సాక్షి, ముంబై: ప్రముఖ వాహన సంస్త రెనాల్ట్ కైగర్ కాంపాక్ట్ ఎస్ యూవీనికొత్త వేరియంట్‌ను తీసుకొచ్చింది. రెనాల్ట్ XT (O) MT వేరియంట్ ధరను 7.99 (ఎక్స్ షోరూం) లక్షలుగా నిర్ణయించింది.
రెనాల్ట్ కైగర్ ఎక్స్‌టీ(ఓ) ఎ ంటీ ఇంజీన్, ఫీచర్లు
1.0 టర్బో పెట్రోల్ ఇంజన్ 99bhp, 152Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాదు రెనాల్ట్ కైగర్ గ్లోబల్ ఎన్‌సిఎపి ద్వారా అడల్ట్ ఆక్యుపెంట్ సేఫ్టీకి 4-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను కూడా అందుకుంది, డ్రైవర్ ఫ్రంట్ ప్యాసింజర్ భద్రత కోసం, నాలుగు ఎయిర్‌బ్యాగ్‌లు, ప్రీ-టెన్షనర్‌లతో కూడిన సీట్‌బెల్ట్‌లు, స్పీడ్ అండ్ క్రాష్-సెన్సింగ్ డోర్ లాక్‌లు , ISOFIX చైల్డ్ సీట్ యాంకర్ లాంటివి ఇతర ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. (IBM To Freeze Hiring: వేలాది ఉద్యోగాలకు ఏఐ ముప్పు: ఐబీఎం షాకింగ్ న్యూస్)
వైర్‌లెస్ కనెక్టివిటీతో కూడిన 8-అంగుళాల టచ్‌స్క్రీన్, ఎన్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, అల్లాయ్ వీల్స్ , హై సెంటర్ కన్సోల్ వంటి ఫీచర్లున్నాయి.ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ స్టార్ట్ అసిస్ట్ (HSA), ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ (TCS) టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) వంటి వినూత్న ఫీచర్లను అందిస్తోంది. (మెట్‌గాలా 2023: ప్రియాంక చోప్రా నెక్లెస్ ధర తెలిస్తే షాకవుతారు!)
రెనాల్ట్ ఆర్‌ఎక్స్ జెడ్‌పై డిస్కౌంట్
కొత్త వేరియంట్ లాంచ్‌తో పాటు, Renault RXZ ట్రిమ్‌పై డిస్కౌంట్లను అందిస్తోంది. ఆర్‌ఎక్స్‌జెడ్ వెర్షన్ కొనుగోలపై రూ. 10వేల నగదు, రూ. 20వేల ఎక్స్ఛేంజ్ ఆఫర్, రూ. 12వేల వరకు కార్పొరేట్ బెనిఫిట్స్‌తోపాటు రూ. 49వేల లాయల్టీ ప్రయోజనాలు లాంటి ఆఫర్‌లను కూడా ప్రకటించింది
ఇదీ చదవండి: దుర్భర జైలు జీవితం, భార్యతో విడాకులు.. అయినా వేల కోట్ల కంపెనీ!
Comments
Please login to add a commentAdd a comment