రాన్స్లో మరోసారి కాల్పుల మోత మోగింది. మార్సెల్లీలో దుండగులు పోలీసులపై కాల్పులు జరిపారు
పారిస్: ఫ్రాన్స్లో మరోసారి కాల్పుల మోత మోగింది. మార్సెల్లీలో దుండగులు పోలీసులపై కాల్పులు జరిపారు. ఫ్రాన్స్ ప్రధాని మార్సెల్లీలో పర్యటిస్తున్న సమయంలోనే సాయుధులు దాడికి పాల్పడం గమనార్హం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
ఫ్రాన్స్ రాజధాని పారిస్లో ఇటీవల ఉగ్రవాదులు పత్రికాకార్యాలయంపై దాడి చేసి 12 మందిని కాల్చి చంపిన సంగతి తెలిసిందే. ఫ్రాన్స్ భద్రతాధికారుల ఆపరేషన్లో ఉగ్రవాద సోదరులు హతమయ్యారు.