సమగ్రంగా భూముల సర్వే చేపట్టాలని అధికారులకు కేసీఆర్ ఆదేశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని భూముల సమగ్ర సర్వేను పరిశ్రమల శాఖ, రెవెన్యూ శాఖ సంయుక్తంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ సూచించారు. భూముల వివరాలన్నీ కలెక్టరేట్ల వద్దనున్న ల్యాండ్ ఇన్వెంటరీలో ఒకరకంగా, క్షేత్రస్థాయిలో మరో రకంగా ఉంటున్నాయన్నారు. ఈ రికార్డుల్లో తప్పులను సరిదిద్దాలని హెచ్‌ఐసీసీలో జరిగిన సమావేశంలో అధికారులకు సూచించారు. పరిశ్రమల ఏర్పాటుకు వ్యవసాయ యోగ్యం కాని భూమి ఎంత ఉందని సీఎం కార్యాలయం కోరితే.. కలెక్టర్లు 40 లక్షల ఎకరాలు ఉందన్నారని... వెంటనే పరిశ్రమలు ఏర్పాటు చేయగలిగేలా చిన్నచిన్న రాళ్లు రప్పలు తొలగిస్తే ఎంత ఉంటుంది? అని అడగ్గా 5 లక్షల ఎకరాలు తగ్గిపోయిందని సీఎం తెలిపారు. అధికారులు తాజాగా 20 లక్షల ఎకరాల సాగుయోగ్యం కాని భూమి ఉన్నట్లు తేలిందని వెల్లడించడంతో.. ఆ భూమిని 3 రకాలుగా విభజించాలని సీఎం సూచించారు. తక్షణమే పరిశ్రమల ఏర్పాటుకు 3 నుంచి 4 లక్షల ఎకరాల భూమి సిద్ధంగా ఉందంటున్నారని.. దీనిని తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ సిబ్బందితో కలిసి మరోసారి సర్వే చేయాలని సూచించారు.
భూ రికార్డుల్లో తప్పులన్నీ సరిచేయండి
Published Sat, Aug 2 2014 1:09 AM | Last Updated on Wed, Aug 15 2018 9:20 PM
Advertisement