
అలర్ట్‌గా ఉండడం, తదేకంగా పరిశీలించడం... ఇలాంటి సందర్భాలలో ఉపయోగించే ఎక్స్‌ప్రెషన్ కీ వీవ్.
ఉదా: యాన్ ఆర్మీ ఆన్ ది కీ వీవ్
‘కీ వీవ్’ అనేది ఫ్రెంచ్ ఎక్స్‌ప్రెషన్. ఆరోజుల్లో ఫ్రాన్సులో కోటలకు కాపల కాసే సైనికులు, దూరంగా ఎవరైనా అపరిచితులు కనిపిస్తే–‘కీ వీవ్’ (లాంగ్ లివ్ హూ?) అని గట్టిగా అరిచేవాళ్లు.
అప్పుడు అటునుంచి జవాబు...
‘లాంగ్ లివ్ ది కింగ్’ అని వినిపించాలి.
అలా కాకుండా, ఆ వ్యక్తి నీళ్లు నమిలినా, వేరే ఏదైనా జవాబు చెప్పినా...అతడిని అనుమానించి రకరకాలుగా ప్రశ్నించేవారు.
ఇది ఎలా సాధ్యం?
ఒక కాలువకు అటు వైపు యజమాని, ఇటు వైపు అతని శునకం జిమ్మీ ఉంది. ‘జిమ్మీ! ఇటు వచ్చేయ్’ అని అరిచాడు యజమాని. వెంటనే వచ్చేసింది జిమ్మీ. అయితే జిమ్మీ కొంచెం కూడా తడవలేదు. అలా అని అది వంతెన మీది నుంచి రాలేదు. పడవ ఎక్కి రాలేదు. తడవకుండా రావడం ఎలా సాధ్యమైంది?
జవాబు: ఆ కాలువ గడ్డకట్టి పోయింది!