ప్రకృతికి సెగ, తుపాన్ల పగ | nature, cyclone fury | Sakshi
Sakshi News home page

ప్రకృతికి సెగ, తుపాన్ల పగ

Published Mon, Oct 13 2014 11:49 PM | Last Updated on Sat, Sep 2 2017 2:47 PM

ప్రకృతికి సెగ, తుపాన్ల పగ

ప్రకృతికి సెగ, తుపాన్ల పగ

వాన రాకడ, ప్రాణం పోకడ ఎవరికీ తెలియదన్న సామెతకు కాలం చెల్లిపోయింది.  ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వేగంగా పురోగమించింది. ఇదిప్రకృతి విలయాలూ, ఉపద్రవాలూ, వాటితో జరిగే విధ్వంసాలనూ కొన్ని రోజుల ముందుగానే పసికట్టి హెచ్చరికలు చేయగలుగుతోంది. కానీ ఎంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్నా, అది హెచ్చరించగలదే కానీ, బాధిత ప్రజలను ఒడ్డున పడవేసే చైతన్యాన్ని కలిగించలేదు.
 ఆ పని మానవ చైతన్యంతోనే సాధ్యం. ఇదే ఆ హెచ్చరికలకు ఆచరణలో విలువను సమకూరుస్తుంది.
 
తూర్పు కోస్తాతీరంలోని ఆంధ్రప్రదేశ్, ఒడిశా ప్రాంతాల రూపురేఖలను హుదూద్ సర్వ నాశనం చేసింది. విశాఖ పట్నం దగ్గర తీరం దాటి, ఆ నగరానికి పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ రెండు రాష్ట్రాలలో జన జీవనాన్నీ, గ్రామా లనూ, అన్ని రకాల కమ్యూనికేషన్ వ్యవస్థలను (రోడ్డు, రైల్వే మార్గాలు సహా) ఛిన్నాభిన్నం చేసింది. లక్షల ఎక రాలలో రకరకాల పంటలను నేలమట్టం చేసింది. భారత నావికా వ్యవస్థలో కీలకమైన ఈస్ట్రన్ నావెల్ కమాండ్‌కు కీలకంగా ఉన్న నగరం విశాఖ. ఆ నగర సౌందర్యం తుపా ను విలయంలో ధ్వంసమైంది. ఒక శాడిస్టు మనోవికా రంతో హుదూద్ అక్కడే తీరం దాటింది.

మరో తుపాను పొంచి ఉందా?

 గత సంవత్సరం ఇదే అక్టోబర్‌లో కోస్తాను అతలాకుతలం చేసిన ‘పైలీన్’ బీభత్సం కన్నా ఎన్నో రెట్లు బీభత్సాన్ని నిన్నటి హుదూద్ సృష్టించింది. విషాదం ఏమిటంటే హుదూద్ విసిరిన గాలులు పెట్టిన ఘోష సైతం ఇంకా ప్రజలకు మరపునకు రాలేదు. కానీ మరో దుర్వార్త అప్పు డే సిద్ధమైపోయింది. కొద్దిరోజులలోనే- బహుశా ఈ నెలా ఖరులో లేదా నవంబర్ ఒకటో తేదీ సమీపంలోనో మరో పెను తుపాను పట్టవచ్చునని, అది ఉత్తరాంధ్రప్రదేశ్- చెన్నై కోస్తా వైపుగా దూసుకొచ్చే అవకాశం ఉందని ‘నాసా’(అమెరికా)కు చెందిన, జపాన్‌కు చెందిన శాస్త్ర వేత్తలు కొందరు అంచనా వేస్తున్నారు. దీనికి ఇంకా పేరు పెట్టలేదు. ఈ తుపాను పంజా విసరవచ్చు. లేదా తప్పి పోనూ వచ్చు. ఇది కూడా అండమాన్ దీవులలోనే  తలెత్తే అవకాశం ఉందని వారి ఊహ.

హుదూద్ అడుగుజాడలలో...

 ఆసియాను ముమ్మరించిన రెండు పెను తుపానులలో హుదూద్ ఒకటి. దీని ఫలితాన్ని చూశాం. మరొకటి వొంగ్‌ఫాంగ్. ఇది జపాన్ దిశగా కదులుతున్న విలయం. హుదూద్ మాదిరిగానే ఇది కూడా గంటలకు 180 కిలో మీటర్ల వేగంతో వీచే గాలులను మూట కట్టుకుని బయలు దేరింది. జపాన్‌లోని ఒకినావా నగరాన్ని గాలిదుమా రంతో, భారీ వర్షంతో ముంచెత్తింది. ఇక్కడితో తన ప్రతాపాన్ని చాలించకుండా జపాన్‌లోదే కియుషీ దీవిని కూడా కబళించనున్నదని అంచనా. అందుకే ముందస్తు చర్యగా అధికార యంత్రాంగం అక్కడ నివసించే లక్షన్నర జనాభాను సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. ఇది కూడా హుదూద్ అడుగుజాడలలోనే ఆదివారమే తీరం దాటింది.
 ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో హుదూద్ తాకిడికి గుర య్యే ప్రమాదం ఉన్న ప్రాంతాల నుంచి నాలుగు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించవలసి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలలో తుపాను కారణంగా కోటిన్నర జనాభా అన్నపానీయాలు లేకుండా బితుకుబితుకు మం టూ బతికారు. అనేక ఇక్కట్లకు గురయ్యారు. అన్నింటి కన్నా విచిత్రం ఏమిటంటే- ఇంతవరకు నమోదైన చరి త్రను బట్టి భారత ఉపఖండంలో 35 రాకాసి తుపానులు సంభవించాయి. అందులో 27 భీకర తుపానులకు బంగా ళాఖాతమే పురుడుపోసింది. అందుకే హిందూ మహా సముద్రం ఉష్టమండల తుపానులకు కేంద్ర స్థానమైందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. అలాగే పైలీన్ లేదా, హుదూ ద్, ఈ రెండూ కూడా  గత పదేళ్ల నుంచి పర్యావరణంలో, వాతావరణంలో కలుగుతున్న మార్పుల ఫలితాలేనని శాస్త్ర వేత్తలు చెబుతున్నారు. హుదూద్  అంటే ఇజ్రాయెల్ జాతీ య పక్షి పేరు. ఈ తుపానుకు ఒమన్ ప్రభుత్వం ఈ పేరు పెట్టింది.

పరిజ్ఞానం ప్రయోజనం ఎప్పుడు?

 వాన రాకడ, ప్రాణం పోకడ ఎవరికీ తెలియదన్న సామె తకు కాలం చెల్లిపోయింది.  ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వేగంగా పురోగమించింది. ఇదిప్రకృతి విలయాలూ, ఉప ద్రవాలూ, వాటితో జరిగే విధ్వంసాలనూ కొన్ని రోజుల ముందుగానే పసిగట్టి హెచ్చరికలు చేయగలుగుతోంది. కానీ ఎంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్నా, అది హెచ్చరించగ లదే కానీ, బాధిత ప్రజలను ఒడ్డున పడవేసే చైతన్యాన్ని కలిగించలేదు. ఆ పని మానవ చైతన్యంతోనే సాధ్యం. ఇదే ఆ హెచ్చరికలకు ఆచరణలో విలువను సమకూరుస్తుంది. హుదూద్ విజృంభించబోతున్న సంగతి తెలిసిన తరువాత ఈ పనిని సైనిక, నావికా దళాలు చేపట్టాయి. రంగంలోకి దిగి వెళ్లగలిగినంత మేర చొచ్చుకుపోయి జనాలను సురక్షిత ప్రాంతాలకు చేర్చాయి. నిజానికి ఇలాంటి విపత్తుల నుంచి కాపాడేందుకు జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలు (డిజాస్టర్ మేనేజ్‌మెంట్) లేకపోలేదు. ప్రాణనష్టం జరగకుండా లేదా ఆ నష్టాన్ని బాగా తగ్గించడానికి, ఆస్తినష్టం జరగకుండా చూడడానికి ఈ వ్యవస్థలు రూపొందించిన పథకాలకు కూడా కొరతలేదు. కానీ ఆ వ్యవస్థలు పలు సందర్భాలలో ఎందుకు సకాలంలో స్పందించడం లేదు? ప్రభుత్వాలకు, అధికారులకు పాలనానుభవం ఉన్నప్పటికీ ప్రజానీకం అం టే శ్రద్ధాసక్తులు లేనందుకే కొన్ని లోటుపాట్లు జరుగుతు న్నాయి. ప్రజా సంక్షేమం బాధ్యత నుంచి తప్పించుకునే సంస్కృతికి అలవాటు పడడం వల్ల, విపత్తుల నుంచి బయటపడగల వ్యూహరచన కొరవడినందు వల్లనే తగ్గిం చుకోగల నష్టాల పైనా కష్టాల పైనా దృష్టి సారించడం లేదు. జాతీయ విపత్తుల నివారణ ప్రాధికార వ్యవస్థను 2006లో ఏర్పాటు చేశారు. తరువాత క్రమంగా సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. ఉపగ్రహ వ్యవస్థ జాతీయంగా కూడా నిలదొక్కుకుంటున్న కొద్దీ మన వాతావరణ శాస్త్ర వేత్తలు ప్రమాద హెచ్చరికలను ముందుగానే విడుదల చేయగలుగుతున్నారు. ఇంతకు ముందున్న పరిస్థితి వేరు.  1977 నాటి దివిసీమ రాకాసి తుపాను వల్ల జరిగిన భారీ ప్రాణనష్టం (10,000) గురించి, ముంచుకొస్తున్న ఆ తుపా ను గురించి ‘నాసా’(అమెరికా) శాస్త్రవేత్తలు హెచ్చరిస్తే తప్ప మనకు తెలియలేదు.

పెరుగుతున్న తుపాను ముప్పు

 బంగాళాఖాతం భారీ తుపానులకు నిలయంగా మారింది. అందులో పుట్టిన తుపానులు తూర్పు కోస్తాను అతలాకు తలం చేస్తున్నాయి. 1891-1977 మధ్య బంగాళాఖాతం లో 400 తుపానులు జనించాయి. అలాగే 1891-1969 మధ్య వచ్చిన 453 తుపానులకు ఈ తీరమే కారణమైనట్టు శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. 1891ను ఎందుకు మైలురా యిగా తీసుకున్నారంటే, ఆ సంవత్సరమే  బందరు (మచి లీపట్నం)మీద ఘోర తుపాను పడగ విప్పింది. పట్టణ వీధులన్నీ జలమయం కావడంతో బాధితులను పడవల మీద తరలించవలసి వచ్చింది. దాదాపు అంతటి ఘోర మైన తుపానులను చవిచూసిన అనుభవం నెల్లూరు, చీరాల పట్టణాలకు కూడా ఉందని రికార్డులు వెల్ల డిస్తున్నాయి. 1969 నాటి నెల్లూరు పెను తుపాను తరు వాతనే మిటిగేషన్ కమిటీ  ఉనికిలోకి వచ్చింది. తుపాను నష్టాన్ని తగ్గించేందుకు అవసరమైన చర్యలను సూచించ డమే ఈ కమిటీ ధ్యేయం. మరో ఆసక్తికరమైన అంశం కూడా ఉంది. తుపాను బీభత్సం మరింత తీవ్రం కానున్న దని 1980లోనే అంచనా వేశారు. బీభత్సం పెరిగే కొద్దీ ఆస్తినష్టం, ప్రాణనష్టం కూడా పెరిగిపోతాయి. అందుచేత ప్రభుత్వ వ్యవస్థలు ముందస్తు జాగ్రత్తతోనే నివారణ చర్య లను బహుముఖంగా చేపట్టాలని, చావు నెత్తి మీదకు వచ్చే వరకు వేచి ఉండరాదని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆచా ర్యుడు సీవీ రాఘవులు ఒక అధ్యయన పత్రంలో స్పష్టం చేశారు. 1979 నాటి ఘోర తుపాను తరువాత ఆయన ఈ పత్రాన్ని రూపొందించారు.

అతివృష్టి-అనావృష్టి

 తుపానులు కోస్తా ఆర్థిక వ్యవస్థను దఫదఫాలుగా నాశనం చేస్తున్నాయి. ఇటు తెలంగాణ, అటు రాయలసీమ వర్షాభా వ పరిస్థితులతో ఇబ్బంది పడుతున్నాయి. దేశ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు 12 శాతం తగ్గిపోయాయి. ఒక్క తెలంగాణలోనే వర్షపాతం 30 శాతం తగ్గింది. నిజానికి కడచిన దశాబ్దంగా దేశంలో వర్షపాతం తక్కువై వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని భారత ఉష్టమండల వాతావ రణ సంస్థ (పుణే) మాజీ సంచాలకుడు బీఎన్ గోస్వామి అంచనా వేశారు. దీని ప్రభావం ధాన్యం ఉత్పత్తి పైన, సగటు జాతీయోత్పత్తులపైనా కూడా ఉండబోతోంది. పర్యావరణంలో మార్పులతోను, పసిఫిక్ సముద్ర ప్రాం తంలో పుట్టి పెరుగుతున్న ఎల్-నినో, లానినో వాతావరణ వ్యవస్థల వల్ల తుపానులు, అతివృష్టి, అనావృష్టి ఏర్పడు తున్నాయి. ఇండియాలో ఉష్ణోగ్రతలు పెరగడానికి ప్రపం చ పర్యావరణం వేడెక్కి పోవడం కూడా కారణమేనని, ఈ పరిణామంతో వాతావరణంలో ఆవిరి పెరిగిపోతోందని ప్రొఫెసర్ గోస్వామి అంచనా. ఒకటి వాస్తవం- ‘మట్టి ఎప్పటికప్పుడు కలవరిస్తుంటుంది/ వాన నీటి స్పర్శ కోసం’ అన్న సహజ సూత్రాన్ని మరచిపోరాదు.     
 
 ఏబీకే ప్రసాద్


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement