invisible funds
-
అక్కడేం లేదు.. అయినా నాలుగు కోట్లు, అట్లుంటది మరి!
కొన్ని చిత్రవిచిత్రమైన ఘటనలు మన కళ్ల ముందే జరుగుతుంటయ్. వాటి గురించి తెలిసినప్పుడల్లా నోళ్లు వెళ్లబెట్టడం, దిమ్మ తిరిగిపోవడం మాత్రమే మన వంతు అయితది. అట్లాంటి ఎగ్జాగరేట్ అయ్యే ముచ్చటే మీకు ఇప్పుడు చెప్తున్నం. ఏం లేని దానికి నాలుగు కోట్ల రూపాయలు ఎట్లొస్తయ్ అనే డౌట్ మీకూ రావచ్చు?.. అందుకే సీదా విషయంలోకే వెళ్దాం.. ఫ్రెంచ్ దిగ్గజ ఆర్టిస్ట్ యువెస్ క్లెయిన్ 50వ దశకంలో ఓ చిలిపి పని చేసిన్రు. 1958లో ‘ది వాయిడ్’ అంటూ ఓ ఎగ్జిబిషన్ పెట్టిండాయన. అసలే ఆయన బోలెడంత ఫేమస్సు. అందుకే ఆ ఎగ్జిబిషన్ కోసం మస్తు ఖర్చు పెట్టి టికెట్లు కొనుక్కుని వచ్చిన్రు జనాలు. తీరా ఆర్ట్ గ్యాలరీలోకి పోతే.. అంతా బ్లాంక్ అయిపోయిన్రు. ఎందుకంటే.. అక్కడ ఏం లేదు కావట్టి. ఏందిది అని అడిగితే.. ఇన్విజిబుల్(ఇమాజినరీ) ఆర్ట్ వర్క్ అంటూ మైండ్ బ్లాంక్ అయ్యే సమాధానం ఇచ్చిండాయన. పైగా ప్యూర్ గోల్డ్ ఇచ్చి .. కంటికి కనవడని ఆ ఆర్ట్ పీసులను తీసుకెళ్లండంటూ బంపరాఫర్ కూడా ఇచ్చిండట. అట్లుంటది.. మరి ఆయనతోని!. ఏం లేని ఆర్ట్‌వర్క్ ఆయన ఆఫర్ చేయడంతో జనాలు తిట్టుకుంటున్నారని అనుకుంటం కదా!. సారీ.. ఇక్కడే సీన్ ఉల్టా అయ్యింది. బంగారం ఇచ్చి.. ఆ ఆర్ట్ పీసులను(ఏం ఉండదు) కొనుక్కుపోయిన్రు వాళ్లంతా. అయితే జనాల్ని డిస్పాపాయింట్ చేసుడు ఇష్టం లేని ఆయన.. ఆ ఆర్ట్ పీసుల వంతుకు అమ్మినట్లు రిసిప్ట్లు మాత్రం ఇచ్చిండట. అట్లా.. 1959, డిసెంబర్ 7న అమ్ముడువోయిన ఓ ఇన్విజిబుల్ ఆర్ట్ పీస్‌ను యాంటీక్విటీ డీలర్ జాక్వెస్ కుగెల్ కొనుక్కున్నడు. అగో.. ఆ రిసిప్ట్ తోనే గిప్పుడు గా కళ్లకు కనవడని ఆ ఆర్ట్ వర్క్‌ను వేలం వేస్తున్నారంట. యువెస్ క్లెయిన్ చనిపోయి మస్తు ఏండ్లు అయితున్నా.. ఆయన దస్కత్ ఉన్న ఆ రిసిప్ట్, అదేవోయ్ ఇన్విజిబుల్ ఆర్ట్ పీస్.. సుమారు5,50,000 డాలర్లు కనీస ధర పలకొచ్చని అంచనా ఎసిన్ను. అంటే మన పైసళ్లలా నాలుగు కోట్ల రూపాయలకు పైమాటే. సోథ్బైస్ ఆక్షన్ హౌజ్ మాత్రం.. అంతకుమించే పైసలు రాబట్టొచ్చని అంటోంది మరి. ఇంకో ముచ్చట జెప్పాలె.. ఈ రిసిప్ట్కు ఇంకో స్పెషాలిటీ ఉంది. యువెస్ క్లెయిన్ yves kleinకు ఒక చిత్రమైన హ్యాబిట్ ఉండేదట. అమ్మేసిన బొమ్మలకు రిసిప్ట్‌లను కాల్చేసి.. వాళ్లు ఇచ్చిన బంగారంలో సగం ‘సీన్ నది’లోకి ఇసిరిపడేయమని కొనుక్కున్నోళ్లకు చెప్పేటోడట. సో, అట్ల చూసినా ఆయన దస్కత్తో మిగిలిపోయిన లాస్ట్ రిసిప్ట్ ఇదే. అందుకే అంత రేట్ వస్తదని అనుకుంటున్నరు మరి!. చమక్కులు ► కమెడియన్ comedian.. 2019లో సోషల్ మీడియాను ఊపేసిన ఓ టాపిక్. ఫ్రెష్ బనానాను , సిల్వర్ టేప్‌తో గోడకు అంటించి.. అదే ఒక ఆర్ట్ వర్క్ అంటూ ప్రచారం చేసిన్రు కొందరు. అట్ల బసెల్ మియామీ బీచ్ ఆర్ట్ గ్యాలరీతో 1,20,000 డాలర్లు వచ్చినయట. పోనీలేండి.. కనీసం ఇది కళ్లకైనా కనవడ్డది. ► కానీ, కిందటి ఏడాదిల ఇటాలియన్ ఆర్టిస్ట్ సాల్వటోర్ గరావు(67) అసలు ఉందో లేదో ఆర్ట్‌వర్క్‌ను వేలం ఎసి.. సుమారు 18 వేల డార్లు సంపాదించుడు. ఏం తెలివో ఏమో!. -
అదృశ్య నిధులే నడిపిస్తున్నాయ్
♦ 70 ఏళ్లుగా వీటిని నియంత్రించడంలో విఫలమయ్యాం: జైట్లీ ♦ ఎలక్టోరల్ బాండ్ల యంత్రాంగం దిశగా చర్యలు న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలకు అందే నిధులకు సంబంధించి ఎలక్టోరల్ బాండ్ ల అమలు కోసం ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని ఆర్థిక మంత్రి జైట్లీ చెప్పారు. పార్టీలకు అందే నిధులు పారదర్శకంగా ఉండటానికి ఉద్దేశించిన ఈ విధానానికి సంబంధించి రాజకీయ పార్టీల నుంచి ఒక్క ప్రతిపాదనా రాలేదన్నారు. గత 70 ఏళ్లుగా దేశ ప్రజాస్వా మ్యాన్ని అదృశ్య నిధులే నడిపిస్తు న్నాయని, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వా లు, రాజకీయ పార్టీలు, ఎన్నికల కమిషన్ వీటిని నియంత్రించడంలో విఫలమయ్యా యని అన్నారు. రాజకీయ పార్టీల కు వచ్చే విరాళాలకు సంబంధించి పారదర్శకతను తీసుకొచ్చేందుకు ఈ ఏడాది బడ్జెట్లో ప్రతిపాదనలు చేసిన జైట్లీ.. పార్టీలకు వచ్చే నగదు విరాళాలను రూ.2 వేలకు పరిమితం చేయడమే కాక ఎలక్టోరల్ బాండ్లను ప్రవేశపెట్టారు. ప్రస్తుత విధానమే నచ్చిందేమో.. శనివారం ఢిల్లీ ఎకనామిక్స్ కాంక్లేవ్‌లో జైట్లీ మాట్లాడుతూ..‘నిధులకు సంబంధించి మెరుగైన ప్రతిపాదనలు ఇవ్వాల్సిందిగా.. పార్టీలకు మౌఖికంగా.. రాతపూర్వకంగా కోరాను. ఇప్పటి వరకూ ఎవరూ ఒక్క ప్రతి పాదనతో ముందుకు రాలేదు. ఎందు కంటే ప్రస్తుతం ఉన్న వ్యవస్థతో వీరంతా సంతృ ప్తిగా ఉన్నట్టున్నారు’’అని అన్నారు. రాజకీ య వ్యవస్థలోకి వస్తున్న అదృశ్య నిధులకు అడ్డుకట్ట వేయలేకపోయామని, సంబంధించి ప్రతీ ప్రతిపాదనలో ఏదో లోపం ఉండటంతో ఈ రోజుకూ పరిష్కా రం దొరకలేదన్నారు. గత బడ్జెట్లో తాను ఒక పరిష్కారాన్ని ప్రతిపాదించానని, ఈ దిశగా ప్రస్తుతం చర్యలు తీసుకుంటు మన్నారు. ఏమిటీ ఎలక్టోరల్ బాండ్లు.. బడ్జెట్లో ప్రకటించిన ప్రకారం.. ప్రతిపాది త ఎలక్టోరల్ బాండ్లు వడ్డీ చెల్లించే రుణ పత్రాలుగా కాక.. ఒక ప్రామిసరీ నోటుగా ఉంటాయి. వీటిని అధీకృత బ్యాంకులు అమ్ముతాయి. వచ్చిన నిధులను సంబం ధిత రాజకీయ పార్టీలకు చెందిన ఖాతాల్లో నిర్దేశిత కాలానికి డిపాజిట్ చేస్తాయి. ఈ బాండ్లపై దాత పేరు ఉండదు. బ్యాంకుల ద్వారా నిధులు రావడం వల్ల పన్ను చెల్లిం చిన నగదు మాత్రమే రాజకీయ వ్యవస్థలోకి వస్తుంది. జీఎస్టీతో పన్ను పరిధి విస్తృతం పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలులోకి రావ డంతో పన్నుల పరిధి విస్తృతమైందని, వీటి వల్ల నగదు లావాదేవీలు చేయడం కష్టంగా మారుతోందన్నారు. ఇది పన్నుల వ్యవస్థ పరిధిని పెంచడానికి.. పన్ను చెల్లిం పులను ప్రోత్సహించడానికి దోహదం చేస్తుందని చెప్పారు. విదేశీ బ్యాంకుల్లో ఉన్న నల్లధనంతో పాటు దేశంలోని వివిధ బ్యాంకుల్లోని నల్లధనాన్ని వెలికి తీసేం దుకు చట్టాల ను కఠినతరం చేశామని, డొల్ల కంపెనీలపైనా కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దేశంలో పన్ను చెల్లించవలసిన వారిలో అత్యధికులు ఆ పని చేయడం లేదని, వ్యవస్థకు బయటే భారీగా నగదు చలామణి అవుతోందని వివరించారు. ఆర్థిక బిల్లు ద్వారా కొన్ని మార్పులను ప్రకటిస్తున్నా.. వాటి ప్రభా వం స్వల్పంగా ఉంటోందన్నారు.