కొన్ని చిత్రవిచిత్రమైన ఘటనలు మన కళ్ల ముందే జరుగుతుంటయ్. వాటి గురించి తెలిసినప్పుడల్లా నోళ్లు వెళ్లబెట్టడం, దిమ్మ తిరిగిపోవడం మాత్రమే మన వంతు అయితది. అట్లాంటి ఎగ్జాగరేట్ అయ్యే ముచ్చటే మీకు ఇప్పుడు చెప్తున్నం. ఏం లేని దానికి నాలుగు కోట్ల రూపాయలు ఎట్లొస్తయ్ అనే డౌట్ మీకూ రావచ్చు?.. అందుకే సీదా విషయంలోకే వెళ్దాం..
ఫ్రెంచ్ దిగ్గజ ఆర్టిస్ట్ యువెస్ క్లెయిన్ 50వ దశకంలో ఓ చిలిపి పని చేసిన్రు. 1958లో ‘ది వాయిడ్’ అంటూ ఓ ఎగ్జిబిషన్ పెట్టిండాయన. అసలే ఆయన బోలెడంత ఫేమస్సు. అందుకే ఆ ఎగ్జిబిషన్ కోసం మస్తు ఖర్చు పెట్టి టికెట్లు కొనుక్కుని వచ్చిన్రు జనాలు. తీరా ఆర్ట్ గ్యాలరీలోకి పోతే.. అంతా బ్లాంక్ అయిపోయిన్రు. ఎందుకంటే.. అక్కడ ఏం లేదు కావట్టి. ఏందిది అని అడిగితే.. ఇన్విజిబుల్(ఇమాజినరీ) ఆర్ట్ వర్క్ అంటూ మైండ్ బ్లాంక్ అయ్యే సమాధానం ఇచ్చిండాయన. పైగా ప్యూర్ గోల్డ్ ఇచ్చి .. కంటికి కనవడని ఆ ఆర్ట్ పీసులను తీసుకెళ్లండంటూ బంపరాఫర్ కూడా ఇచ్చిండట. అట్లుంటది.. మరి ఆయనతోని!.
ఏం లేని ఆర్ట్‌వర్క్ ఆయన ఆఫర్ చేయడంతో జనాలు తిట్టుకుంటున్నారని అనుకుంటం కదా!. సారీ.. ఇక్కడే సీన్ ఉల్టా అయ్యింది. బంగారం ఇచ్చి.. ఆ ఆర్ట్ పీసులను(ఏం ఉండదు) కొనుక్కుపోయిన్రు వాళ్లంతా. అయితే జనాల్ని డిస్పాపాయింట్ చేసుడు ఇష్టం లేని ఆయన.. ఆ ఆర్ట్ పీసుల వంతుకు అమ్మినట్లు రిసిప్ట్‌లు మాత్రం ఇచ్చిండట. అట్లా.. 1959, డిసెంబర్ 7న అమ్ముడువోయిన ఓ ఇన్విజిబుల్ ఆర్ట్ పీస్‌ను యాంటీక్విటీ డీలర్ జాక్వెస్ కుగెల్ కొనుక్కున్నడు.
అగో.. ఆ రిసిప్ట్ తోనే గిప్పుడు గా కళ్లకు కనవడని ఆ ఆర్ట్ వర్క్‌ను వేలం వేస్తున్నారంట. యువెస్ క్లెయిన్ చనిపోయి మస్తు ఏండ్లు అయితున్నా.. ఆయన దస్కత్ ఉన్న ఆ రిసిప్ట్, అదేవోయ్ ఇన్విజిబుల్ ఆర్ట్ పీస్.. సుమారు5,50,000 డాలర్లు కనీస ధర పలకొచ్చని అంచనా ఎసిన్ను. అంటే మన పైసళ్లలా నాలుగు కోట్ల రూపాయలకు పైమాటే. సోథ్‌బైస్ ఆక్షన్ హౌజ్ మాత్రం.. అంతకుమించే పైసలు రాబట్టొచ్చని అంటోంది మరి.
ఇంకో ముచ్చట జెప్పాలె.. ఈ రిసిప్ట్‌కు ఇంకో స్పెషాలిటీ ఉంది. యువెస్ క్లెయిన్ yves kleinకు ఒక చిత్రమైన హ్యాబిట్ ఉండేదట. అమ్మేసిన బొమ్మలకు రిసిప్ట్‌లను కాల్చేసి.. వాళ్లు ఇచ్చిన బంగారంలో సగం ‘సీన్ నది’లోకి ఇసిరిపడేయమని కొనుక్కున్నోళ్లకు చెప్పేటోడట. సో, అట్ల చూసినా ఆయన దస్కత్‌తో మిగిలిపోయిన లాస్ట్ రిసిప్ట్ ఇదే. అందుకే అంత రేట్ వస్తదని అనుకుంటున్నరు మరి!.
చమక్కులు
► కమెడియన్ comedian.. 2019లో సోషల్ మీడియాను ఊపేసిన ఓ టాపిక్. ఫ్రెష్ బనానాను , సిల్వర్ టేప్‌తో గోడకు అంటించి.. అదే ఒక ఆర్ట్ వర్క్ అంటూ ప్రచారం చేసిన్రు కొందరు. అట్ల బసెల్ మియామీ బీచ్ ఆర్ట్ గ్యాలరీతో 1,20,000 డాలర్లు వచ్చినయట. పోనీలేండి.. కనీసం ఇది కళ్లకైనా కనవడ్డది.
► కానీ, కిందటి ఏడాదిల ఇటాలియన్ ఆర్టిస్ట్ సాల్వటోర్ గరావు(67) అసలు ఉందో లేదో ఆర్ట్‌వర్క్‌ను వేలం ఎసి.. సుమారు 18 వేల డార్లు సంపాదించుడు. ఏం తెలివో ఏమో!.
Comments
Please login to add a commentAdd a comment