దేశీ ప్రముఖ వాహన తయారీ కంపెనీ టాటా మోటార్స్ అనుబంధ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) లేటెస్ట్ మోడల్ కాంపాక్ట్ లగ్జరీ ఎస్‌యూవీని విడుదల చేసింది. డిజైన్, రూపకల్పన, నిర్మాణం మొత్తం పూర్తిగా లండన్ యూనిట్‌లో తయారు చేసినట్టు తెలిపింది. బేబీ రేంజ్‌రోవర్‌గా పిలుస్తున్న ఈ కొత్త ఎస్‌యూవీ హల్లో రేంజ్ రోవర్ ఎవోక్‌ని లండన్ మార్కెట్లో ప్రవేశపెట్టింది.
టెక్నాలజీ విప్లవంగా అభివర్ణించిన కొత్త మోడల్ ధర 41వేల డాలర్ల (సుమారు 29లక్షల రూపాయలు) ధరకు లభిస్తుంది, వచ్చే ఏడాది రోడ్లపై రానుందని కంపెనీ వెల్లడించింది. బిలియన్ పౌండ్ల పెట్టుబడులతో, యుకె ఉత్పత్తిపట్ల తమ నిబద్ధత స్థిరంగా ఉందని జెఎల్‌ఆర్ సీఈవో రాల్ఫ్ స్పెత్ వెల్లడించారు. తమ నూతన వాహనం రేంజ్ రోవర్ ఎవోక్యూ ప్రీ ఆర్డర్లను ఈవారం ప్రారంభించినట్టు జేఎల్‌ఆర్ తెలిపింది. అమెరికా, యూకే, యూరప్ వినియోగదారులకు 2019 ప్రారంభంలో మొదటి డెలివరీ ఉంటుందని వెల్లడించింది
2020 నుండి, ప్రతి కొత్త జాగ్వార్, ల్యాండ్ రోవర్లలో ఎలెక్ట్రిక్ వెర్షన్లను ప్రారంభిస్తామని తెలిపింది. కాంపాక్ట్ లగ్జరీ ఎస్యూవీ సెగ్మెంట్లో మొదటిదైన రేంజ్ రోవర్ ఎవోక్ వాహనాలను 48-వోల్ట్ మిల్డ్ హైబ్రిడ్ సిస్టమ్‌తో ప్రారంభిస్తామని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment