deep fry
-
Kitchen Tips: ఇనుప బాణలి, కళాయి తుప్పు పడితే ఇలా చేయండి!
ఇనుప బాణలి, కళాయి, పెనం, ఇతర ఇనుముతో చేసిన కిచెన్ వస్తువులు తుప్పు పట్టి ఇబ్బంది పెడుతుంటాయి. తుప్పు పట్టిన ఇనుప బాణలిలో కొద్దిగా హార్పిక్ వేసి బాణలి అంతా రాసి గంటపాటు నానబెట్టాలి. తరువాత స్టీల్ పీచుతో గట్టిగా రుద్దిన తరవాత డిష్ వాష్ లిక్విడ్ కూడా వేసి మరోసారి మెత్తటి పీచుతో రుద్ది కడగాలి. ఇలా కడిగిన బాణలిని తడిలేకుండా తుడిచి, నూనె రాసి ఆరనివ్వాలి. ఇలా చేస్తే ఇనుప వస్తువులు తుప్పు రాకుండా వాడుకోవడానికి చక్కగా పనికొస్తాయి. ఇక పింగాణీ కప్పులకు, సాసర్లకు కాఫీ, టీ మరకలు పట్టి వదలనట్లయితే సోడాబైకార్బనేట్లో కొద్దిగా నీటిని కలిపి దానితో శుభ్రం చేయాలి. మరిన్ని టిప్స్ బంగాళదుంప ముక్కలను పదినిమిషాల పాటు మజ్జిగలో నానబెట్టి, తరువాత ఫ్రై చేస్తే ముక్కలు అతుక్కోకుండా పొడిపొడిగా వస్తాయి. అదే విధంగా... డీప్ ఫ్రై చేసేటప్పుడు నూనె పొంగకుండా ఉండాలంటే... కాగిన నూనెలో ముందుగా కొద్ది చింతపండు వేయాలి. తరువాత డీప్ ఫ్రై చేసుకుంటే నూనె పొంగదు. పులిహోర మరింత రుచిగా ఉండాలంటే చింతపండు పులుసులో పావు టీ స్పూన్ బెల్లం వేసి మరిగించాలి. పచ్చిమిర్చిముద్ద, అల్లం వెల్లుల్లి ముద్ద చేసిన తరవాత టీ స్పూన్ వేడి నూనె కలిపి నిల్వ చేస్తే ఎక్కువకాలం నిల్వ ఉంటుంది. చదవండి: Veduru Kanji- Health Benefits: వెదురు కంజి.. టేస్టు అదుర్స్.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు! -
Recipe: పనస గింజలతో వడలు.. ఇలా తయారు చేసుకోండి!
పనస గింజల వడల తయారీ విధానం తెలుసా? పనస గింజల వడల తయారీకి కావలసినవి: ►పనస గింజలు – ఒకటిన్నర కప్పులు (పైతొక్క తీసి, మెత్తగా ఉడికించుకుని, కొద్దిగా నీళ్లు పోసుకుని మిక్సీ పట్టుకోవాలి) ►ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు (చిన్నచిన్నగా తరగాలి) ►పచ్చిమిర్చి ముక్కలు – 1 టీ స్పూన్ (చిన్నగా తరిగినవి) ►కొత్తిమీర తురుము, కరివేపాకు తురుము – అర టేబుల్ స్పూన్ చొప్పున ►అల్లం పేస్ట్, మిరియాల పొడి, వాము – అర టీ స్పూన్ చొప్పున ►కారం, ఉప్పు – తగినంత, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా పనస గింజల వడల తయారీ విధానం ►ముందుగా ఒక బౌల్లో పనస గింజల గుజ్జు వేయాలి ►దానిలో.. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కారం, ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. ►అందులో కొత్తిమీర తురుము, కరివేపాకు తురుము, అల్లం పేస్ట్, మిరియాల పొడి, వాము అన్నీ కలిపి బాగా ముద్దలా చేసుకోవాలి. ►అనంతరం ఆ మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండల్లా చేసుకుని.. వేళ్లతో గట్టిగా ఒత్తి, పలుచగా చేసుకుని, నూనెలో దోరగా వేయించుకోవాలి. ఇవి కూడా ట్రై చేయండి: Singori Sweet Recipe: కోవా... పంచదార.. పచ్చి కొబ్బరి.. నోరూరించే స్వీట్ తయారీ ఇలా! ఇవన్నీ కలిపి బోన్‌లెస్ చికెన్ ముక్కల్ని బొగ్గు మీద కాల్చి తింటే! మరిన్ని రెసిపీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
మాంసాహారం డీప్ ఫ్రై లేదా రోస్ట్ చేస్తే.. ‘హెటెరోసైక్లిక్ అరోమాటిక్ అమైన్స్’ వల్ల
చెడు వినకు, చూడకు, మాట్లాడకు అని నీతి చెప్పే మూడు కోతి బొమ్మలు అందరికీ తెలిసినవే. అలాంటి ముఖ్యమైన మూడు నీతి వాక్యాలే... క్యాన్సర్‌ను ‘‘వండుకోకండి, నిల్వ చేసుకోకండి, తినకండి’’ అనే మాటలు! ఇలా క్యాన్సర్‌ను వండటం, నిల్వచేయడం, తినడం ఎలా జరుగుతుందో చూద్దాం, దానికి దూరంగా ఉందాం. ప్రతి వ్యక్తీ బతికి ఉండటానికి ఆహారం తీసుకుంటాడు. ఇందుకోసం ప్రతి ఒక్కరూ ఆహారపదార్థాలను తినడం, వాటిని వండుకోవడం, నిల్వ చేసుకోవడం చేస్తుంటారు. అప్పుడు సరిగా వండుకోకపోయినా, నిల్వ చేసుకోకపోయినా, తినకపోయినా క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. వాటిని నివారించడానికి అనుసరించాల్సిన మార్గాలివే... ‘క్యాన్సర్ వంట పద్ధతులు’ వద్దు... ఓ పదార్థాన్ని వండుతున్నామంటే... దాన్ని క్యాన్సర్‌ను రాని రీతిలో వండటం ముఖ్యం. వంటలో మనం ఉడికించడం, వేయించడం, డీప్ ఫ్రై లేదా రోస్ట్ చేయడం లాంటి ప్రక్రియలను అనుసరిస్తుంటాం. వీటన్నింటిలోనూ ఉడికించడం అనేది క్యాన్సర్‌ను దూరంగా ఉంచే ఆరోగ్యకరమైన ప్రక్రియ. వేపుళ్లు, రోస్ట్ చేయడం అనారోగ్యకరమైన పద్ధతులు. ఉదాహరణకు మాంసాహారం లేదా కొన్ని శాకాహారాల్లో డీప్ ఫ్రైలు, రోస్ట్‌లు చేయడం క్యాన్సర్‌కు కారణం కావచ్చు. ఎందుకంటే... ఇలా డీప్ ఫ్రై లేదా రోస్ట్ చేసే సమయంలో ఆహార పదార్థాల్లోంచి ముఖ్యంగా మాంసాహారం నుంచి ‘హెటెరోసైక్లిక్ అరోమాటిక్ అమైన్స్’ (హెచ్ఏఏ) అనే క్యాన్సర్ కలిగించే హానికరమైన రసాయనాలు వెలువడవచ్చు. అందుకే ఎప్పుడో ఓసారి చాలా కొద్దిమోతాలో జిహ్వను సంతృప్తిపరచేందుకు తప్ప... అతిగా వేయించే వేపుళ్లు, రోస్ట్లకు వీలైనంత దూరంగా ఉండటమే మంచిది. క్యాన్సర్ల ‘నిల్వ’ వద్దు ... తినే పదార్థాలను నిల్వ చేసుకుని, అవసరం ఉన్నప్పుడల్లా వినియోగించుకోవడం అనాదిగా మనమంతా పాటిస్తున్న పద్ధతే. ఉదాహరణకు పచ్చళ్లు, బేకరీ పదార్థాలు, ఫాస్ట్‌ఫుడ్‌ను ఎక్కువగా నిల్వ చేస్తుంటారు. చాలాకాలం పాటు తినేపదార్థాలు నిల్వ ఉంచడం కోసం కొన్ని రసాయనాలు వాడుతుంటారు. వెన్న, నెయ్యి చాలాకాలం పాటు ఉంటే చెడిపోతాయి. అలాగే వాటితో చేసిన పదార్థాలూ చాలాకాలం నిల్వ ఉంటే పాడైపోతాయి. అందుకే ‘మార్జరిన్’ అనే పదార్థాన్ని నూనె, వెన్న, నెయ్యికి ప్రత్యామ్నాయం గా వాడుతుంటారు. కానీ మార్జరిన్ చెడు కొవ్వులను పెంచి మంచికొవ్వులను బాగా తగ్గిస్తుంది. అలాగే నిల్వ ఉంచేందుకు తోడ్పడే అనేక రసాయనాల్లో దేహానికి హానిచేసే పదార్థాలు ఉంటాయి. దాదాపు ఇవన్నీ క్యాన్సర్ ముప్పును పెంచుతాయి. ఇక మాంసాహారాన్ని చాలాకాలంపాటు నిల్వ ఉంచేందుకు ‘స్మోకింగ్’ అనే ప్రక్రియను అనుసరిస్తారు. ఇలా చేసేప్పుడు ‘పాలీ సైక్లిక్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్’ (పీఏహెచ్‌స్) అనే రసాయనాలు ఏర్పడతాయి. ఇవి కూడా క్యాన్సర్ కారకాలే. మనం పెట్టుకునే ఊరగాయల్ని ఏడాదంతా నిల్వ ఉంచడానికి ఎక్కువ మోతాదులో ఉప్పు వాడతారు. దాంతో కడుపు లోపలి పొరలు ఒరుసుకుపోవడం, అలాగే ఆ భాగాల్లో నైట్రేట్ల దుష్ప్రభావంతో క్యాన్సర్‌కు అవకాశాలెక్కువ. కడుపులోని యాసిడ్ అన్నింటినీ చంపేసినా ‘హెలికోబ్యాక్టర్ పైలోరీ’ అనే సూక్ష్మక్రిమిని మాత్రం చంపలేదు. ‘హెచ్. పైలోరీ’ వల్ల పొట్టక్యాన్సర్లు వచ్చే ముప్పు ఎక్కువ. అందుకే వంటచేయడం, నిల్వచేయడం, తినడం... ఈ మూడు పద్ధతుల్లోని ఆరోగ్యకరమైన మార్గాలు క్యాన్సర్ నివారణకు చాలా ముఖ్యమని తెలుసుకోవడం అందరికీ అవసరం. -డాక్టర్ సీహెచ్. మోహన వంశీ చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్, ఒమేగా హాస్పిటల్స్, హైదరాబాద్ Ph: 98480 11421, Kurnool 08518273001 చదవండి: Badam Health Benefits: రాత్రంతా నీళ్లలో నానబెట్టి బాదం పొట్టు తీసి తింటున్నారా? వేటమాంసం తిన్న తర్వాత వీటిని తిన్నారంటే.. Jeedipappu Health Benefits: జీడిపప్పును పచ్చిగా తింటున్నారా..! సంతానలేమితో బాధపడే వారు పిస్తాతో పాటు వీటిని తింటే.. -
ఫ్రెంచ్ ఫ్రైస్... మీరు చేయలేరా?!
సాయంత్రం పూట మంచి సినిమా చూస్తూ, ఫ్రెంచ్ ఫ్రైస్ తింటూ, కోక్ చప్పరిస్తుంటే వచ్చే మజాయే వేరు. కాకపోతే ఫ్రైస్ కావాలంటే రెస్టారెంటుకు ఆర్డరివ్వాలి. లేదంటే మనమే వెళ్లి తెచ్చుకోవాలి. ఏం మనం చేసుకోలేమా? చేసుకోవచ్చు. కానీ బంగాళాదుంపల్ని కట్ చేయడం తలచుకుంటే వాటిని తినాలన్న ఆశ చచ్చిపోతుంది. ఎందుకంటే అన్నిటినీ సమానంగా కట్ చేసుకోవడం అంత చిన్న విషయమేమీ కాదు. అలా కట్ చేయకపోతే ఫ్రెంచ్ ఫ్రైస్ బాగోవు. అందుకే వాటిని చేసే ప్రయత్నాన్ని విరమించుకుంటారు అందరూ. ఆ ఇబ్బందిని తీర్చడానికి వచ్చిందే ఈ ‘ఫ్రెంచ్ ఫ్రై కట్టర్’. బంగాళాదుంపను చెక్కు తీసి, దీనిలో పెట్టి, స్టేప్లర్ని నొక్కినట్టు ఒక్క నొక్కు నొక్కితే చాలు... క్షణంలో క్షణంలో పొడవాటి ముక్కలు రెడీ. వీటిని నూనెలో డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. వెల కూడా పెద్ద ఎక్కువేమీ కాదు. రూ. 500 లోపే! -
ఇక వేపుళ్లు ధైర్యంగా తినొచ్చు!
డీప్ ఫ్రై... ఆరోగ్యంగా ఉండాలనుకునేవాళ్ల డిక్షనరీ నుంచి ఈ మాటను తొలగించాల్సిందే అంటారు వైద్యులు. కడాయి నిండా నూనె పోసి, అందులో మునిగేలా చేసి మరీ వేయించే ఆహార పదార్థాలను తింటే ఆయువు తరుగుతూ పోతుంది. అందుకే వాటికి ఫుల్స్టాప్ పెట్టాల్సి వస్తుంది. అలాగని జిహ్వను చంపుకోలేం. ఏదో ఒక సమయంలో నాలుక పీకుతూనే ఉంటుంది... మాంచి వేపుడు లాగించాలని! అలాంటప్పుడు మనల్ని ఆదుకుని, మన ఆశను తీరుస్తుంది ఈ డీప్ ఫ్రయర్! యాక్టీఫ్రయర్ అని పిలిచే ఈ చిన్ని యంత్రంలో వేపుడు చేయడానికి ఒక్క నూనె చుక్క కూడా వేయాల్సిన పని లేదు. వేయించాలనుకున్నవాటిని వేసి, మూత పెట్టి, బటన్ నొక్కితే చాలు... చక్కగా వేగిపోతాయి. మరీ నూనె తగలకుండా తినలేం అనుకుంటే, ఓ చెంచాడు వేసుకుంటే చాలు. ఆ చెంచా కూడా ఫ్రయర్తో పాటే వస్తుంది. నూనె వేసినా, వేయకపోయినా మాడిపోవడమనే సమస్యే ఉండదు. ఎంత వేగాలో దాన్ని బట్టి వేడిమిని ముందే సెట్ చేసేసుకుంటే, వేగాక యంత్రం అదే ఆగిపోతుంది. రెండు వేపుళ్లను ఒకేసారి చేసుకునే వెసులుబాటు కూడా ఉంది (రెండు అరలు ఉంటాయి. మొదటి ఫొటో చూడండి). అందుకే దీన్ని మల్టీకుక్కర్ అని కూడా అంటారు. ఇంత ఉపయోగం ఉన్న ఈ ఫ్రయర్ వెల... మూడు వేల లోపే!