- జిల్లాలో 187 క్లస్టర్‌లలో ప్రయోగాత్మకంగా అమలు
- రికార్డులన్నీ కంప్యూటరీకరణ
- మండల పరిషత్ కార్యాలయాలకు చేరిన కంప్యూటర్లు
నూజివీడు, న్యూస్‌లైన్ : పంచాయతీ కార్యాలయాల్లో త్వరలో ఆన్‌లైన్ విధానం అందుబాటులోకి రానుంది. రోజురోజుకూ అందుబాటులోకి వస్తున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకు ని పంచాయతీరాజ్ సంస్థలను శక్తివంతం చేయడానికి ఆన్‌లైన్ విధానానికి పాలకులు శ్రీకారం చుడుతున్నారు. దీని అమలు కోసం జిల్లాలో పంచాయతీ లను 519 క్లస్టర్లుగా విభజించారు. వీటిలో 187 క్లస్టర్లలో మొదటి విడతగా దీనిని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. వీటిలో ఈ వి ధానం విజయవంతమైతే మిగిలిన పంచాయతీ ల్లో కూడా అమలుచేస్తారు.
ఈ-పంచాయతీ పేరుతో అమలు చేస్తున్న ఈ కార్యక్రమానికి సంబంధించిన కంప్యూటర్లు, పరికరాలు సంబంధిత ఎంపీడీఓ కార్యాలయాలకు చేరాయి. ఈ వి ధానం అమలులోకి వస్తే పంచాయతీలకు సం బంధించి మనకు అవసరమైన సమాచారాన్ని ఎక్కడినుంచైనా తెలుసుకునేందుకు వీలు కలుగుతుంది. ఆయా పంచాయతీల్లో జరిగే అభివృద్ధి పనుల వివరాలు, అవి ఏ దశల్లో ఉన్నా యో కూడా తెలుసుకోవచ్చు.
ప్రభుత్వాల నుంచి వచ్చిన నిధులు, వాటి వినియోగం తదితర అం శాలను కూడా తెలుసుకోవడానికి వీలవుతుంది. పంచాయతీల్లో ఆన్‌లైన్ విధానాన్ని అమలు చేసే ప్రక్రియను కార్వే సంస్థకు అప్పగించారు. ఈ సంస్థ కంప్యూటర్ ఆపరేటర్లను ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో నియమించి, 187 క్లస్టర్లలో ఆన్‌లైన్ వి ధానాన్ని అమలు చేస్తుంది.
ఈ విధానంలో భాగంగా పంచాయతీల్లో ఉన్న జనన మరణాల నమోదు రిజిస్టర్, ఇంటిపన్నులు, లెసైన్స్ ఫీజులు, పనుల పర్యవేక్షణ, పం చాయతీలకు వచ్చిన గ్రాంట్ల వివరాలు, వేలం పాటలు, పంచాయతీ సిబ్బంది సమాచారం తది తర వివరాలన్నీ కంప్యూటరీకరణ చేసి ఆన్‌లైన్‌లో ఉంచుతారు. దీంతో అన్ని రకాల సేవలు పంచాయతీల్లో ప్రజలకు అందుబాటులోకి వస్తాయి.
పంచాయతీలకు ఏ పద్దు కింద ఎంత నిధు లు వచ్చాయి.. వాటిని ఖర్చుచేసిన విధానం ఎలా ఉంది.. తదితర విషయాలన్నీ ఆన్‌లైన్‌లో చూసుకోవచ్చు. ఈ విషయమై డీపీఓ ఆనంద్ ను ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా, కంప్యూట ర్లతో పాటు సంబంధిత సామగ్రిని కూడా ఆయా మండల పరిషత్ కార్యాలయాలకు పం పించామని చెప్పారు. త్వరలోనే ఈ విధానాన్ని అ మలు చేస్తామని పేర్కొన్నారు.