సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా భూముల రీసర్వేకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మనుషులకు ఆధార్ (విశిష్ట గుర్తింపు సంఖ్య) ఇచ్చినట్లుగా ప్రతి ల్యాండ్ బిట్‌కు భూధార్ నంబరు కేటాయించి అత్యాధునిక కంటిన్యూయస్ ఆపరేటింగ్ రిఫరెన్స్ స్టేషన్స్ (కార్స్) టెక్నాలజీతో భూములను రీసర్వే చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఉషారాణి మంగళవారం జీఓ జారీ చేశారు. ఈ టెక్నాలజీ ద్వారా మొదటి దశ కింద పైలట్ ప్రాజెక్టుగా కృష్ణా జిల్లా జగ్గయ్య పేటలో రీసర్వే ప్రాజెక్టు కోసం ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో పెట్టిన రూ.200.15 కోట్లకు పరిపాలనామోదం ఇవ్వాలని సర్వే సెటిల్‌మెంట్ డైరెక్టర్ ప్రభుత్వాన్ని కోరారు. (కరోనా టెస్టుల్లో ఏపీ మరో రికార్డు)
దీంతోపాటు కొన్ని పరికరాల కొనుగోలుకు అనుమతి కోరారు. ‘రీసర్వే ఫేజ్–1, ఫేజ్–2 కోసం 65 బేస్ స్టేషన్లు, కంట్రోల్ సెంటర్ల స్థాయి పెంపు, నిర్వహణ కోసం నిధులు విడుదల చేయాలి. 11,158 రోవర్స్ కొనుగోలుకు పరిపాలనామోదం ఇవ్వాలి’ అని సర్వే డైరెక్టర్ కోరారు. దీనిని పరిశీలించిన ప్రభుత్వం అనుమతించింది. సాధ్యమైనంత తక్కువ ఖర్చుతో, కొలతల్లో ఏమాత్రం లోపం లేనివిధంగా రీసర్వే పనులు చేపట్టాలని ఆదేశించింది. (మీ బడ్జెట్‌కు తగ్గట్టుగా కరెంట్ బిల్లు..)
Comments
Please login to add a commentAdd a comment