
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా పెద్దాపూర్‌లో టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. రీజనల్ రింగ్ రోడ్డు కోసం అధికారులు భూ సేకరణ సర్వే చేస్తున్నారు. రైతులు సర్వేను ఆడుకున్నారు. సర్వేను అడ్డు కోవడంతో అక్కడి ఉదిక్తత వాతావరణ నెలకొంది. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. భూ సర్వే ఆడుకున్న రైతులను పోలీసులు అరెస్ట్ చేసి. డీసీఎంలో తరలించారు. రెండ్రోజుల క్రితం రీజినల్ రింగ్ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్) కోసం ప్రజాభిప్రాయ సేకరణలోను భూములు ఇవ్వబోమని రైతుల ఆందోళన చేశారు.