Marseille
-
ఫ్రాన్స్‌లో రౌడీల వీర విహారం
మర్సెల్లీ: ఫ్రాన్స్‌లో అనుమానిత గూంఢాలు తెగబడ్డారు. కాల్పులు జరిపి ముగ్గురు ప్రాణాలు బలితీసుకున్నారు. దీంతో రౌడీల కాల్పుల కారణంగా చనిపోయినవారి సంఖ్య ఈ కొత్త సంవత్సరంలో ఎనిమిదికి చేరినట్లు పోలీసు అధికారులు చెప్పారు. మరో ముగ్గురు కూడా గాయాలపాలయినట్లు చెప్పారు. అధికారుల సమాచారం ప్రకారం మర్సెల్లీలో రాత్రి 10.30గంటల ప్రాంతంలో ఓ నాలుగంతస్తుల భవంతిలోకి చొరబడిన అనుమానిత గూంఢాలు ఆ వెంటనే కాల్పులు జరిపి పారిపోయారు. గత ఏడాదిలో కూడా ఇదే మర్సెల్లీలో 19 మంది, 2014లో 18మంది, 2013లో 17 మంది అనుమానిత గ్యాంగ్ స్టర్ల వల్ల అమాయక ప్రజలు ప్రాణాలు విడిచారు. -
మార్సెల్లీలో అలల విలయ తాండవం
-
ఫ్రాన్స్‌లో మళ్లీ కాల్పుల మోత.. పోలీసులపై దాడి
పారిస్: ఫ్రాన్స్‌లో మరోసారి కాల్పుల మోత మోగింది. మార్సెల్లీలో దుండగులు పోలీసులపై కాల్పులు జరిపారు. ఫ్రాన్స్ ప్రధాని మార్సెల్లీలో పర్యటిస్తున్న సమయంలోనే సాయుధులు దాడికి పాల్పడం గమనార్హం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఇటీవల ఉగ్రవాదులు పత్రికాకార్యాలయంపై దాడి చేసి 12 మందిని కాల్చి చంపిన సంగతి తెలిసిందే. ఫ్రాన్స్ భద్రతాధికారుల ఆపరేషన్‌లో ఉగ్రవాద సోదరులు హతమయ్యారు.