బలిష్టమైన రూపంతో పాటు మెరుగైన డ్రైవింగ్ అనుభవం వల్ల కూడా కస్టమర్లు వీటికి జై కొడుతున్నారని మారుతీ మాజీ సేల్స్, మార్కెటింగ్ హెడ్ అభిప్రాయపడ్డారు. ‘ఎస్‌యూవీల సీటింగ్ పొజిషన్ ఎత్తు గా ఉండటం వల్ల కేబిన్ నుండి రోడ్డు వ్యూ బాగుంటుంది. అంతేకాకుండా, అధిక గ్రౌండ్ క్లియరెన్స్ వల్ల మన దగ్గరు న్న గతుకుల రోడ్లపై డ్రైవింగ్‌కు చాలా అనుకూలంగా ఉంటుంది. అందుకే వీటికి మంచి ఆదరణ లభిస్తోంది’ అని చెప్పారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
స్కోడా కాంపాక్ట్ ఎస్యూవీ వస్తోంది..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ స్కోడా ఆటో ఇండియా సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీని భారత్‌లో ప్రవేశపెట్టనున్నట్టు ప్రకటించింది. 2025 తొలి అర్ద భాగంలో ఈ కారు రోడ్లపై పరుగు తీయనుందని వెల్లడించింది. కంపెనీ నుంచి భారత మార్కెట్ కోసం ప్రత్యేకించి తయారైన మూడవ మోడల్‌గా ఇది నిలవనుంది. కుషాక్, స్లావియా మాదిరిగా ఎంక్యూబీ–ఏ0–ఇన్ ప్లాట్‌ఫామ్‌పై ఇది రూపుదిద్దుకోనుంది. పొడవు నాలుగు మీటర్ల లోపు ఉంటుంది. సంస్థకు ఇది ఎంట్రీ లెవెల్ మోడల్‌గా ఉండనుంది. 2022, 2023లో మొత్తం 1,00,000 పైచిలుకు కార్లను స్కోడా ఆటో ఇండియా విక్రయించింది. అన్ని మోడళ్లతో కలిపి 2026 నాటికి ఏటా 1,00,000 యూనిట్ల అమ్మకం లక్ష్యంగా చేసుకున్నట్టు సంస్థ వెల్లడించింది. ప్రతి పాదిత కొత్త మోడల్‌కు పేరును సూచించేందుకు కంటెస్ట్‌లో పాల్గొనవచ్చని కంపెనీ ప్రకటించింది. ఈ ఏడాదే భారత్‌కు స్కోడా ఎన్యాక్ ఈవీ ఎలక్ట్రిక్ ఎస్యూవీ అయిన స్కోడా ఎన్యాక్ ఈ ఏడాదే భారత్‌లో అడుగుపెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ మోడల్ పనితీరుపై దేశీయంగా టెస్టింగ్ జరుగుతోంది. ‘ఈ–మొబిలిటీ విషయంలో కంపెనీకి లోతైన అనుభవం ఉంది. వచ్చే మూడేళ్లలో ఆరు మోడళ్లకు విస్తరిస్తాం. ఇందులో ఒక మోడల్ ప్రత్యేకంగా భారత్‌కు తీసుకువస్తాం’ అని స్కోడా ఆటో ఇండియా బ్రాండ్ డైరెక్టర్ పీటర్ జనీబా తెలిపారు. 2027 నుంచి దేశీయంగా ఈవీలను అసెంబుల్ చేస్తామని వెల్లడించారు. -
రెనాల్ట్ కైగర్ కొత్త వేరియంట్ వచ్చేసింది.. ఆర్ఎక్స్జెడ్ వెర్షన్‌పై భారీ తగ్గింపు
సాక్షి, ముంబై: ప్రముఖ వాహన సంస్త రెనాల్ట్ కైగర్ కాంపాక్ట్ ఎస్ యూవీనికొత్త వేరియంట్‌ను తీసుకొచ్చింది. రెనాల్ట్ XT (O) MT వేరియంట్ ధరను 7.99 (ఎక్స్ షోరూం) లక్షలుగా నిర్ణయించింది. రెనాల్ట్ కైగర్ ఎక్స్‌టీ(ఓ) ఎ ంటీ ఇంజీన్, ఫీచర్లు 1.0 టర్బో పెట్రోల్ ఇంజన్ 99bhp, 152Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాదు రెనాల్ట్ కైగర్ గ్లోబల్ ఎన్‌సిఎపి ద్వారా అడల్ట్ ఆక్యుపెంట్ సేఫ్టీకి 4-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను కూడా అందుకుంది, డ్రైవర్ ఫ్రంట్ ప్యాసింజర్ భద్రత కోసం, నాలుగు ఎయిర్‌బ్యాగ్‌లు, ప్రీ-టెన్షనర్లతో కూడిన సీట్‌బెల్ట్‌లు, స్పీడ్ అండ్ క్రాష్-సెన్సింగ్ డోర్ లాక్‌లు , ISOFIX చైల్డ్ సీట్ యాంకర్ లాంటివి ఇతర ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. (IBM To Freeze Hiring: వేలాది ఉద్యోగాలకు ఏఐ ముప్పు: ఐబీఎం షాకింగ్ న్యూస్) వైర్లెస్ కనెక్టివిటీతో కూడిన 8-అంగుళాల టచ్‌స్క్రీన్, ఎన్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, అల్లాయ్ వీల్స్ , హై సెంటర్ కన్సోల్ వంటి ఫీచర్లున్నాయి.ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ స్టార్ట్ అసిస్ట్ (HSA), ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ (TCS) టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) వంటి వినూత్న ఫీచర్లను అందిస్తోంది. (మెట్‌గాలా 2023: ప్రియాంక చోప్రా నెక్లెస్ ధర తెలిస్తే షాకవుతారు!) రెనాల్ట్ ఆర్ఎక్స్ జెడ్‌పై డిస్కౌంట్ కొత్త వేరియంట్ లాంచ్‌తో పాటు, Renault RXZ ట్రిమ్‌పై డిస్కౌంట్లను అందిస్తోంది. ఆర్ఎక్స్జెడ్ వెర్షన్ కొనుగోలపై రూ. 10వేల నగదు, రూ. 20వేల ఎక్స్ఛేంజ్ ఆఫర్, రూ. 12వేల వరకు కార్పొరేట్ బెనిఫిట్స్‌తోపాటు రూ. 49వేల లాయల్టీ ప్రయోజనాలు లాంటి ఆఫర్లను కూడా ప్రకటించింది ఇదీ చదవండి: దుర్భర జైలు జీవితం, భార్యతో విడాకులు.. అయినా వేల కోట్ల కంపెనీ! -
ఎంజీ స్మార్ట్ కాంపాక్ట్ కామెట్ ప్రొడక్షన్ షురూ, లాంచింగ్ సూన్!
సాక్షి, ముంబై: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ఎంజీ మోటార్ ఇండియా స్మార్ట్ కాంపాక్ట్ ఈవీని ‘కామెట్’ ఉత్పత్తిని ప్రారంభించింది. గుజరాత్‌లోని తన హలోల్ ప్లాంట్ నుండి తొలి ఈవీని ప్రదర్శించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందిన జీస్ఈవీ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా, సాలిడ్ స్టీల్ ఛాసిస్‌పై నిర్మించిన 'హై స్ట్రెంగ్త్ వెహికల్ బాడీ'తో రానుంది. తమ కాంపాక్ట్ కామెట్ దేశీయ పోర్ట్‌ఫోలియోలో అతి చిన్న వాహనమని, మార్కెట్లో విక్రయించే అతి చిన్న ఆల్-ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనం కూడా అవుతుందని కంపెనీ భావిస్తోంది ఏప్రిల్ 19న ఇండియాలో దీన్ని ఆవిష్కరించనుంది. కామెట్ ఈవీ ధరలను రాబోయే రెండు నెలల్లో ప్రకటించవచ్చని భావిస్తున్నారు. అయితే 17.3 kWh బ్యాటరీ ప్యాక్‌తో రానున్న ఎంజీ కామెట్ ధర దాదాపు రూ. 10 లక్షల నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఫన్-టు-డ్రైవ్ ఎలిమెంట్స్‌తో అర్బన్ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కాంపాక్ట్ స్మార్ట్ ఈవీ కామెట్‌ను లాంచ్ చేయనున్నామని మోటార్ ఇండియా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ బిజు బాలేంద్రన్ వెల్లడించారు.ఇటీవలి నీల్సన్ నిర్వహించిన అర్బన్ మొబిలిటీ హ్యాపీనెస్ సర్వే ప్రకారం పట్టణ ప్రాంతాల్లో ఈవీలకు ప్రాధాన్యత లభిస్తుందన్నారు. కామెట్ ఇంటర్నెట్ ఆఫ్ వెహికల్స్ (IoV), మల్టీమీడియా, కనెక్టెడ్ ఫీచర్లతో సహా GSEV ప్లాట్‌ఫారమ్‌ను పూర్తి చేసే వివిధ స్మార్ట్ ఫీచర్లున్నాయని కంపెనీ తెలిపింది. కాగా లాంచింగ్‌కుముందు కంపెనీ విడుదల టీజర్ ప్రకారం డ్యూయల్ 10.25-ఇంచ్ డిజిటల్ స్క్రీన్, స్టీరింగ్ వీల్ డిజైన్‌తో పాటు డాష్‌బోర్డ్, స్టీరింగ్ రెండు వైపులా మౌంటెడ్ రెండు-స్పోక్ డిజైన్స్, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, క్యాబిన్లో బాక్సీ డిజైన్ ఎల్ఈడీహెడ్లైట్లు ,టెయిల్ లైట్లు, యాంబియంట్ లైటింగ్ మొదలైని ఇతర ఫీచర్లుగాఉండనున్నాయి. అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కార్లలో ఒకటిగానూ, అలాగే టియాగో ఈవీ, CitroeneC3 కంటే చిన్నదిగా ఉండనుందని అంచనా. -
టాటా, హ్యుందాయ్‌కి పోటీ: మారుతి సుజుకి కాంపాక్ట్ ఎస్యూవీ ఫ్రాంక్స్
న్యూఢిల్లీ: ఆటో ఎక్స్పో 2023లో రెండో రోజు దేశీయ ఆటో దిగ్గజం మారుతి సుజుకి కాంపాక్ట్ ఎస్‌యూవీని లాంచ్ చేసింది. కాంపాక్ట్ ఎస్‌యూవీలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఫ్రాంక్స్ కాంపాక్ట్ ఎస్యూవీ, మారుతి సుజుకి జిమ్నీ (5డోర్)ను ఆవిష్కరించింది. వీటి బుకింగ్‌లను కూడా షురూ చేసింది కంపెనీ. కస్టమర్లకు అధునాతన ఫీచర్లు, ఇంజన్ ఎంపికలతో స్పోర్టీ అండ్ స్టైలిష్ వాహనాలను అందించాలని లక్ష్యంతో మారుతి సుజుకి వీటిని లాంచ్ చేసింది. ఇది టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూకి గట్టి పోటీ ఇవ్వనుంది. స్పోర్టీ అండ్ స్టైలిష్ డిజైన్‌తో మారుతి సుజుకి ఫ్రాంక్స్ రెండు ఇంజన్ ఎంపికలతో ఇది లాంచ్ అయింది. 99 హార్స్పవర్, 147 Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే 1.0 లీటర్ బూస్టర్‌జెట్ ఇంజన్, 89 హార్స్పవర్, 113 Nm టార్క్ ఉత్పత్తి చేసే 1.2 లీటర్ డ్యూయల్ జెట్ పెట్రోల్ ఇంజన్ ఎంపికలలో ఇది లభ్యం.కారు ఫ్రంట్ ఎండ్ ఇటీవల విడుదల చేసిన గ్రాండ్ విటారా, బాలెనో మోడల్‌లు పోలి వుంది. కూపే లాంటి C-పిల్లర్‌ను LED స్ట్రిప్ , సిగ్నేచర్ LED బ్లాక్ టెయిల్ లైట్లను జోడించింది. కొత్త మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్లెస్ ఛార్జర్, ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్, హెడ్స్-అప్ డిస్ప్లే, 360-డిగ్రీ కెమెరా, క్రూయిజ్ కంట్రోల్,ఆరు ఎయిర్బ్యాగ్లఇతర ఫీచర్లు. అలాగే 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ , ఏఎంటీమూడు ట్రాన్స్మిషన్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంటుంది. 1.2-లీటర్ ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ 5 స్పీడ్ ఆటో ట్రాన్స్మిషన్ తో వస్తోంది. బూస్టర్ జెట్ ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ ఆటో మేటిక్ ట్రాన్స్మిషన్ తో వస్తోంది. -
ఎట్టకేలకు ‘సిట్రోయెన్ సీ3’ లాంచ్, ధర, ఫీచర్ల వివరాలివిగో!
సాక్షి, ముంబై: ఫ్రెంచ్ కార్ మేకర్ సిట్రోయెన్ సీ 3 కార్లను ఎట్టకేలకు భారత మార్కెట్లో లాంచ్ చేసింది. కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మంట్లో వీటిని సరికొత్తగా తీసుకొచ్చింది. ఈ కార్ ధరను రూ. 5.70 లక్షల (ఎక్స్-షోరూమ్, పరిచయ ధర) గా కంపెనీ నిర్ణయించింది. భారతీయ మార్కెట్లో సిట్రోయెన్ హౌస్ నుండి వచ్చిన తొలి చిన్న ఎస్యూవీ ఇది. మొత్తం ఆరు వేరియంట్లలో, పది రంగుల్లో సిట్రోయెన్ సీ3 లభిస్తుంది. ఈ ఫైవ్ సీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీని పూర్తిగా ఇండియా కస్టమర్లకోసం లాంచ్ చేయడం విశేషం. ఇంజన్, ఫీచర్లు రెండు ఇంజిన్ ఆప్షన్స్‌లో లభ్యం. 5 స్పీడ్ మాన్యువల్, 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ 5,750 ఆర్పీఎం వద్ద 81 బీహెచ్పీ, 115 టార్క్‌ను అందిస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ మోటార్ 5,750 ఆర్పీఎం వద్ద, 108 బీహెచ్పీని, 1150 ఆర్పీఎం వద్ద 190 ఎన్ఎం టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఫంకీ డిజైన్, V-ఆకారంలో LED డేటైమ్ రన్నింగ్ లైట్లు, హెడ్‌ల్యాంప్స్ అమర్చింది. డ్యూయల్-టోన్ ఎక్ట్సీరియర్, చుట్టూ బ్లాక్ ప్లాస్టిక్ క్లాడింగ్, డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్‌తో సిట్రోయెన్ సీ3 ముస్తాబైంది. డ్యూయల్-టోన్ డాష్ బోర్డ్ 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే కనెక్టివిటీ,డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇంటీరియర్ ఫీచర్లుగా ఉన్నాయి. సిట్రోయెన్ సీ3 ధరలు లైవ్: రూ. 5,70,500 ఫీల్: రూ. 6,62,500 ఫీల్ వైబ్ ప్యాక్: రూ. 6,77,500 ఫీల్ డ్యూయల్ టోన్: రూ. 6,77,500 ఫీల్ డ్యూయల్ టోన్ వైబ్ ప్యాక్: రూ. 6,92,500 టర్బో ఫీల్ డ్యూయల్ టోన్ వైబ్ ప్యాక్: రూ. 8,05,500 దేశవ్యాప్తంగా ఉన్న అన్ని లా మైసన్ సిట్రోయెన్ ఫిజిటల్ షోరూమ్‌లలో వినియోగదారులకు కొత్త సీ3 డెలివరీలు నేటి (జూలై 20) నుండి ప్రారంభం. ఢిల్లీ, గుర్గావ్, ముంబై, పూణే, అహ్మదాబాద్, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, కొచ్చి, చెన్నై, చండీగఢ్, జైపూర్, లక్నో, భువనేశ్వర్ వంటి 19 నగరాల్లోని లా మైసన్ సిట్రోయెన్ ఫైజిటల్ షోరూమ్‌లలో కొత్త సిట్రోయెన్ సీ3 రిటైల్‌గా అందుబాటులో ఉంది. -
ఎస్‌యూవీలు.. తగ్గేదేలే!
గత కొన్నేళ్లుగా దేశీ ఆటో రంగంలో సరికొత్త ట్రెండ్ కనిపిస్తోంది. కార్ల విభాగంలో కాంపాక్ట్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్(ఎస్‌యూవీలు) అమ్మకాలు యమ స్పీడ్‌గా వృద్ధి చెందుతున్నాయి. వెరసి అత్యధిక శాతం కస్టమర్లు ఆసక్తి చూపే చిన్న ప్రీమియం కార్ల విక్రయాలను ఇవి వెనక్కి నెడుతున్నాయి. వెరసి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి 11 నెలల్లో మొత్తం అమ్మకాలలో చిన్న ఎస్‌యూవీల వాటా 22 శాతానికి ఎగసింది. ఇదే సమయంలో హ్యాచ్‌బ్యాక్ కార్ల వాటా 19 శాతంగా నమోదైంది. ఇతర వివరాలు చూద్దాం... దేశీయంగా ప్రయాణికుల(ప్యాసింజర్) వాహనాల విభాగంలో ఇటీవల కొన్నేళ్లుగా ఎస్‌యూవీలు యమ స్పీడును ప్రదర్శిస్తున్నాయి. అమ్మకాలలో ప్రీమియం చిన్న కార్లను దాటి వేగంగా పరుగెడుతున్నాయి. ఫలితంగా ఈ ఏడాది తొలి 11 నెలల్లో వీటి వాటా 22 శాతానికి చేరింది. వెరసి ఎప్పటినుంచో అమ్మకాలలో మార్కెట్ లీడర్లుగా నిలుస్తున్న హ్యాచ్‌బ్యాక్ కార్ల అమ్మకాలను వెనక్కి నెట్టాయి. ఏప్రిల్–ఫిబ్రవరిలో వీటి వాటా 19%కి పరిమితంకావడమే ఇందుకు నిదర్శనం. ఈ బాటలో దేశీయంగా విక్రయమవుతున్న ప్రతీ రెండు కార్లలో నూ ఒకటి ఎస్‌యూవీయే ఉంటున్నట్లు ఆటో రంగ నిపుణులు పేర్కొన్నారు. వెరసి మార్చితో ముగియనున్న ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడవుతున్న విభాగంగా ఎంట్రీలెవెల్ ఎస్‌యూవీలు నిలవనున్నట్లు తెలియజేశారు! వివిధ మోడళ్ల ఎఫెక్ట్ కొన్నేళ్లుగా రూ. 10 లక్షల ధరలలోపు కొత్త యూఎస్వీ మోడళ్లు మార్కెట్లను ముంచెత్తుతున్నాయి. వీటికి సులభమైన ఫైనాన్స్ సౌకర్యాలు జత కలుస్తున్నాయి. మరోపక్క సరఫరా సమస్యలతో హ్యాచ్‌బ్యాక్ మోడళ్ల తయారీ నీరసించడం ఎస్‌యూవీలకు డిమాండును పెంచుతోంది. పరి శ్రమ వర్గాల అంచనాల ప్రకారం మారుతీ సుజుకీ బ్రెజ్జా, టాటా నెక్సాన్, పంచ్, రేనాల్ట్ కైగర్, హ్యుందాయ్ వెన్యూ మోడళ్లు ఉమ్మడిగా తొలి 11 నెలల్లో 6,00,000 వరకూ విక్రయమయ్యాయి. ఇదే కాలంలో వివిధ కంపెనీల హ్యాచ్‌బ్యాక్ మోడళ్లు 5,40,000 అమ్ముడైనట్లు అంచనా. ప్రారంభ శ్రేణి ఎస్‌యూవీల స్పీడుకు ప్రధానంగా మూడు కారణాలున్నట్లు మారుతీ సుజుకీ సీనియర్ అధికారి శశాంక్ శ్రీవాస్తవ చెబుతున్నారు. పలు కొత్త మోడళ్లు విడుదలకావడం, అధిక గ్రౌండ్ క్లియరెన్స్, ప్రీమియం హ్యాచ్‌బ్యాక్, కాంపాక్ట్ సెడాన్ ధరలతో పోలిక వంటి అంశాలను ప్రస్తావించారు. కాంపాక్ట్ ఎస్యూవీ విభాగంలో బ్రెజ్జా అత్యధికంగా విక్రయమవుతున్న మోడల్‌గా పేర్కొన్నారు. జాబితాలో కంపెనీలు.. హ్యుందాయ్ మోటార్ ఇండియా అమ్మకాలలో సగం వాటా ఎస్యూవీలదేకాగా.. టాటా మోటా ర్స్, మహీంద్రా అండ్ మహీంద్రా , జీప్, కియా, ఎంజీ మోటార్స్, నిస్సాన్ ఎస్‌యూవీలను రూపొందించడంలో ముందుంటున్నాయి. గత మూడు, నాలుగేళ్లలోనే 12 రకాల కొత్త యూఎస్‌వీలు మార్కెట్లలోకి ప్రవేశించాయి. మొత్తం ఎస్‌యూవీల మార్కెట్లో ఎంట్రీలెవెల్ ఎస్‌యూవీల వాటా 60 శాతంకావడం గమనించదగ్గ అంశం! -
కియా కా కమాల్... రికార్డు సృష్టిస్తోన్న ఆ మోడల్ కారు అమ్మకాలు
Kia Sub Compact SUV Car Sonet Sales: అతి తక్కువ కాలంలోనే ఆటోమొబైల్ మార్కెట్‌పై చెదరని ముద్ర వేసిన కియా.. తన ప్రయాణంలో మరో మైలురాయిని అందుకుంది. ఆ కంపెనీ నుంచి వస్తున్న ప్యాసింజర్ వెహికల్స్ ఒకదాని వెంట ఒకటిగా అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్నాయి. ఏడాదిలోనే కియా కంపెనీ కార్లు ఇండియన్ రోడ్లపై రివ్వుమని దూసుకుపోతున్నాయి. ఇప్పటికే కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో సెల్టోస్ అమ్మకాలు అదుర్స్ అనే విధంగా ఉండగా ఇప్పుడు సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లోనూ అవే ఫలితాలు రిపీట్ అవుతున్నాయి. గతేడాది సెప్టెంబరులో మార్కెట్లోకి వచ్చిన కియా సోనెట్ అమ్మకాల్లో అప్పుడే లక్ష మార్కును అధిగమించింది. ఈ మోడల్ రిలీజైన ఏడాదిలోగానే లక్షకు పైగా అమ్మకాలు జరుపుకుని రికార్డు సృష్టించింది. గడ్డు పరిస్థితులను ఎదుర్కొని వాస్తవానికి కరోనా ఫస్ట్ వేవ్ ముగిసన తర్వాత ఆటోమైబైల్ రంగం తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంది. మార్కెట్ ఇంకా గాడిన పడకముందే 2020 సెప్టెంబరు 20న సొనెట్ మోడల్ని మార్కెట్లోకి తెచ్చింది కియా. ఆ కంపెనీ అంచనాలను సైతం తారు మారు చేస్తూ 12 నెలల వ్యవధిలోనే లక్ష కార్లు అమ్ముడయ్యాయి. కియా అమ్మకాల్లో ఒక్క సోనెట్ వాటానే 32 శాతానికి చేరుకుందని ఆ కంపెనీ మార్కెటింగ్ అండ్ సేల్స్ చీఫ్ , ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టియో జిన్ పార్క్ తెలిపారు. టెక్నాలజీ అండతో.. సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో మారుతి బ్రెజా, హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్, మహీంద్రా ఎక్స్‌యూవీ 300 వంటి ప్యాసింజర్ వెహికల్స్ నుంచి పోటీని తట్టుకుంటూ కియో సోనెట్ భారీగా అమ్మకాలు సాధించడం వెనుక టెక్నాలజీనే ప్రముఖ పాత్ర పోషించినట్టు మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఈ సెగ్మెంట్లో టెక్నాలజీలో సోనెట్ మెరుగ్గా ఉన్నట్టు చెబుతున్నారు. ఎలక్ట్రానిక్ స్టెబులిటీ కంట్రోల్ (ఈఎస్సీ), వెహికల్ స్టెబులిటీ మేనేజ్మెంట్ (వీఎస్ఎమ్), బ్రేక్ అసిస్ట్ (బీఏ), హిల్ అసిస్ట్ కంట్రోల్ (హెచ్ఏసీ), పెడల్ షిప్టర్స్, వాయిస్ కమాండ్ ఆపరేటెడ్ సన్ రూఫ్ తదితర ఫీచర్లు ఈ కారుకు అదనపు ఆకర్షణగా నిలుస్తున్నాయి. ప్రారంభ ధర రూ. 6.79 లక్షలు కియా సోనెట్‌లో 1.5 లీటర్ డీజిల్ ఇంజన్‌తో వస్తోంది. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్లు అందిస్తోంది. ఈ కారు ప్రారంభం ధర రూ. 6.79 లక్షల నుంచి గరిష్టంగా రూ. 8.75 లక్షలు(షోరూమ్)గా ఉంది. గత సెప్టెంబరులో తొలి మోడల్ రిలీజ్ అవగా ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ 2021 మేలో మార్కెట్లోకి వచ్చింది. మొత్తంగా 17 రంగుల్లో ఈ కారు లభిస్తోంది. చదవండి: సెడాన్ అమ్మకాల్లో ఆ కారుదే అగ్రస్థానం -
జేఎల్ఆర్ కొత్త కాంపాక్ట్ లగ్జరీ ఎస్యూవీ
దేశీ ప్రముఖ వాహన తయారీ కంపెనీ టాటా మోటార్స్ అనుబంధ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) లేటెస్ట్ మోడల్ కాంపాక్ట్ లగ్జరీ ఎస్‌యూవీని విడుదల చేసింది. డిజైన్, రూపకల్పన, నిర్మాణం మొత్తం పూర్తిగా లండన్ యూనిట్లో తయారు చేసినట్టు తెలిపింది. బేబీ రేంజ్‌రోవర్‌గా పిలుస్తున్న ఈ కొత్త ఎస్యూవీ హల్లో రేంజ్ రోవర్ ఎవోక్‌ని లండన్ మార్కెట్లో ప్రవేశపెట్టింది. టెక్నాలజీ విప్లవంగా అభివర్ణించిన కొత్త మోడల్ ధర 41వేల డాలర్ల (సుమారు 29లక్షల రూపాయలు) ధరకు లభిస్తుంది, వచ్చే ఏడాది రోడ్లపై రానుందని కంపెనీ వెల్లడించింది. బిలియన్ పౌండ్ల పెట్టుబడులతో, యుకె ఉత్పత్తిపట్ల తమ నిబద్ధత స్థిరంగా ఉందని జెఎల్ఆర్ సీఈవో రాల్ఫ్ స్పెత్ వెల్లడించారు. తమ నూతన వాహనం రేంజ్ రోవర్ ఎవోక్యూ ప్రీ ఆర్డర్లను ఈవారం ప్రారంభించినట్టు జేఎల్ఆర్ తెలిపింది. అమెరికా, యూకే, యూరప్ వినియోగదారులకు 2019 ప్రారంభంలో మొదటి డెలివరీ ఉంటుందని వెల్లడించింది 2020 నుండి, ప్రతి కొత్త జాగ్వార్, ల్యాండ్ రోవర్లలో ఎలెక్ట్రిక్ వెర్షన్లను ప్రారంభిస్తామని తెలిపింది. కాంపాక్ట్ లగ్జరీ ఎస్యూవీ సెగ్మెంట్లో మొదటిదైన రేంజ్ రోవర్ ఎవోక్ వాహనాలను 48-వోల్ట్ మిల్డ్ హైబ్రిడ్ సిస్టమ్‌తో ప్రారంభిస్తామని పేర్కొంది. -
మార్కెట్లోకి హ్యుందాయ్ క్రెటా ఏటీ వేరియంట్
న్యూఢిల్లీ: ప్రముఖ వాహన కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా తన కాంపాక్ట్ ఎస్యూవీ ‘క్రెటా’లో కొత్తగా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ పెట్రోల్ ఆప్షన్ వేరియంట్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.12.87 లక్షలు (ఎక్స్ షోరూమ్ ఢిల్లీ). ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, రియర్ పార్కింగ్ కెమెరా, సెన్సార్స్, స్మార్ట్కీ వంటి తదితర ప్రత్యేకతలు ఉన్నట్లు కంపెనీ తెలిపింది. కాగా హ్యుందాయ్ ఇప్పటికే డీజిల్ ఆప్షన్లో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వేరియంట్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ.14.5 లక్షలుగా (ఎక్స్ షోరూమ్ ఢిల్లీ) ఉంది. కంపెనీ అలాగే అన్ని క్రెటా వేరియంట్లలోనూ డ్యూయెల్ ఎయిర్ బ్యాగ్స్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. -
మహీంద్రా నుంచి ‘నువోస్పోర్ట్’
ముంబై: దిగ్గజ వాహన కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా తాజాగా కాంపాక్ట్ ఎస్యూవీ ‘నువోస్పోర్ట్’ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ.7.35 లక్షలు-రూ.9.76 లక్షల శ్రేణిలో (ఎక్స్‌షోరూమ్ థానే) ఉంది. ఇది ఎన్4, ఎన్6, ఎన్8 అనే వేరియంట్లలోనూ, ఎన్4 ప్లస్, ఎన్6 ఏఎంటీ (ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్), ఎన్8 ఏఎంటీ అనే సబ్ వేరియంట్లలోనూ అందుబాటులో ఉండనున్నది. ఎరుపు, తెలుపు, నలుపు, ఆరంజ్, బ్లూ, సిల్వర్ అనే ఆరు రంగుల్లో లభ్యంకానున్న ‘నువోస్పోర్ట్’లో 1.5 లీటర్ డీజిల్ 3 సిలిండర్ ఎంహక్80 ఇంజిన్, 5 స్పీడ్ ట్రాన్స్మిషన్, ఆకట్టుకునే డిజైన్, రివర్స్ పార్కింగ్ కెమెరా, ఏవీఎన్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 7 సీటర్, అలాయ్ వీల్స్, ఏబీఎస్ వంటి తదితర ప్రత్యేకతలు ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. ఇది లీటరుకు 17.45 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తుందని తెలిపింది. -
మారుతీ ‘విటారా బ్రెజా’ వచ్చింది...
ధర రూ.6.99 లక్షలు-రూ.9.68 లక్షలు ముంబై: దేశీ దిగ్గజ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ ఇండియా తాజాగా కాంపాక్ట్ ఎస్యూవీ ‘విటారా బ్రెజా’ను మంగళవారం మార్కెట్లో ఆవిష్కరించింది. దీని ప్రారంభ ధర శ్రేణి రూ.6.99 లక్షలు-రూ.9.68 లక్షలుగా (ఎక్స్ షోరూమ్ ఢిల్లీ) ఉంది.కేవలం డీజిల్ ఇంజిన్ (1.3 లీటర్ ఇంజిన్ సామర్థ్యం) ఆప్షన్లో మాత్రమే లభ్యంకానున్న బ్రెజా మోడల్లో ఎల్డీఐ, ఎల్డీఐ (ఓ), వీడీఐ, వీడీఐ (ఓ), జెడ్‌డీఐ, జెడ్‌డీఐ ప్లస్, జెడ్‌డీఐ ప్లస్ డ్యూయెల్ టన్ అనే వేరియంట్లు ఉన్నాయని కంపెనీ తెలిపింది. బ్రెజా మోడల్ లీటరుకు 24.3 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తుందని పేర్కొంది. బ్రెజా బుకింగ్స్ మంగళవారం నుంచి ప్రారంభమైనట్లు తెలిపింది. డెలివరీ ఈ నెల చివరి నుంచి ఉంటుందని పేర్కొంది. కాగా విటారా బ్రెజా మోడల్ అభివృద్ధికి కంపెనీ రూ. 860 కోట్ల వరకు ఖర్చు చేసింది. ఇది ముఖ్యంగా ఫోర్డ్ ఎకోస్పోర్ట్, మహీంద్రా టీయూవీ 300కు పోటీనిస్తుందనేది విశ్లేషకుల అభిప్రాయం. -
మహీంద్రా నుంచి మరో రెండు మోడళ్లు
పెట్రోల్ వెర్షన్లలో ప్రస్తుత మోడళ్లు... హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో రెండు కొత్త మోడళ్లను ఆవిష్కరిస్తోంది. ఇందులో ఇప్పటికే ప్రకటించిన కాంపాక్ట్ ఎస్యూవీ అయిన కేయూవీ100తోపాటు వెరిటో ఎలక్ట్రిక్ ఉన్నాయి. వెరిటో ఎలక్ట్రిక్ ధర రూ.13 లక్షలుండొచ్చు. మార్చికల్లా ఇది రోడ్లపై పరుగెత్తే అవకాశం ఉంది. ఇక కేయూవీ100 ధర రూ.4-6 లక్షల మధ్య ఉంటుందని అంచనా. ఈ మోడల్‌ను జనవరి 15న విడుదల చేస్తున్నామని కంపెనీ సేల్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వీజయ్ రామ్ నక్రా గురువారం తెలిపారు. ప్రీమియం పిక్అప్ వాహనం ఇంపీరియోను హైదరాబాద్ మార్కెట్లో విడుదల చేసిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. కంపెనీకి కేయూవీ100 మొదటి పెట్రోల్ మోడల్ అవుతుందని చెప్పారు. దీనిని డీజిల్ వేరియంట్లోనూ తీసుకొస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం కంపెనీ విక్రయిస్తున్న కొన్ని మోడళ్లలో పెట్రోల్ వెర్షన్లను 2016లోనే ప్రవేశపెడతామని పేర్కొన్నారు.కాగా, అమ్మకాల పరంగా మహీంద్రాకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మార్కెట్ దేశంలో టాప్-2/3 స్థానంలో ఉంది. -
పెట్రోల్ సెగ్మెంట్లోకి మహీంద్రా..
- కాంపాక్ట్ ఎస్‌యూవీతో మార్కెట్లోకి... - వచ్చే నెల 15న కేయూవీ100 విడుదల ముంబై: డీజిల్ వాహనాలను అధికంగా తయారు చేసే మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ తాజాగా పెట్రోల్ ఎస్‌యూవీల సెగ్మెంట్లోకి ప్రవేశించింది. ఢిల్లీలో డీజిల్ వాహనాల రిజిస్ట్రేషన్‌పై ఇటీవల సుప్రీం కోర్డు నిషేధం విధించిన నేపధ్యంలో మహీంద్రా కంపెనీ పెట్రోల్ ఇంజిన్‌తో తయారైన తొలి కాంపాక్ట్ ఎస్యూవీ, కేయూవీ100ను మార్కెట్లోకి తేనున్నది. డీజిల్ ఇంజిన్‌తో కూడా ఈ ఎస్‌యూవీని అందుబాటులోకి తెస్తామని కంపెనీ తెలిపింది. వాణిజ్యపరంగా వచ్చే నెల 15న మార్కెట్లోకి తెస్తామని, అప్పుడే ధరలను కూడా నిర్ణయిస్తామని కంపెనీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ పవన్ గోయెంకా చెప్పారు. బ్రాండ్ అంబాసిడర్‌గా వరుణ్ ధావన్... ఈ కేయూవీ100 మంచి బ్రాండ్‌గా ఎదగగలదన్న ధీమాను గోయెంకా వ్యక్తం చేశారు. గత నాలుగేళ్లుగా ఈ మోడల్ అభివృద్ధి కోసం రూ.500 కోట్లు వెచ్చించామని తెలిపారు. ఎంఫాల్కన్ ఇంజిన్ ప్లాట్‌ఫామ్‌పై ఈ ఎస్‌యూవీలను పుణే సమీపంలోని చకన్ ప్లాంట్‌లో తయారు చేస్తున్నామని వివరించారు. ప్రస్తుతం 5 సీట్ల ఈ ఎస్‌యూవీకి సంబంధించి 18 పేటెంట్ల కోసం దరఖాస్తు చేశామని తెలిపారు. కేయూవీ100లో 8 వేరియంట్లు తేనున్నామని, అన్నింటిలోనూ ఏబీఎస్, ఎయిర్‌బ్యాగ్స్ వంటి భద్రతా ఫీచర్లున్నాయని తెలిపారు. నేటి (శనివారం) నుంచి బుకింగ్‌లు ప్రారంభించామని, గ్రూప్ గౌరవ చైర్మన్ కేశుబ్ మహీంద్రా బుక్ చేసుకున్నారని చెప్పారు. కేయూవీ100కు బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. -
మార్చికల్లా ఐ20 ఎలైట్ క్రాస్ఓవర్ కారు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా మార్చికల్లా ఐ20 ఎలైట్ క్రాస్ఓవర్ కారును మార్కెట్లోకి తేనుంది. ధర రూ.7-10 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. 1.2 లీటర్ పెట్రోల్, 1.4 లీటర్ డీజిల్ ఇంజిన్ సామర్థ్యంతో రెండు వేరియంట్లు రానున్నాయి. 2015 మూడో త్రైమాసికంలో కాంపాక్ట్ ఎస్‌యూవీని తీసుకొస్తున్నట్టు హ్యుందాయ్ మోటార్ ఇండియా సేల్స్, మార్కెటింగ్ చీఫ్ కోఆర్డినేటర్ యంగ్ జిన్ ఆన్ వెల్లడించారు. సికింద్రాబాద్ మెట్టుగూడలో సాబూ హ్యుందాయ్ షోరూంను సోమవారం ప్రారంభించిన అనంతరం ఆర్ఎస్ఎం తేజ అడుసుమల్లి చౌదరితో కలసి మీడియాతో మాట్లాడారు. ప్రతిపాదిత కాంపాక్ట్ ఎస్యూవీ పేరు ఆయన వెల్లడించనప్పటికీ.. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం విదేశాల్లో అందుబాటులో ఉన్న ఐఎక్స్25 మోడల్‌కు స్వల్ప మార్పులు చేసి ఇక్కడికి తెచ్చే అవకాశం ఉంది. 8-9 శాతం వృద్ధి..: హ్యుందాయ్ మార్కెట్ వాటా భారత్‌లో 16.45 శాతం ఉంది. అన్ని మోడళ్లకు మార్కెట్లో మంచి స్పందన ఉందని, కొత్త మోడళ్లు రానుండడంతో 2015లో కంపెనీ మార్కెట్ వాటా 17 శాతం దాటుతుందని యంగ్ జిన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ప్లాంటు వినియోగం 99.8 శాతం ఉంది. హ్యుందాయ్ మాత్రమే ఈ స్థాయిలో తయారీ చేపడుతోంది. విస్తరణకు సమయం ఆసన్నమైంది. దేశీయంగా అమ్మకాలు 4 లక్షల యూనిట్లకు చేరువలో ఉన్నాం. డిసెంబరుకల్లా 4.20 లక్షల యూనిట్లు నమోదు కావొచ్చు’ అని వెల్లడించారు. షోరూం ద్వారా నెలకు 200 వాహనాలను విక్రయిస్తామన్న అంచనాలు ఉన్నాయని సాబూ హ్యుందాయ్ డెరైక్టర్ ప్రశాంత్ సాబూ తెలిపారు. హెచ్ ప్రామిస్ పేరుతో నాచారంలో పాత వాహనాల విక్రయ షోరూంను ప్రారంభించామని చెప్పారు.