ఫ్రెంచ్ ఫ్రైస్... మీరు చేయలేరా?! | French fries ... Can not you ?! | Sakshi
Sakshi News home page

ఫ్రెంచ్ ఫ్రైస్... మీరు చేయలేరా?!

Published Sun, Mar 20 2016 12:09 AM | Last Updated on Sun, Sep 3 2017 8:08 PM

ఫ్రెంచ్ ఫ్రైస్... మీరు చేయలేరా?!

ఫ్రెంచ్ ఫ్రైస్... మీరు చేయలేరా?!

సాయంత్రం పూట మంచి సినిమా చూస్తూ, ఫ్రెంచ్ ఫ్రైస్ తింటూ, కోక్ చప్పరిస్తుంటే వచ్చే మజాయే వేరు. కాకపోతే ఫ్రైస్ కావాలంటే రెస్టారెంటుకు ఆర్డరివ్వాలి. లేదంటే మనమే వెళ్లి తెచ్చుకోవాలి. ఏం మనం చేసుకోలేమా? చేసుకోవచ్చు. కానీ బంగాళాదుంపల్ని కట్ చేయడం తలచుకుంటే వాటిని తినాలన్న ఆశ చచ్చిపోతుంది. ఎందుకంటే అన్నిటినీ సమానంగా కట్ చేసుకోవడం అంత చిన్న విషయమేమీ కాదు. అలా కట్ చేయకపోతే ఫ్రెంచ్ ఫ్రైస్ బాగోవు.

అందుకే వాటిని చేసే ప్రయత్నాన్ని విరమించుకుంటారు అందరూ. ఆ ఇబ్బందిని తీర్చడానికి వచ్చిందే ఈ ‘ఫ్రెంచ్ ఫ్రై కట్టర్’. బంగాళాదుంపను చెక్కు తీసి, దీనిలో పెట్టి, స్టేప్లర్‌ని నొక్కినట్టు ఒక్క నొక్కు నొక్కితే చాలు... క్షణంలో క్షణంలో పొడవాటి ముక్కలు రెడీ. వీటిని నూనెలో డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. వెల కూడా పెద్ద ఎక్కువేమీ కాదు. రూ. 500 లోపే!

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement