స్కూల్కు లాంగ్ స్కర్ట్ వేసుకొచ్చిందని... | French Muslim girl banned from class for wearing long skirt | Sakshi
Sakshi News home page

స్కూల్కు లాంగ్ స్కర్ట్ వేసుకొచ్చిందని...

Published Wed, Apr 29 2015 8:36 AM | Last Updated on Tue, Oct 16 2018 5:58 PM

స్కూల్కు లాంగ్ స్కర్ట్ వేసుకొచ్చిందని... - Sakshi

స్కూల్కు లాంగ్ స్కర్ట్ వేసుకొచ్చిందని...

నిండుగా బట్టలు వేసుకుందనే కారణంతో తరగతులకు హాజరుకావొద్దని పాఠశాల అధికారులు ఓ బాలికను నిషేధించారు.

రైమ్స్: నిండుగా బట్టలు వేసుకుందనే కారణంతో తరగతులకు హాజరుకావొద్దని పాఠశాల అధికారులు ఓ బాలికను నిషేధించారు. రెండుసార్లు ఇలాగే జరగడంతో ఆ బాలిక చదువుకు దూరమై ఇంటివద్దే ఉండిపోవాల్సి వచ్చింది. లౌకక దేశమైన ఫ్రాన్స్ లోని పాఠశాలల్లో ఎలాంటి మతపరమైన అంశాలకు ప్రత్యేకతను ఇవ్వడం జరగదు . ఈ విషయంలో వారు నియమ నిబంధనలు కచ్చితంగా పాటిస్తారు.

15 ఏళ్ల ముస్లిం బాలిక వారి సంప్రదాయ ప్రకారం నిండుగా బట్టలు (బురఖా) దరించి తరగతులకు రెండు సార్లు హాజరయింది. దీంతో ఆమెను తమ క్లాస్ టీచర్ అడ్డుకుని అందరు వచ్చినట్లుగానే పాఠశాలకు రావాలని, మతపరమైన అంశానికి తావిచ్చే బురఖాలాంటివి వేసుకొని రాకుడదని చెప్పారు. తిరిగి సాధారణ దుస్తులతో రావాలని చెప్పింది. కానీ అందుకు ఒప్పుకోని తండ్రి  ఆ బాలికను పాఠశాలకు పంపించకుండా ఇంట్లోనే ఉంచాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement