
ఎంతో ముచ్చట పడి పిల్లిని పెంచుకుందామనుకున్న ఫ్రెంచ్ జంటకు ఊహించని పరిణామం ఎదురైంది. తాము తెచ్చుకున్నది పిల్లిని కాదు పులి పిల్లను అని తెలిసి షాక్‌కి గురయ్యారు. వివరాల ప్రకారం.. నార్మాండీకి చెందిన లా హవ్రే అనే దంపతులు సవన్నా జాతి పిల్లి కోసం ఆన్‌లైన్ ప్రకటన చూసి దాన్ని పెంచుకుందామనుకున్నారు. దాదాపు 6000 యూరోలకు కొనుకుని ఎంతో ఇష్టంగా పిల్లిని ఇంటికి తెచ్చుకున్నారు. వారం గడిచే లోపే తమతో పాటు ఇంట్లో ఉంటున్నది పిల్లి కాదు మూడు నెలల పులి పిల్ల అని గ్రహించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పులిని కొనుగోలు చేయడంతో పాటు అక్రమంగా రవాణా చేసినట్లు ఈ జంటపై అభియోగాలు వెలువడ్డాయి. దీంతో వీరితో పాటు తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. రెండేళ్ల పాటు జరిగిన సుధీర్ఘ విచారణ అనంతరం దంపతులను నిర్ధోషులుగా ప్రకటిస్తూ కేసును కొట్టివేశారు. ప్రస్తుతం పులిని ఫ్రెంచ్ బయో డైవర్సిటీ కార్యాలయ అధికారులకు అప్పగించారు. పులి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని అధికారులు తెలిపారు. (వైరల్: రికార్డు సృష్టించిన కొండచిలువ)
Comments
Please login to add a commentAdd a comment